సంగీతం

సంగీతం
వీనులవిందైన సంగీతానికి విలక్షణమైన వేదిక బాపట్ల.ఇక్కడ ఏవైపు నడిచినా ఏదో ఒక తీయని రాగం వెన్నంటి ఉంటుంది.సాధారణ ప్రజానీకంతో సైతం ఇక్కడి సంగీతం సహవాసం చేస్తుంది.సంగీత సాహిత్యాల బలీయమైన చెలిమి ఇక్కడి సాంస్కృతిక వైభవానికి కలిమి.అందుకే స్పష్టమైన మాట స్వచ్చమైన పాటగా రూపమెత్తి రసజ్ఞులకు రసరమ్యమైన వేడుకలను అందిస్తుంది. ఆబాలగోపాలానికి వేకువ జామున వినిపించే భూపాలం ఓ మధుర గీతమైతే హిందోళం ఓ అనురాగ బంధం. ఒక ఘడియను శివరంజని సొంతం చెసుకుంటే మరో ఘడియ సంకరాభరణమే తన అలంకారమనిగళమెత్తి చెబుతుంది.ముగ్దమోహన రూపాలను మలయమారుతం పరవశింపజేస్తే మధ్యమావతి మనోరంజకంగా అందరి మనసులను చుట్టేస్తుంది.వేసవి పూదోటలను వసంతం అలరిస్తే పంతువరాళి తన వంతుగా మమతల మంగళాక్షతలను చల్లుతుంది.అందుకే ఇక్కడ హంసధని రసరమ్య తేజమై రంజింపజేస్తుంది.కళ్యాణి ప్రతి ఒక్కరి కంఠసీమను కవితాత్మకంగా అలంకరిస్తుంది. వీనులవిందుకు సైతంవినసొంపైన సంగీతాన్ని అందించే సంగీత కళాకారులతో అలరారే బాపట్ల పట్టనమే ఓ సంగీతం ప్రపంచం, తెలుగునాట బహుళ వ్యాప్తిలో ఉన్న ఈ సంగీత సంప్రదాయాన్ని ఇక్కడి సంగీతం కళాకారులు భక్తి ప్రపత్తులతో ఆరాధించారు. నెలవారీ సంగీత కార్యక్రమాలు, సంగీతం పోటీలు నిర్వహించారు. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్నమయ్యకు పదార్చన చేస్తున్నారు. ఆకాశవాణి, టీవీల ద్వారా శాస్త్రీయ లలిత, జానపద సంగీతాలలో తమ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శింస్తున్నారు. 'శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన ఫణిః అన్న ఆర్యోక్తికి అక్షర నిదర్శనంగా నిలిచే ఈ ఊరిలో ఎంత మంది సగీతాబిమానులున్నారో అంతమంది సభా ప్రచారం ఎన్నదగినది. అది కర్ణాటక సంగీతమైనా, లలిత సంగీతమైనా, వాద్య సంగీతమైనా ఈనాటికీ రాష్ట్రంలోని లబ్దప్రతిష్టులైన సంగీత విద్వాంసులు ఇక్కడ సంగీత కార్యకేమాల్లో పాల్గొనేందుకు ఉవ్విళ్ళూరుతుంటారు. శాస్తీయ సంగీతంపట్ల ఉన్నతాభిరుచిగల సంస్దలు, సంప్రదాయ సంగీతంపట్ల ఇక్కడి సంగీతంపట్ల ఉన్నతాభిరుచిగల సంస్దలు, సంప్రాదాయ సంగీతంపట్ల ఇక్కడి సంగీతాభిమానులు చూపించే ఆదరణే అందుకు కారణం. ఇది వాగ్దేవి తన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన కళా వేదిక. ఏడు స్వరాల సంగీతానికి ఇక్కడ ఏడు రోజులూ వేడుక.


నోరి వెంకటేస్వర్లు: పాత తరం విద్యాంసుల్లో వీరు ప్రధములు. శాస్త్రీయ సంగీతాన్ని అలవోకగా ఆలపించడంతోపాటు వయోలిన్ వాయించడంలో కూడా వీరు విసేష ప్రతిభాసంపన్నులు. వీరి వద్ద సంగీత శిష్కణ పొందిన వారిలో ప్రముఖ రంగస్దల నటులు 'పద్మశ్రీ'స్దానం నరసిహ రావు గారు వకరు. తాడిగడప శేషయ్యా (1888-1950) తెలుగు సంగీతాన్ని తెలుగు గడ్డపై పునరుజ్జీవింపజేసిన విద్యాంసుల్లో వీరు ముఖ్యులు. పూర్వజన్మ సంచితమైన సంగీత జ్ఞానంతో మృదుమధుర గానంతో భావపురి సంగీతావనిని పులకింపజేసినవారు సేషయ్య గారు. అత్యంత నిరాడంపరులు. తంజావూరు, విజయవాడలలో కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. హిందూస్దానీ కూడా వీరు అభ్యసించారు. ఎంతో ఆర్తితోభక్తితో వీరు కీర్తనలను ఆలపిస్తుంటే ఆస్వాదించని హృదయముండేది కాదు. షణ్ముఖప్రియ, తోడి, భైరవి మొదలగు రాగాలను అత్యద్భుతంగా ఆలపించే వీరు త్యాగరాజ కీర్తనలు ఆలపించడంలో పేరెన్నికగన్న వారు. నాదోపాసనతో తన్మయం చెంది ఉన్మత్త స్దితిని పొందేవారు. సంగీతాభిమానులు వీరిని 'అపర త్యాగరాజూ గా కొనియాడారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ వీరు కచేరీలు చేశారు. వీరి సంగీతానికి పరవశులైన కలకత్తా సంగీతాభిమానులు వీరికి 'స్వరకళానిధీ అను బిరుదునిచ్చి ఘనంగా సత్కరించారు. తమిళనాడు నుంచి కూడా అనేక మంది సంగీత కళాకారులు వీరి వద్ద సంగీతాన్ని అభ్యసించడానికి వచ్చేవారు. ఆంధ్రదేశంలోని పేరొందిన అన్ని సంస్దానాల్లోనూ వీరు సన్మానాలు పొందారు. నాదస్వరంలో కూడా వీరు నిష్ణాతులు. 'సంగీత విద్వద్రంజన స్వరనిధీ అను విశిష్ఠమైన బిరుదును పొందిన వీరిని అభిమానించని సంగీతోపాధ్యాయులు ఉండరు. 1950 లో ఒకనాడు వీరు ఒంగోలు నుండి బాపట్ల బయల్దేరేందుకు ఒంగోలు రైల్వే ప్లాట్ ఫారం మీద వేచి ఉన్నప్పుడు, వీరిని గుర్తించిన ఒక అభిమాని వీరిని 'మరివేరే దిక్కెవరయ్య రామా అనే కీర్తనను పాడమని అభ్యర్ధించినపుడు వారి కోరికను మన్నిస్తూ ఆయన ఆ కీర్తనను ఆలపించారు.అయితే కీర్తనను ఆలపిస్తున్న ఆయన 'దరిదాపులేనీ నే చోట నెరవు చేస్తూ బ్రహ్మైక్యం పొందారు. సంగీతమే ప్రాధానంగా జీవించిన వీరు ఆ సంగీతాన్ని ఆలపిస్తూనే పరమేశ్వరుని చేరుకోవడం భావపురి సంగీతాభిమానుల హృదయాల్లో ఈనాటికీ ఓ చెదరని ఘట్టంలా నిలిచిపోయింది. నోరి నాగభూషణం (జననం:1905): వీరు తమ తండ్రిగారైన నోరి వెంకటేశ్వర్లు గారి వద్ద 5వ యేట నుండి సంగీతం అభ్యసించారు. 10వ ఏట నుంచి కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. మహారాష్ట్రలో శ్రీశ్రీశ్రీ బ్రహ్మనంద తీర్ధస్వామి ఆశీస్సులు పొంది, ఆంధ్ర రాష్ట్రమంతటా అనేక కచేరీలు చేశారు. 1940 నుండి 13 సంవత్సరాలపాటు బాపట్లలో శ్రీ త్యాగరాయ ఆరాధన మహోత్సవాలను నిర్వహించారు. 20 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రేపల్లెలో 'గానభూషణ' బిరుదు వహించారు. వీరు జంత్రగాత్ర ప్రవీణులు. 