హైదరాబాద్ : అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల విధ్వంసానికి నిరసనగా దళిత సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. పలుజిల్లాల్లో విద్యాసంస్థలు, దుకాణాలు బంద్ పాటిస్తున్నాయి. వరంగల్ జిల్లా హన్మకొండ ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ జేఏసీ వ్యాపారసంస్థలను మూసివేయించింది.
కరీంనగర్‌లోనూ బంద్ ఉద్రిక్తలకు దారితీసింది. ఆందోళనకారులు రాంనగర్‌లో ఆర్టీసీ బస్సుపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. కడపలోనూ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న దళిత సంఘాల నేతల్నిపోలీసులు అదుపులోకి తీసుకున్నారు.