you are at top
బాపట్లలోని దర్శనీయ స్ధలాలు
బాపట్లలోని ప్రధాన దర్శనీయ స్థలాలు
బాపట్లను సందర్శించవలసిన రోజులు
బాపట్లలోని దర్శనీయ స్ధలాలు:-
ప్రపంచంలోని వివిధ దేశాలు పర్యాటక రంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యమిస్తున్నాయి.దాదాపు ప్రతి దేశం విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. రకరకాల ప్యాకేజీలు ప్రవేశపెడుతున్నాయి.పర్యాటక రంగాభివృద్ధి ద్వారా తమతమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు ఘనంగా తెలియజేసేందుకు ఆరాటపడుతున్నాయి.తద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యాన్ని దేశాభివృద్ధికి వినియోగిస్తూ తమ దేశాలను మరింత అభివృద్ధి చేస్తున్నాయి. చతుర్వేదాల ఆవిర్భావ భూమిగా ఘనత వహించిన మన భారతదేశం ఈ రంగంలో మిగతా దేశలతో పోటీపడుతోంది. విదేశీ టూరిస్టులను ఆకట్టుకోగల పర్యాటక ప్రదేశాలను పుష్కలంగా కలిగివుండడంతో ఒకింత ముందంజలోనే ఉందనడం అతిశయోక్తి కాదు. విభిన్న సంప్రదాయాలకు నెలవైన మన రాష్ట్రంలోనైతే పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో వున్న అనేక దర్శనీయ క్షేత్రాలు విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తుండగా, చారిత్రక క్షేత్రమైన బాపట్ల కూడా ఈ రంగంలో ముందుండి పలువురిని ఆకర్షిస్తోంది. పలు దర్శనీయ స్థలాలతో అలరారుతూ పురాతన సంస్కృతీ సంప్రదాయాల కొలువుగా ఆకట్టుకుంటోంది.
back to top
బాపట్లలోని ప్రధాన దర్శనీయ స్థలాలు:-
1. శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం (ఆలయ సమగ్ర చరిత్ర ప్రత్యేక టైటిల్ క్రింద ఇవ్వబడింది)
2. శ్రీ సోమేశ్వరాలయం (ఆలయ సమగ్ర చరిత్ర "దేవాలయాలు"లో ఇవ్వబడింది)
3. సూర్యలంక బీచ్ (బీచ్ గురించిన వివరాలు ఫొటోలతోసహా "సూర్యలంక బీచ్" చాప్టర్ లో ఇవ్వబడింది)
4. వ్యవసాయ కళాశాల ("విద్యా రంగం"లో ఈ కళాశాల చరిత్ర గురించి ఫొటోలతో సహా వివరించబడింది )
5. వ్యవసాయ కళాశాల క్షేత్రం (ఫాం) ("రీసెర్చ్ స్టేషన్లు"లో ఈ ఫాం గురించి ఇవ్వబడింది)
6. టౌన్ హాల్ ("అలనాటి సంగతులు"లో దీని చరిత్ర పొందుపరచబడింది)
back to top
బాపట్లను సందర్శించవలసిన రోజులు:-
1) రథోత్సవం నాడు
2) కార్తీక పౌర్ణమినాడు
back to top