'వయోల అను ఏడు తీగల ఫిడేలును పాడుతూ వాయించేవారు. పలు సంగీత అకాడమీలు వీరిని 'గాన కళానిధీ, 'జంత్రగాత్ర విశారద, 'సంగీత రత్న, బిరుదులతో సత్కరించాయి. సికిందరాబాద్ లోని ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాసాలకు 1952 నుండి 1962 వరకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి సభ్యులుగా పనిచేశారు. కొన్ని వర్ణాలను, స్వరజతులను వీరు ప్రత్యేకంగా రచించారు. యాదగిరి లక్ష్మీనరసి హ స్వామి దేవస్దానానికి వీరు అస్దాన సంగీత విద్యాంసులుగా తన సేవలందించారు. వీరు ఆకాశవాణి నిలయ విద్యాంసులు. ప్రముఖ రంగస్దల నటులు స్దానం నరసి హరావుగారు వీరి వద్ద సంగీతంలో ప్రాధమిక శిక్షణ తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సంగీతం అకాడమి వీరికి సంగీత కళాప్రపూర్న బిరుదునిచ్చి సత్కరించింది. సంగీత విద్వాంసులుగా, పరిశోధకులుగా, ఆధ్యాపకులుగా సంగీత సామ్రాజ్యానికి వీరు చేసిన సేవ నిరుపమానమైనది. శిష్ట్లా సత్యనారాయణ రాజశేఖరం (1918-1992): సంగీతం తన అభిమాన కళాగా చాటే రాజశేఖరంగారు పాత తరం సంగీతజ్ఞులలో ప్రముఖులు. అన్నామలై విశ్వవిద్యాలయంలో 'సంగీత భూషణ కోర్సును ఉన్నత శ్రేణిలో పూర్తిచేశారు. శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించినప్పటికీ కొంతకాలం ఆ కళకు దూరంగా ఉన్నారు. ఐతే 1960 ప్రాంతాల్లో ప్రముఖ వాగ్గేయకారుడు డాక్టర్ మంగళంపల్లి బాపమురళీకృష్ణ గారి సలహాతో విజయవాడలో సంగీత కళాశాలలో అధ్యాపకులుగా చేరారు. అవధాన పల్లవులను, విరిబోణి వంటి వర్ణాలను వివిధ గతి భేదాలతో పాడడం వీరి ప్రత్యేకత. అంతేకాకుండా రాగాలపనలోనూ క్రొత్త క్రొత్త ప్రయోగాలను చేసేవారు. 1962 ప్రాంతాల్లో గాంధీగారి గురించిన హరికధను స్వయంగా రచించి గానం చేసేవారు. 'తిరుప్పావై' ని వీరు తెలుగులో అనువాదం చేసి, ఆలపించారు. 100కు పైగా నిర్ద్దుష్ట శిల్పముగల గేయాలను రచించి, స్వరపరిచారు. ప్రతిష్ఠాత్మకమైన విజయనగరం సంగీత కళాశాలలో ఉపన్యాస్కులుగా బాధ్యతలు నిర్వహించారు. జీవిత చరమాంకం వరకు సంగీతమే సర్వస్వంగా జీవించిన వీరు సంగీత విద్వాంసులుగానేకాక మహా మానవతావాదిగా పేరుగాంచారు. ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి భావపురి సంగీత సరస్వతికి చిరునామాగా నిలిచారు. కోడె వెంకటేస్వర్లు: అతి చిన్న వయసులోనే సంగీతంపట్ల మక్కువ పెంచుకొని అతి శ్రద్దగా కర్ణాటక సంగీతాన్ని అభ్యసించిన వీరు బాల కళాకారుడుగా అనేక కచేరీలు చేశారు.గుoటూరు ప్రబ్భుత్వ ఉన్నత పాఠశాలలో సంగీతోపధ్యాయులుగా పనిచేసి ఎందరో విద్యార్ధినీ విద్యార్ధులకు సంగీతంలో శిక్షణ ఇచ్చారు. వయొలిన్ వాయించడంలో అత్యంత ప్రతిభను ప్రదర్శించే వీరు అనేక హరికధలకు తన వాయిద్యంతో సహకరించారు. ఇతర ప్రాంత విద్యార్ధులు కూడా వీరి వద్ద వయోలిన్ నేర్చుకుని ఆ వాయిద్యంలో నిష్ణాతులయ్యారు. చివరి వరకు సంగీతమే తన నేస్తంగా జీవించిన అరుదైన కళాకారులు వీరు. అన్నం వెంకటసుబ్బమ్మ (1921-1973) ఏడేళ్ళ ప్రాయంలోనే సంగీత కచేరీలు చేసిన ఘనత వహించిన సుబ్బమ్మ గారు కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు. గాత్రం సంగీతంతోపాటు, వీణ, వయోలిన్ లో సమాన పాండిత్యంతో నాటి సంగీతాభిమానులను విశేషంగా అలరించారు. అనేక మందికి విద్యాదానం చేశారు. 10 ఏళ్ళ వయసులోనే 'బాల సరస్వతీ బిరుదు పొంది పండిత పామరులను సైతం తన సంగీత జ్ఞానంతో పరవశుల్ని చేశారు. బాపట్లలోనేకాక తిరుపతి వంటి సూదూర ప్రాంతాల్లో కూడా వీరు కచేరీలు చేశారు.సేవా తత్పరతను చాటుకుంటూ సహాయ నిధికై ఉచిత కచేరీలు ఇచ్చి,సంగీతం ద్వారా సేవా కార్యక్రమల్లో పాలుపంచుకున్నారు. పాత తరం సంగీతజ్ఞులలో వీరి శైలి ఎందర్నో ఆకట్టుకుంది. అసంఖ్యాకమైన శిష్యగణంగల వీరి వద్ద శిక్షన పొందిన ప్రతి ఒక్కరూ ఉత్తమ సంగీత కళాకారులుగా రూపుదిద్దుకొని, తమ గురువు ఘనతను ఎంతో ఘనంగా చాటారు. దుడ్డు దక్షిణామూర్తి: (1928-2004) శాస్త్రీయ సంగీతం ద్వారా బాపట్లకు ఖ్యతి తెచ్చినవారిలో వీరి స్దానం ప్రత్యేకమైంది. గాత్ర సంగీతంలోను, వయోలిన్ వాదనలోను బహుముఖ ప్రజ్ఞాశాలి వీరు. తన 8వ ఏటనే మొట్టమొదటి కచేరి నిర్వహించి నాటి ప్రముఖ సంగీత విద్వాంసుల ప్రశంసలు చూరగొన్నారు.ఆంధ్ర దేశంలోని ప్రముఖ సంగీత సభాస్దలులలో తన సంగీత కచేరీని నిర్వహించారు. ఆంధ్రదేసంలోని ప్రముఖ సంగీత విద్వాంసులు సైతం సంగీతంలోని సందేహాలను వీరి దగ్గర నివృత్తి చేసుకునేవారు.వీరు త్యాగరాజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు.దుడ్డు సీతారామయ్య సంగీత కళాశాలకు అధ్యక్షులుగాను,భావపురి సంగీత సభకు ఉపాధ్యక్షులుగాను వ్యవ్వహరించి,భావపురివాసులకు సంగీతంపట్ల ఆసక్తి పెరిగెందుకు కృషి చేశారు. అయుర్వేద వైద్యంలో వీరు రాష్ట్రంలోనే పేరెన్నికగన్నవారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ, మంచి హస్తవాసిగల డాక్టరుగా పేరుపొందారు. 'చింతలూరు డాక్టరు గా చిరపరిచితులైన దక్షిణామూర్తిగారి వద్దకు చికిత్స కోసం రాష్ట్రం నలుమూలలనుంచి వ్యాధిగ్రస్తులు వచ్చి చికిత్స చేయించుకునేవారు. సంగీత కళాకారులకే కాక, ఆయుర్వేద వైద్యులకు కూడా అమూల్య సలహాలిస్తూ ఈ రెండు రంగాల్లోనూ గురువుగా ప్రసిద్దులైనారు.


దుడ్డు సావిత్రి అమ్మాళ్: వీరు ప్రముఖ సంగీత విద్యాంసులైన డాక్టర్ దుడ్డు దక్షిణామూర్తి గారి సతీమణి. బాపట్లలో శిష్ట్లా సత్యనారాయణ రాజసేఖరం గారి వద్ద 5 సంవత్సరాలపాటు సంగీత విద్యభ్యాసం చేసి గాత్రం, వయోలిన్ లలో డిప్లమా పొందారు. తన మామగారైన మహమహోపాధ్యాయ దుడ్డు సీతారామయ్య గారి వద్ద కొంత కాలం సంగీతం అభ్యసించారు.ప్ర తిష్ఠాత్మకమైన వేటపాలెం లైబ్రరీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొని వయొలిన్ ద్వారా ప్రేక్షకాభిమానులను విశేషంగా అలరించారు.భర్తగారితో కలసి రామకృష్ణ పరమహంస మఠంలో వయోలిన్ యుగళ కచేరీ నిర్వహించారు. శ్రీ దుడ్డు సీతారామయ్య శత జయంతి ఉత్సవాలలో వయోలిన్ను సహకార వాయిద్యంగా అందించి మరోసారి భావపురి సంగీతాభిమానులను అలరించారు. వీరు చక్కని కవయిత్రి కూడా. 2000సం||లో దూరదర్శన్ నిర్వహించిన 'పద్యాల తోరణం'లో పాల్గొని బహుమతి పొందారు. కర్లపాలెం చద్రమౌళి: శాస్త్రీయ సంగీతానికి విస్తృత ప్రచారం కావించి వారిలో వీరిని ప్రముఖులుగా పేర్కొనవచ్చు. ప్రముఖ సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ సహధ్యాయిగా సంగీత విద్వాంసులు నూకల చిన సత్యనారాయణ సహధ్యాయిగా సంగీత శుశృఅష చేసి సంగీత ప్రపంచమే తన జీవితంగా గడిపారు.ప్రతిష్ఠాత్మకమైన విజయనగరం ప్రభుత్వ సంగీత కళాశాల,కర్నూలు సంగీత కళాశాలలకు ప్రిన్సిపాల్ గా తన బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు.రాయలసీమలో కర్ణాటక సంగీత వ్యాప్తికి కృషి చేసిన వారిగా వీరు చిరస్మరణీయులైనారు. కోటిరాజ్ (జననం:1936): వీరి పూర్తి పేరు కారుమంచి కోటేశ్వరి. ఏడేళ్ళ ప్రాయంలో సంగీత శిక్షణాభ్యాసాన్ని ప్రారంభించి 12 ఏళ్ళ ప్రాయం నుండి కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. అన్నం వెంకట సుబ్బమ్మగారి శిక్షణలో శాస్త్రీయ సంగీతంలో మరింత పాండిత్యాన్ని సముపార్జించుకున్నారు. కర్ణాటక సంగీతలో డిప్లొమా పొందారు. ప్రపంచ ప్రఖ్యాతిపొందిన 'మల్లీశ్వరీ చలనచిత్రంలో 'పోయిరావే తల్లీ...పోయిరావమ్మా' అనే గీతాన్ని 17 ఏళ్ల వయసులో బృందగానంలో అలపించడమేకాక ఆ పాటలో నటించారు. 'శ్రీలక్ష్మమ్మ కధా చిత్రంలో అంజలీదేవికి 'జీవితమే వృధా అయొన' అను పాటను ఎంతో మనోహరంగా పాడారు. 'సంసారం' చిత్రంలో 'టక్కు టమారాల నండీ అను పాటకు కోరస్ అందించారు. అనేక హిందీ చిత్రాలకు కూడా వీరు బృందగానంలో పాలుపంచుకున్నారు. వీరు గాత్రంతో పాటు గిటార్, కీ బోర్డ్ వాయిద్యాలలో నిష్ణాతులు. 2006లో 'సప్తస్వర లలిత కళా మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డెవలప్ మెంట్ సొసైటీ అను సంస్దను స్దాపించి సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. వీరు అనేకసార్లు పాటల పోటీలు, నృత్య పోటీలు సంగీతాల్లో శిక్షణ ఇస్తున్నారు. వీరు అనేకసార్లు పాటల పోటీలు, నృత్య పోటీలు నిర్వహించారు. పలు పాటల పోతీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సంగీత వికాసానికి కృషి చెస్తున్నారు. వీరి కుటుంబ సభ్యుల్లో పలువురు సంగీత విద్వాంసులు కావడం విశేషం. ద్విభాష్యం సూర్యప్రభ: శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించిన చిన్ననాటినుంచే వీరు కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. శ్రీ దుడ్డు సీరారామయ్య సంగీత కళాశాల నిర్వాహకురాలిగా బాపట్లలోని యువతకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దారు.లలిత గీతాలను కూడా వీరు అమోఘంగా అలపించేవారు.వీరి వద్ద శిక్షణ పొందిన అనేకమంది సంగీత విద్వాంసులుగా నేడు కచేరీలు ఇస్తుండడం వీరి సంగీత ప్రతిభకు తార్కాణం.


దేశిరాజు కామేశ్వరి: ఉప్పలపాటి సూర్యనారాయణ గారి వద్ద సంగీతంలో ప్రాధమిక శిక్షణ పొందిన వీరు సుశిక్షిత సంగీత గాయనీమణిగా ప్రసిద్దులయ్యారు. చిన్నానాటే కచేరీలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ద్వారా సంగీతంలో డిగ్రీ మరియు డిప్లమా పొందారు.లలిత సంగీతం మరియు కర్ణాటక సంగీతంలోనూ విద్యాంసులై అనేక కచేరీలు నిరహించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆడిషన్ లో ఎంపిక కాబడి ఆకాశవాణి సంగీత కళాకారిణిగా అనేకమార్లు రేడియోలో లలిత గీతాలు,కర్ణాటక సంగీతం ఆలపించారు.గాత్రంతోపాటు వీణ మరియు నాట్యంలోనూ సమాన ప్రవేశం పొందారు.పలుమార్లు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు.విశేష దినాల్లో పలు దేవాలయాల్లో భక్తి సంగీత కార్యక్రమాలను నిరహించి భావపురి సంగీతాభిమానుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న వీరు అనేక సంస్దల నుంచి ఘన సన్మానాలు అందుకొన్నారు. పోతురాజు కృష్ణకుమారి: వీరు శ్రీ కొమాండూరి అనంతాచార్యులు, శ్రీ కొమాండూరి తిరుమలాచార్యులు మరియు శ్రీ నల్లానిచక్రవర్తుల నారాయణాచార్యుల గార్ల వద్ద 1957 నుంచి 9 సం||లపాటు వీణ మరియు గాత్రం నేర్చుకున్నారు. 1962-63లో హైదరాబాద్ రవీంద్రభారతిలో వీణ కచేరి చేశారు. గుంటూరులో పలు ఉత్సవాలలో వీణ కచేరి చేశారు. 1995 నుండి ఆకాశవాణి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. పలు రేడియో కార్యక్రమాలకు సంగీత నిరహణ చేశారు.ఒంగోలు,చీరాల వేటపాలెం,ఇంకా అనేక పట్టణాలల్లో తన శిష్యురాళ్ళతో సంగీత రూపకాలు నిర్వహించారు. 'శ్రీ వాగ్దేవి కళాసమితీ అను సంస్దను స్దాపించి, దాని ద్వారా పలు ఉత్సవాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. పలు పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. వీరి దగ్గర శిక్షణ పొందిన అనేక మంది విద్యార్ధినులు పలు పాటల పోటీలలోపాటు వీణ వాయిద్యంలో కూడా అనేక బహుమతులు పొందారు. చీరాల గీతామందిరం మరియు అనేక ఇతర సాంస్కృతిక సంస్దల నుండి వీరు పెక్కు సన్మానాలు పొందారు. చండ్రపాటి సూర్యప్రభ: వీరు ప్రముఖ నాదస్వర విద్వాంసులైన అలివేలు వెంకయ్య గారి వద్ద 1958 నుండి 5 సంవత్సరాలపాటు సంగీతం నేర్చుకున్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో జరిగిన పాటల పోటీలలో ప్రధమ బహుమతి గెలుచుకున్నారు. వయోలిన్ విద్వాంసులైన అల్లు పోతయ్య గారి వద్ద సంగీతం నేర్చుకుని, సర్టిఫికెట్ కోర్సులో కూడా ఉత్తీర్ణులయ్యారు. చుండూరి శకుంతలగారి వద్ద వీణ నేర్చుకుని వీరి దగ్గరే డిప్లొమా చేశారు. పలు పాటల పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 1992లో శ్రీ సత్యసాయి బాలవికాస్ ను స్దాపించి, బాలలకు సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. తన శిష్యులతో కూడి సంగీత రూపకాలను బాపట్లలోనేకాక ఇతర పట్టణాలలో కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా భక్త రామదాసు జీవిత ఘట్టాలకు చెందిన రూపకాన్ని తయారుచేసి, రామదాసు కీర్తనల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


పిల్లుట్ల అనసూయా దేవి: అయ్యగారి సోమేశ్వరరావు గారి వద్ద వీరు వీణ నేర్చుకున్నారు. శిష్ట్లా రాజసేఖరం గారి వద్ద సంగీతంలో డిప్లమా పొందారు. గాత్ర, వీణ రెండింటిలోనూ వీరు డిప్లమా పొందారు. రాష్ట్రవ్యప్తంగా అనేక చోట్ల వీణ కచేరీలు చేశారు. ఇతర రాష్ట్రాలలోనూ అనేక కచేరీలు చేశారు. అకాశవాణిలో తన వీణా వాదనాన్ని అనేకమార్లు వినిపించారు. 'శ్రీ వెంకట రమణీయం' అను భక్తి గీతాల క్యాసెట్ కు బాణీలు కూర్చారు. తిరుమళ తిరుమపతి దేవస్దానం అన్నమయ్య ప్రాజెక్ట్ వారి అధ్యర్యంలో పలు చోట్ల అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. భోపాల్ లోని ఆంధ్రా అసోసియేషన్ వీరికి సంగీత విద్వన్మణీ అని బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది. హైదరాబాద్ విద్యానగర్ కల్చరల్ అకాడమీ వారు 'వీణా గానామృత వర్షిణీ, 'వీణావాద్య విశారదా బిరుదులిచ్చి సత్కరించారు. హైదరాబాద్ చీరాల, నరసరావుపేట, తెనాలిలో సాంస్కృతిక సంస్దలు వీరిని ఘనంగా సత్కరించాయి. 2001లో శారదా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ అను సాంస్కృతిక సంస్దను స్దాపించి,లలిత కళలకు విశేష ప్రాచుర్యం ఇస్తున్నారు.అనేక మంది ఔత్సాహికులకు సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు.వీణ నేర్పుతూ విద్యార్ధులను డిప్లమా హోల్డర్స్ గా తయారుచేస్తున్నారు. వీరు చక్కని రచయిత్రి కూడా. వీరి రచనలు 'కలువబాల, 'వనిత, 'మహిళ పత్రికల్లో విరివిగా ప్రచురితమయ్యాయి. అనేక భక్తి గీతాలు కూడా వీరు రచించారు. మహిళల కోసం ప్రత్యేక రచనలు చేశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వీరు రచించిన 'పుష్కర గీతం' ఈనాడు దిన పత్రికలో ప్రచురితమై వీరికి మంచి ఖ్యాతి తీసుకొచ్చింది. కొండవీటి సాంబశివరావు: వీరు హిందుస్దాని శాస్త్రీయ సంగీత విద్వాంసులైనప్పటికీ శాస్త్రీయ సంగీతజ్ఞులకు భిన్నంగా గత 15 సంవత్సరాలుగా లలిత సంగీత ప్రాచుర్యం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. పలువురు కవుల లలిత గీతాలకు బాణీలు కడుతూ వాటి విద్యార్ధులకు నేర్పుతున్నారు.వీరి దగ్గర లలిత సంగీతాన్ని అభ్యసించిన ఎందరో విద్యార్ధులు అనేక రాష్ట్రస్దాయి బహుమతులు అందుకొన్నారు.పలు పరిషత్తు నాటకాలకు నేపధ్య సంగీతాన్ని అందించారు.ఆకాశవాణి కార్యక్రమల్లో కదంబ కార్యక్రమాల ద్వారా వీనుల విందైన సంగీతాన్ని ఆకాశవాణి ప్రేక్షకులకు అందించి, తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్నారు. లలిత గీతాలతోపాటు వందలాది అన్నమయ్య కీర్తనలకు బాణీలు సమకూర్చి, కచేరీలు నిర్వహిస్తూ తన శిష్యులచేత వాటికి ప్రాచుర్యం తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. అనేక ఆడియో క్యేసెట్స్ కు సంగీతం సమకూర్చారు. పలు రాష్ట్రస్దాయి పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కారుమంచి కోటిస్వామి: భారత సైన్యంలో పనిచేసి పలు యుద్దాల్లో పాల్గొన్న వీరు పదవీ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. కాసియో, గిటార్, వయోలిన్, మాండొలిన్, ప్లూట్ వాయిద్యాలను శాస్త్రీయంగా వాయించే అరుదైన సంగీతజ్ఞులు వీరు. మద్రాసులో శాస్త్రీయ సంగీతాన్నీభ్యసించి, తెలుగుతోపాటు తమిళం, హిందీ, భాషల్లో కూడా పాటలు ఆలపించే ప్రజ్ఞ వీరి సొంతం. అన్నమయ్య కీర్తనలను ఆలపించడంలో ఓ ప్రత్యేకతను చూపిస్తారు. ముఖ్యంగా వినాయక చవితి, నవరాత్రి, శ్రీరామ నవమి వంటి పర్వ దినాల్లో భజన కార్యక్రమాలు నిరహిస్తూ తన సంగీతంతో భావపురి ఆధ్యాత్మికతకు క్రొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. వీరు చక్కని రంగస్దల నటులు కూడా. 'సత్య హరిశ్చంద్రా నాటకంలో హరిశ్చంద్రుడి పాత్రపోషణను ఒక్కరే ఆసాంతం చేయడంలో వీరు పేరెన్నికగన్నవారు. వీరి కోవలోనే సమర్ధ, గంగరాజు హేమకూమారి వంటి సంగీతజ్ఞులు భావపురిని తమ సంగీత తరంగాలలో ఓలలాడిస్తూ, అనేక మందికి ఈ విద్యను బోధిస్తూ, తరువాతి తరాలకు మార్గదర్శకులయ్యారు


వాద్య విద్వాంసులు: గాత్ర సంగీతం ద్వారా ఆంధ్ర కోయిలలుగా ఘనతనొందినవారు కొందరైతే వాయిద్యాల ద్వారా విఖ్యాతినొందినవారు మరికొందరు. శాస్త్రీయ సంగీతాన్ని తాము ఎంచుకున్న వాయిద్యాల ద్వారా అభ్యసించడమేకాక కచేరీలు చేసిమరీ తమ వైదుష్యాన్ని ప్రదర్శించిన వారెందరో.కొందరు నాటకాలకు నేపధ్య సంగీతాన్ని అందిస్తే మరికొందరు దేవాలయాలకు శాశ్వత సంగీతకర్తలుగా తమ జీవితాలను అంకితం చేసుకున్నారు. వీణ, వయొలిన్, హర్మోనియం, నాదస్వరం, మృదంగం, తబల...ఇలా దాదాపు అన్ని వాయిద్యాలను నేర్పుతో పలికించగల సంగీతజ్ఞులు ఇక్కడెందరో ఉన్నారు. వీరిలో కొందరు ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా అత్యంత కీర్తి ప్రతిష్ఠలు గడించారు. మరికొందరు సంగీతకళాశాలలకు ప్రధానాచార్యులుగా పనిచేశారు. . ఇది అన్ని సంగీత మాధ్యమారిలోనూ జూగల్ మంది: ఈ పక్రియను ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజెప్పినవారు కోన ప్రభాకరరావు గారు. ప్రముఖ తెలుగు వాగ్గేయకారులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మరియు ప్రముఖ సంగీత విద్వాంసులైన పండిట్ భీంసేన్ జోషి కలసి కర్ణాటక మరియు హిందూస్తానీ సంగీతాన్ని ఆలపించడం ఈ సంగీత శైలి. కర్ణాటక, హిందూస్దానీ సంగీతాలు రెండూ ఒక్కటేనని, వీటి మధ్య తేడా లేదని ప్రపంచమంతా చాటెందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేయబడింది. వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని కోన ప్రభకరరావు గారు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఏర్పాటుచేయించారుప్రసారమయింది.దీనివల్ల కర్ణాటక సంగీతంలోని మాధుర్యం ఉత్తర భారతీయులకు మొట్టమొదటిసారిగా తెలియవచ్చందనవచ్చు. ఈ ప్రక్రియ ఇతర దేశాల్లోనూ విశేష ప్రాచుర్యం పొందింది. అయ్యగారి సోమెశ్వరరావు: విజయనగరం సంగీతం కళాశాలలో వైణిక శిక్షణ పొందిన వీరు వైణిక విద్వాంసులుగా ఎంతో పేరు గడించారు. విజయవాడ ప్రభుత్య సంగీత కళాశాలలో ఆచార్య పదవిని ఎంతో సమర్ధవంతంగా నిరహించడమేకాక ఆ కళాశాల రాష్ట్రస్దాయిలో ఖ్యాతి సముపార్జించెందుకు ఎంతో కృషిహేశారు. వీరు 'వైణిక శిఖామణీ గా పేరుపొందారు. వీరికి కోన ప్రభాకరరావు, నోరి నాగభూషణ, పిల్లుట్ల హనుమంతరావు తదితరులు ఘన సన్మానం చేసి స్వర్ణ కంకణాన్ని బహుమరించారు. గౌరావఝఅంజనేయులు: చిన్ననాటే వయోలిన్ నేర్చుకుని,అతి చిన్న వయసులోనే ఆ విద్యలో ఆరితేరిన వీరు వయొలిన్ కళాకారుడుగా పేరు ప్రఖ్యాతులు సముపార్జించుకున్నారు. అతిక్లిష్టతరమైన వేద మంత్రాలను వయోలిన్ పై వాయించిన అరుదైన ఘనతన సాధించి, సంగీత లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.


గౌరావఝ రామమోహనరావు: వీరు గౌరావఝల ఆంజనేయులు గారి కుమారులు. చిన్నతంలోనే వయోలిన్ నేర్చుకొని 7 ఏళ్ళ ప్రాయంలోనే వయొలిన్ కచేరీని చేసిన ఘనత వహించారు.. మొదట్లో రంగస్దల నాటకాలకు వయోలిన్ ద్వారా సంగీతం సమకూర్చేవారు. ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసులుగా వందలాది కార్యక్రమాలను నిర్వహించారు. తన అద్భుత వయొలిన్ నాదంతో శ్రోతలను సమ్మోహితులను చేశారు. వయోలా విద్వాంసునిగా కూడా వీరు విఖ్యాతినొందారు. వయొలిన్, వయోలా వాద్య కచేరీలను అనేకం చేశారు. అనేకమంది ప్రముఖ సంగీత విద్యాంసుల గాత్ర కచేరీలకు వయొలిన్ తో సహకరించిన వీరి వాయిద్యంలోని వేగం, సంచారక్రమం, రాగ విన్యాసం ప్రేక్షకులను ముగ్దులను చేసేవి. నిత్యం సంగీత సాధన చేస్తూ స్వరార్చనే భగవదర్చనగా భావిస్తూ సంగీత కళా సరసతికి తన జీవితాన్నే అంకితం చేశారు. అయ్యగారి శ్యామ సుందరం: వీరు ప్రముఖ వైణిక విద్యాంసులైన అయ్యగారి సోమేశ్వరరావుగారి కుమారులు. ఎనిమిదేళ్ళ ప్రాయంలోనిఏ వీణ కచేరి చేసిన ఘనత వహించారు. విజయ నగరం సంగీత సంప్రదాయానికి చెందిన సంగీత విద్వాంసుల పరంపరలోని కళాకారులైన వీరు ఆకాశవాణి 'ఏ' గ్రేడ్ కళాకారుడుగా గత 24 ఏళ్ళుగా రేడియో, టీవీ కార్యక్రమాల్లో తన అద్భుత వీణా వాయిద్యంతో సంగీతాభిమానులను అలరిస్తున్నారు. దూరదర్శన్, సౌత్ ఇండియన్ హుక్ అప్ కార్యక్రమము, ఆకాశవాణి సంగీత సమ్మేళనం, ఆకాశవాణి జాతీయ సంగీత కార్యక్రమము, తిరవయ్యూర్ సౌత్ ఇండియన్ హుక్ అప్ సంగీత కార్యకమాలు నిర్వహించారు. వీరు నిరహించిన వీణ కచేరీలు వీరిని జాతీయ స్దాయి వైణిక విద్యాంసుడుగా కీర్తిప్రతిష్టలు ఆర్జించిపెట్టాయి. వీరిది గాయక శైలి. 'త్యాగరాజ పంచరత్న ఊహస్వర తరంగిణీ, 'బ్రహ్మా, 'విశ్వ సంగీత పరిణామం', అనే రూపకాలకు వీరు కూర్చిన సంగీతం ఎన్నదగినది. 'ప్రహ్లాద భక్త విజయం', 'నౌకా చరిత్రం', 'శ్రీకృష్ణ లీలాతరంగిణీ అను ఆడియో క్యాసెట్లను వెలువరించడం ద్వారా మనోజ్ఞమైన సంగీతాన్ని సంగీతాభిమానులకు అందించారు. 'నాద బంధం' అనే సంగీత రూపకం ద్వారా వీరు జాతీయ అవార్డు పొందారు. తన సంగీత మహ ప్రస్దానంలో వీరు అందుకోని పురస్కారం లేదు 'వీణావాద్య విద్యావిశారద అను బిరుదును పొందిన వీరు ఆంధ్ర రాష్ట్రంలోనేకాక ఇతర రాష్ట్రాల్లో కూడా వీణ కచేరీలు నిర్వహించారు. విదేశాలలో సైతం పలు ప్రదర్శనలిచ్చారు. గుంటూరు ప్రభుత్వ సంగీత కళాశాలకు, విజయవాడలోని జి.వి.అర్. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిరహించారు.భారత దేసంలోని అగ్రశేణి వైణికుల్లో ఒకరుగా గుర్తింపుపొందిన శ్యామసుందరం గారి సుమధుర స్వర సంగతులు భావపురి కళా వైభవానికి పరిమళాల విరిజల్లులు. చుండూరి శకుంతల: వీరు కర్ణాటక సంగీతంలో వీణానాదంలో డిప్లొమా పొందారు. దశాబ్దాలపాటు వీణ కచేరీలు నిర్వహించారు. పలు ఉత్సవాలకు వీరిచే వీణా నాదం ఏర్పాటు చేయబడేది. అనేక మంది శిష్యులను వైణిక విద్యాంసులుగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ లో గాయత్రి సంగీత కళాశాలను స్దాపించి, విద్యార్ధినీ విద్యార్ధులకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు.
అన్నo రాజు శ్రీరామచంద్రమూర్తి: మృదంగ విద్వాంసులైన వీరు శ్రీ భావనారాయణ స్వామి దేవాలయంలో జీవిత చరమాంకంవరకు సంగీత కార్యక్రమాలకు మృదంగం వాయించారు. శాస్త్రీయ సంగీతమైనా, లలిత సంగీతమైనా, హరికధా కాలక్షేపమైనా ఇతర ఏ కార్యక్రమమైనా ఆలయంలో మృదంగ నాదం చెసిన ఏకైన వ్యక్తిగా ఖ్యతిని దక్కించున్నారు. తన జీవితాన్ని సంగీతానికే అంకింతం కావించిన అరుదైన కళాకారులు వీరు. పొన్నాడ రామనాధ శాస్త్రీ: వీణావాదన చేయడంలో మంచి ప్రావీన్యం కలవారు. వీరు మంచి చిత్రకారులు కూడా. చెరుకూరి శ్రీశైలం: సన్నాయి వాద్య సంగీతంలో బాపట్లకు ఖ్యాతి తెచ్చిన సంగీత విద్వాంసులు వీరు. తంజావూరులో నాదస్వర కళను అభ్యసించి, పలు కచేరీలు చేశారు. ప్రత్యేకించి బాపట్లలో దేవాలయాలలోనూ, ఇతర గృహ సంబంధిత శుభ సందర్భాలలోను వీరి కచేరి తప్పనిసరిగా ఉండేది. భావనారాయణ స్వామి వారి దేవాలయంలో 45 సంవత్సరాలపాటు ఏకధాటిగా శ్రీ త్యాగరాజు ఆరాధ్నోత్సవాలు నిర్వహించిన ఘనత వీరిది. సన్నాయి వాద్యంలో అనేకమందిని తీర్చిదిద్దారు. వీరు అందుకున్న సన్మానాలు, సర్కారాలు అనేకం. నెల్లూరు జిల్లాలోని కొత్త ఒంగోలులో సంగీత కళాభిమానులు వీరికి 'సిం హతలాటమూను బహుకరించి ఎంతో ఘనంగా సత్కరించారు. 'నాదస్వర శిరోమణీ, నాదస్వర కళా చక్రవర్తీ వంటి 11 బిరుదులతో వీరు సన్మానించబడ్డారు. ప్రఖ్యా చలపతిరావు: వీరు వయోలిన్ విద్వాంసులు. ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత అధ్యాపకులుగా పనిచేశారు. అనేకమంది విద్యార్ధులను తీర్చిదిదారు. మస్తాన్ సలోమి: వీణ, వయోలిన్, నాదస్వరం వంటి వివిధ వాయిద్యాల ద్వారా పలువురు సంగీతజ్ఞులు తమ కచేరీలతో ఆంధ్ర దేశాన్ని అలరిస్తుంటే ఆ వాయిద్యాలకు భిన్నంగా తబల వాయిద్యం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో వందలాది కార్యక్రమాలను నిరహించిన ఘనత పొందినవారు వీరు.శాస్త్రీయంగా ఈ వాయిద్యాన్ని అభ్యసించిన వీరు శాస్త్రీయ కార్యక్రమాలతోపాటు, లలిత సంగీతం, కచేరీలలో కూడా తబల వాయిద్యంతో అలరిస్తున్నారు. అనేక రేడియో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు ఆధ్యత్మిక భక్తి గీతాల క్యాసెట్లలో తన వాయిద్యాన్ని వినిపించారు. సినిమా సంగీత కచేరీల్లో కూడా వీరు పాల్గొన్నారు. పాత తరానికీ, మలి తరానికీ వారధిగా వీరు నిరహిస్తున్న సంగీత కార్యక్రమాలు యువతరానికి ఎంతో ప్రేరణ ఇచ్చాయి.


నాగేష్: వీరి పూర్తి పేరు బొమ్మిశెట్టి నాగేశ్వరరావు. పదేళ్ళ ప్రాయంలోనే తబల వాయిద్యాన్ని తన తండ్రిగారి వద్ద అభ్యసించి, ముఫై ఏళ్ళుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు రేడియో కార్యక్రమాల్లో లలిత సంగీత విభావరిలో తన ప్రతిభను ప్రదర్శించారు. అనేక ప్రైవేటు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. తబలతోపాటు వీరు డోలక్, కాంగో వాయిద్యాలతో శ్రోతలను మైమరపింపజేయగలరు. డి. జగన్మోహిని: మృదంగ వాయిద్యంలో పేరెన్నిగన్న వీరు ఆకాశవాణి ద్వారా తన వాయిద్యంతో శ్రోతలను అలరించారు. పలు శాస్త్రీయ సంగీత కచేరీలకు వాద్య సహకారాన్ని అందించారు. కిషన్: వీరి పూర్తి పేరు కిషన్ ఖావడియా. భావపురి సంగీత వైభవ స్ఫూర్తితో తబల వాయిద్యాన్ని అభ్యసించిన మరో కళాకారుడు. అనేక రేడియో కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు. అయ్యప్పస్వామిభక్తి గీతాల క్యాసెట్ ను, 'ఇదిగో పిల్లా' అను ప్రైవేట్ పాటల క్యాసెట్ ను రూపొందించారు. పలు భక్తి గీతాలకు బాణీలు సమకూర్చారు. 'శ్రీ పద్మనాభం' వంటి పలు టీవీ సీరియల్స్ నేపధ్య సంగీతాన్ని అందించారు. శాస్త్రీయ సంగీతంలో నాగసూరి సులోచన, పప్పు సోమేశ్వరరావు, పప్పు చoద్రశేఖరరావు, నాద స్వరంలో, షేక్ చిన మౌలానా, వయోలిన్ లో రంగారావు,కృష్ణారావు గార్లు తమ తమ వాయిద్యాలలో పేరుగడించారు. అనేకమంది విద్యార్ధులను తీర్చిదిద్దారు. వీరు అనేక ఆకాశవాణి మరియు టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాయనీ గాయకులు తిమ్మన అయ్యన్న (1930-1996): వృత్తిరిత్య పాఠాలతో అనుబంధమున్నా, ప్రవృత్తి రీత్యా పాతే పరమావధిగా భావించిన వీరు అతి చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించారు. వీరు ఏ గురువు వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసించకుండానే మంచి గాయకులుగా ప్రసిద్దిచెందారు. క్యారంస్ స్టేట్ ప్లేయర్ గా రాణిస్తూనే అనేక పాటల పోటీలలో పాల్గొని పాల్గొన్న ప్రతిచోటా బహుమతులు గెలుచుకున్నారు. ఆనాటి మేటి గాయకులైన ఘంటసాల, ఎ.ఎం.రాజా, మాస్టర్ వేణు, పి.బి.శ్రీనివాస్ గార్లను అందరినీ అనుకరిస్తూ పాడడంలో వీరికి వీరే సాటి. ప్రత్యకించి ఘంటసాల, భానుమతి గాత్రాలను అనుకరించి పాడి అందర్నీ అశ్చర్యచకితుల్ని చేసేవారు. ఇంటర్మీడియట్ పాసైన వెంటనే 1952 సం||లో సినిమా రంగంలో అవకాశం రావడంతో మద్రాస్ వెళ్ళారు. అక్కడ వీరి గాత్రనికి ముగ్దులైన మధుర గాయకులు ఘంటసాల వీరిని ప్రత్యేకంగా అభినందించారు.నాటి ప్రముఖ సంగీత దర్శకులు జె.వి.రాఘువులు గారు వీరి గాత్రానికి మగ్దులై తన చిత్రంలో పాడే అవకాశమిచ్చారు.ఐతే రికార్డింగ్ సమయానికి బాపట్ల వ్యవసాయ కళాశాలలో బి.యస్సీ సీటు రావడంతో వారి అన్నగారైన సుందరరావుగారి కోరిక మేరకు వెంటనే సినీ రంగాన్ని వదిలిపెట్టి ఏ.జి.కాలేజ్ లో చేరారు. అదే కాలేజ్ లో సోసియేట్ ప్రొఫెసర్ గా రిటైరయ్యారు. అనేక దేవాలయాల్లో అన్నమయ్య, రామదాసు గీతాలు ఆలపించేవారు. నండూరి సుబ్బారావు గారి 'ఎంకీ పాటలను అతి మధురంగా పాడి, ఎంకి పాటలకు విస్తృత ఖ్యాతిని తెచ్చిపెట్టిన ఏకైక గాయకులుగా చిరస్దాయిగా నిలిచిపోయారు. ప్రాణం కంటే పాటనే అమితంగా ప్రేమించే వీరు చివరి క్షణం వరకూ పాడుతూనే ఉన్నారు. గుమ్మిడి కృష్ణకుమారి (జననం:1944): శాస్త్రీయ సంగీతాన్ని క్షుణ్ణంగా అభ్యసించినప్పటికీ, ఆరు పదుల వయసులో కూడా విద్యార్ధినిగానే సంగీతాన్ని అభ్యసించే వీరు మూదేళ్ళ ప్రాయం నుండే పాటలు పాడడం ప్రారంభించారు. పదేళ్ళ వయసులో అనకాపళ్ళిలో జరిగిన సిటీ కాంపిటీషన్స్ పాటల పోటీలలో ప్రధమ బహుమతి పొందారు. కోడె వెంకటసుబ్బమ్మ, బుడంపాటి శివరామకృష్ణయ్య, కృష్ణారావు, పోతురాజు కృష్ణకుమారి గార్ల వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ప్రముఖ గాయని శోభరాజు వద్ద అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నరు. 1953లో విజయవాడ ఆకాశవాణి గాయనిగా అడిషన్ టెస్ట్ లో కృతార్ధులై ఆకాశవాణి ద్వారా అనేక లలిత గీతాలను ఆలపించారు.1956లో విశాక్షపట్నం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీరు ఆలపించిన లలిత గీతాలు టీవీలో ప్రసరమయ్యాయి. ఆవిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి టీవీ గాయనిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అనేక పాటల పోటీల్లో పాల్గొని లెక్కలేనిబహుమతులు సంపాదించారు. పలు పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2005,2006 మరియు 2007 సంవత్సరాలలూఅ తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్దానం వారి ఆస్దాన మండపంలో త్యాగయ్య మరియు అన్నమయ్య గీతాల కచెహరీలను నిరహించారు. 2006,2007 సం||లో కేరళలోని శ్రీ గురువాయూరు ఎంకటేశ్వరస్వామి దేవాలయంలోనూ, శ్రీకృష్ణ దేవాలయంలోను, శివాలయంలోను కచేరీలు చెశారు. 2007లో త్రివెండ్రంలోని శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంలో కూడా భక్తి గీతాలాపన చేశారు. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలను స్వయంగా ఆలపించి డీవీడీల రూపంలో వెలువరించారు. ఉద్యోగ విరమణ చేసినా, సంగీతారాధనలో నిమగ్నులై ఇతర రాష్ట్రాలలో సైతం కచేరీలు చేస్తూ, సంగీతారాధనలో నిమగ్నులై ఇతర రాష్ట్రాలలో సైతం కచేరీలు చేస్తూ, పాట పట్ల తనకుగల ప్రేమను, భక్తిని చాటుకుంటున్న కృష్ణకూమారిగారు తనకు విద్య నేర్పిన గురువుల పట్ల ఎప్పుడూ భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తూ, తనను ఆదరిస్తున్న సంగీతాభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిత్య సంగీత సాధకులై కళాభిమానులను అలరిస్తూన్నారు.


స్టాలిన్: ఘంటసాల మధుర గీతాలను అతి మధురంగా ఆలపించే అతి కొద్ది మంది గాయకుల్లో వీరు ఒకరు. 35 సంవత్సరాలుగా ఘంటసాల పాటలను ఆలపిస్తూ అపరఘంటసాలగా కీర్తింపబడుతున్న వీరి గురించి తెలియని కళాభిమాని రాష్ట్రంలో ఉండరు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గాయకుడిగా పలు లలిత గీతాలను ఆలపించి, లలిత గీతాల్లోనూ తన శైలిలో రాణించారు. రాష్ట్రస్దాయిలో పలు పాటల పోటీల్లో పాల్గొని పాల్గొన్న ప్రతి పోటీలోనూ ప్రధమ బహుమతిని సాధించారు. 1980లో హైదరాబాద్ లో జరిగిన రాష్ట్రస్దాయి పాటల పోటీల్లో ప్రధమ బహుమతి పొంది, మహాగాయని ఎం.యస్. సుబ్బలక్ష్మి చేతుల మీదుగా 'శోభన్ బాబు అవార్డు ను పొంది, సినీనటుడు పద్మనాభం చేతుల మీదుగా బహుమతి అందుకొన్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.నేడు సినీ రంగాన్ని తమ గానామృతంతో వీనులవిందు చేస్తున్న ప్రముఖ గాయకులందరితోనూ ప్రైవేట్ కార్యక్రమాలో కలసి పాడారు.ఎస్.పి. బాపసుబ్రహ్మణ్యంతోనూ, 1998,99లో రామకృష్ణతోను, 1988లో తిరుపతిలో జిక్కీతోను, 2007,2009లో మనోతోను కలసి పాడారు. 2007లో తెలుగు విజ్ఞాన సమితి, బెంగుళూరులో నిర్వహించిన తెలుగు మహ సభల్లో తన గానాన్ని వినిపించారు. వీరు అందుకొన్న అవార్డులు, సన్మానాలు అనకం. 2001లో టి.వి.రాజు అవార్దు అందుకొన్నారు. ఖమ్మంలో సినీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి వీరిని ఘనంగా సత్కరించారు. బాపట్లలో కోన ప్రభాకరరావు గారి చేతుల మీదుగా వీరికి జరిగిన సన్మానం మరపురానిది. ఘంటసాల గీతాలను ప్రేక్షకులకు రసరమ్యంగా అందించే వీరంతే రాష్ట్రమంతటా అభిమానమే. కోకా (ఆకునూరి) శారద: మూడేళ్ళ లేలేత ప్రాయంలోనే పాటలు పాడడం అభ్యసించిన వీరు భక్తి మరియు లలిత గీతాల పాటల పోటీలలో అనేకమార్లు రాష్ట్రస్దాయి బహుమతులు గెలుచుకున్నారు. వ్యాస రచన మరియు నృత్య పోటీల్లో కూడా పాల్గొని, పలువురి ప్రశంసలు అందుకొన్నారు. 1990లో మొట్టమొదటిసారి ఆకాశవాణిలో 'యువవాణీ కార్యక్రమంలో లలిత గీతాన్ని ఆలపించడం ద్వారా రేడియో స్రోతలను విశేషంగా ఆలరించారు. అతికొద్ది కాలలోనే విజయవాడ ద్వారా రేడియో ఆడిషన్ లో కృతార్ధులై రేడియో గాయనిగా అనేక లలిత గీతాలు ఆలపించారు. 'స్నేహం' మొదలైన యువవాణి రేడియో నాతికలలో కూడా పల్గొన్నారు. లలిత గీతాలతోపాటు అన్నమయ్య గీతాలను కూడా వీరు ఎంతో శ్రావ్యంగా ఆలపిస్తారు. 'షిర్డీ సాయి భక్తిగీతాలు అను ఆడియో కేసెట్లలో భక్తి గీతాలు ఆలపించారు. తన గాత్రంతో ఆకాశవాణి శ్రోతలతోపాటు టీవీ వీక్షకులను కూడా వీరు అలరించారు. ఈటీవీ నిరహించిన 'సరిగమలు జెమిని టీవీ వారి 'నవరాగం'లో పాల్గొన్నారు. దూరదర్శన్ టెలిస్కూల్ కార్యక్రమాలకు అనౌన్సర్ గాను, యాంకర్ గాను ప్రేక్షకాభిమానాన్ని పొందారు. పలు టీవీ చానల్స్ కు ప్రసిద్ద సినీ హీరోలైన జగపతిబాబు, రాజా, సుప్రసిద్ద సినీ సంగీత దర్శకులైన కోటి, రాధాకృష్ణన్ మరియు పలువు పారిశ్రామికవేత్తలు, ఇతర విశిష్ట వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. తన ప్రశ్నావళి ద్వారా ఆ ప్రముఖుల అంతరంగాలను అద్భుతంగా ఆవిష్కరింపజేస్తూ తన గాన మాధుర్యంతో కళాభిమానులను అలరిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్వహించే కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. డల్లాస్ లో జరిగిన 'హ్యాపీడేశ్ చలన చిత్రం 50 రోజుల వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ గాయకులైన పి.సుశీల, రామకృష్ణ, జమునారాణి, గంగాధర్, మల్లికార్జున్ తదితరులతో కలసి గానం చేశారు. హోస్టన్ లో సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్ నిర్వహించిన మ్యుజికల్ నైట్లోనూ తన గానంతో అలరించారు. బాలల కోసం 'మిర్చి ఐడళ్ అను టారెంట్ షోను నిర్వహిస్తున్నారు.హోస్టన్ లోని 'ఆంధ్రా మిర్చి రేడియో'కు జాకీగా తెలుగు శ్రోతలను విశేషంగా అలరిస్తూ అమెరికాను ఆంధ్ర వెలుగులతో ప్రకాశింపజేస్తున్నారు. కళ్యాణి: తన తల్లిగారైన శ్రీమతి ద్విభాష్యం సూర్యప్రభగారి వద్ద వీరు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. అనేకమార్లు సంగీత కచేరీలు చేశారు. అనేక శాస్త్రీయ మరియు లలిత గీతాల పోటీల్లో బహుమతులు గెలుపొందారు. ఈటీవీ, దూరదర్శన్, ఎస్.వి.బి.సి. చానెన్స్ లో కూడా కార్యక్రమాలు నిర్వహించారు. పలు పాటల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శాస్త్రీ య సంగీతంలో కె.స్దలశాయి, ఆకాసవాణి లలిత గీతాల గాయకులుగా కరణం సుబ్బారావు, నూర్ భాషా హసన్ లు ఖ్యాతి వహించగా ప్లూట్ వాయిద్యం ద్వారా ప్రభాకర్, సినిమా పాటలు ఆలపించడంలో సుదర్శనం రాంబాబు,ఆధ్యాత్మిక భక్తి గీతాలలో కుమారి తోట లోచనా సుశాంత తదితరులు రాష్ట్రస్దాయి పాటల పోటీలలో బహుమతులు అందుకొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పల్గొంటూ గాన కోకిలలై ప్రజానీకాన్ని పవశింపజేస్తున్నారు. బాపట్ల మ్యూజిక్ సిండికేట్: 1970లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఈ సంస్దను నెలకొల్పారు. ఈ సంస్ద ద్వారా ప్రతి నెల 2వ శనివారం సాయంత్రం వీరి గృహంలో సంగీత కచేరీలు నిర్వహించబడేవి. ముఖ్యంగా వర్దమాన సంగీత కళాకారులకు ఇందులో ప్రోత్సాహమివ్వబడేది.భావపురి సంగీతాభిమానులను ఈ సిండికేట్ తన కార్యక్రమాలతో ఎంతో చక్కగా అలరించింది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఈ సంస్ద వార్షికోత్సవాలు నిర్వహించబడ్డాయి. సంగీత కళాశాలలు: ఔత్సాహికులకు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చేందు స్దాపించబడ్డ శ్రీ దుడ్డు సీతారామయ్య సంగీత కళాశాల వందలమందికి శిక్షణ ఇచ్చి, వారిచే కార్యక్రమాలను కూడా నిర్వహించింది. శిష్ట్లా రాజసేఖరం గారి ఆధ్యర్యంలో డి.వి.పి.రంగారావు గారిచే 1982లో స్దాపించబడిన ఈ కళాశాల ద్వారా సంగీతంలో అత్యుత్తమ శిక్షణ పొంది,రాష్ట్రస్దాయిలో గుర్తింపు పొందిన కళాకారులెందరో ఉన్నారు. వీరిలో కొందరు ఆకాశవాణి విద్వాంసులుగా పేరుపొందారు. ఈ కోవలోనిఏ శ్రీ సత్యసాయి బాలవికాస్, సప్తస్వర సంగీత కళాశాల వి.ఆర్.మ్యూజికల్స్ అకాడమి వంటి సంగీత కళాశాలలు శాస్త్రీ య సంగీతంలో శిక్షణ ఇస్తూ ఎందరో కళాకారులను జాతికి అందిస్తున్నారు.


భావపురి సంగీత సభ: ప్రముఖ సంగీత విద్వాంసులు శిష్ట్లా సత్యనారాయణ రాజశేఖరం, దుడ్డు దక్షిణామూర్తిగార్లు 1982లో ఈ సంస్దను ఏర్పాటుచేశారు. కేవలం శాస్త్రీయ సంగీతానికి ఆదరణ పెంపొందింపజేసే లక్ష్యంతో ఏర్పాటుకాబడిన ఈ సంస్దను కోనప్రభాకరరావు గారు ప్రారంభోత్సవం చేశారు. ప్రముఖ వాగ్గేయకాఉలు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు జ్యోతి ప్రజ్యలన కావించారు. ఈ సంస్ద ప్రారం భోత్సవ కార్యక్రమంగా అలంకార్ ధియేటర్ లో బాలమురళీకృష్ణగారిచే గాత్ర కచేరి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఘన సన్మానం, పుష్పాభిషేకం చేశారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, గెల్లి పిచ్చయ్య, రఘురామయ్య, ఉడిపి సుబ్బారావు గార్లు ఈ కార్యక్రమం విజయవంత మయ్యేందుకు కృషి చేశారు. ఈ సంస్ద ద్వారా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన పలువురు సంగీత విద్వాంసులచే కచేరీలను ఏర్పాటుచేశారు. గోపాల రత్నం, ఎం.ఎల్.వసంతకుమారి, ద్వారం భావనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, హైదరాబాద్ సిస్టర్స్, మల్లాది సూరిబాబు వంటి మహమహులు ఈ సంస్ద నిరహించిన శాస్త్రీయ సంగీత కచేరీలలో పాల్గొనడం ద్వారా భావపురి సంగీతాభిమనులను విశేషంగా అలరించారు. ఈ సంస్దకు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కార్యదర్శిగా పనిచేసి సంస్ద సర్వతోముఖ వికాసానికి విశేషంగా కృషి చేశారు. 1992లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఈ సంస్దకు అధ్యక్షులయ్యారు. 1992 నుండి ఈ సంస్దకు కార్యదర్శిగా వి.శ్రీనివాస శర్మ, కోశాధికారిగా జూలగంటి శ్రీరాములు పలు సంగీత కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్దానికేతరులతోనే కాకుండా స్దానిక శాస్త్రీయ సంగీత కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ ఈ సంస్ద శాస్త్రీయ సంగీత వికాసానికి విశేషంగా కృషి చేస్తుంది. నిత్యం సంగీత గోష్ఠులతోను, కచేరీలతోను, వాద్య విన్యాసాలతోను శ్రావ్యమైన సంగీత తరంగాలను పట్టణ నలుమూలలా ప్రసరింపజేసే భావపురి సంగీత కళాకారులు తమ విద్యను ఇతరులకు నేరించదంలో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. తమ శిష్యుల ద్వారా తమ విద్యను జాతికి అందించాలనే భావనతో ఉచితంగా కూడా శిష్యుల ద్వారా తమ విద్యను జాతికి అందించాలనే భావనతో ఉచితంగా కూడా విద్యను నేర్పించే ఘనులను కలిగివుండడం ఈ క్షేత్ర విశేషం. ఈ వైశిష్ట్య తే భావపురికి సంగీత రంగాన ఓ ప్రత్యేకతను సముపార్జించిపెట్టింది. బాపట్ల మొట్టమొదటిసారిగా రాష్ట్రస్దాయి పాటల పోటీలను నిరహించైనవారు తిమ్మన శ్యాం సుందర్.వీరి తండ్రిగరైన తిమ్మన అయ్యన్న గారి పేరు మీద ఈ పోటీలు 31-12-1996లో నిర్వహించారు. రాష్త్రం నలుమూలలనుండి 174 మంది గాయనీ గాయకులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఏడు స్వరాల సంగీతానికి ఇక్కడ ఏడు రోజులూ వేడుకే. వాద్యకారులకు ఇది వాగ్దేవి ఒడి. గానాభిలాషులకు గీతాల బడి. సంగీత కళాశాలలకు సురాగాల జీవమై, కచేరీలకు కేంద్ర స్థానమై విరాజిల్లుతూ అనేకమంది సంగీత విద్వాంసులను జాతికి అందించింది. కొందరు ప్రభుత్వ సంగీత కళాశాలలకు ప్రధానాచార్యులై పరిమళిస్తే మరికొందరు ఆకాశవాణి నిలయ విద్వాంసులై తమ ప్రతిభతో ఆకాశపుటంచులను స్పృశించారు. వారి గురించి, వారి బాటలో నడుస్తూ భావపురి సంగీత సామ్రాజ్యానికి మార్గదర్శకులవ్వబోతున్నవారి గురించి పూర్తి వివరాలు ......

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

Share

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Designed by ssinfos | Proudly Powered by Revolutionary Media Group