సినిమా రంగంలో బాపట్ల

సినిమా రంగంలో బాపట్ల
కళామతల్లి ముద్దుబిడ్డలకు కేంద్రస్థానమైన బాపట్ల నాటక కళాకారులను సినీ కళామతల్లి కూడా ఆదరించింది. అద్భుతమైన పాత్రలను వారికిచ్చి వారిని అక్కున చేర్చుకుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మల్లీశ్వరి, తెనాలి రామకృష్ణ వంటి చలన చిత్రాలతోపాటు జాతీయ అవార్డు పొందిన యజ్ఞం సినిమాలో కూడా ముఖ్య పాత్రల ద్వారా చలన చిత్ర రంగ వైశిష్ట్యానికి అతి ముఖ్య భూమిక వహించారు మన కళాకారులు. నటన కావచ్చు, రచన కావచ్చు, నిర్మాణ సారధ్యం కావచ్చు, దర్శకత్వ శాఖ కావచ్చు ... ఏ విభాగమైనా కాదేదీ మాకసాధ్యం అంటూ సినిమా రంగంలో తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకుంటున్నారు వీరు. నాటి నుంది నేత్టి వరకు సినిమా రంగానికి విసిష్ట సేవలనందించిన బాపట్ల కళాకారుల గురించిన సమగ్ర కథనం .......



నూరేళ్ళ నాటక రంగంతో అనుబంధమున్న బాపట్ల కళాకారులకు దాదాపు నూరేళ్ళుగా నినిమా రంగంతోనూ అనుబంధముంది. సినిమా రంగానికి మాతృక అయిన రంగస్దలం ద్వారా ఉత్తమ నటులనిపించుకున్న అనేక మంది నటులు సినిమా రంగంలోనూ ఉత్తమ నటులనిపించుకున్నారు. నాటక రంగమే ఫిల్మి ఇన్ స్టిట్యూట్ గా రంగస్దలంపై విశేష అనుభవం గడించిన వీరు వెండితెరపై వెలుగు జిలుగుజిలుగులు వెదజల్లారు. ఎందరో రంగస్దల కళాకారులు నటరాజ పాదపద్మములకు అంకితం చేసిన తమ పాదాలను సినీ రంగాల మోపి మేము సైతం అంటూ తమ ప్రతిభా పాటవాలను తెలుగు ప్రజలకు చూపారు. అది నటన కావొచ్చు. రచన కావొచ్చు, నిర్మాణ రంగం కావచ్చు. దర్శకత్వ శాఖ కావొచ్చు... ఏ రంగమైనా కాదేదీ మాకసాధ్యమంటూ సినిమా రంగం ఆహ్వానించేదే తడవుగా తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకుంటూన్నారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మించింది బాపట్లలోనే
పద్మశ్రీ ఈలపాట రఘురామయ్య :
సినిమాలో శ్రీకృష్ణుడుగా నటించిన మొట్టమొదటి కళాకారుడు ఈలపాట రఘురామయ్యాగరు. వీరు నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం 'పృధ్వీపుత్రా. ఇది 1933లో విడుదలయ్యంది. 1934లో 'భక్త కుచేలా సినిమాలో శ్రీకృష్ణుడుగా నటించి, సినిమాలలో కృష్ణుడుగా నటించిన మొట్టమొదటి కళాకారుడుగా వీరు రికార్డు సృష్టించారు. మరలా తిరిగి 28 సం||ల తర్వాత 1962 ఏళ్ళ వయసులో తిరిగి తీసిన 'భక్త కుచేలా సినిమాలలో మరల కృష్ణుడిగా నటించి నిత్య యౌననుడుగా పేరుపొందారు. శ్రీకృష్ణుని పాత్రలో ' శ్రీకృష్ణ కుచేలా, శ్రీకృష్ణ తులాభారం' చిత్రాలలో నటించిన రఘురామయ్య నటనకు సమ్మోహితులై, వారిని ఆదర్శాంగా తీసుకొని 'విశ్వవిఖ్యాత, 'నటసార్యభౌమ నందమూరి తారకరామారావు మొట్టమొదటిసారి సినిమాలో శ్రీకృష్ణుని పాత్రను ధరించారు. పౌరాణిక చిత్రాలతోపాటు జానపద, సాంఘిక చిత్రాల్లో కూడా వీరు నటించారు. సి.యస్.ఆర్., నాగయ్య, సురభి కమలాబాయి, కృష్ణవేణి, లక్ష్మీరాజ్యం, కన్నాంబ, రావు బాలసరస్వతి, యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్.వి.రంగారావు, జి.వరలక్ష్మీ, ఎస్.వరలక్ష్మి, భానుమతి, జమున, జానకి, అంజలీదేవి, తదితర ప్రముఖ సినీ నటులతో కలసి వీరు నటించారు. 1947లో 'గొల్లభామ' చిత్రంలో వీరితో నటించిన అంజలీదేవికి అదే తొలి చిత్రం. 'భక్త కుచల' , 'భక్త మార్కండేయ' , 'పాదుక పట్టాభిషేకం', 'మదాలస', 'శ్రీకృష్ణ తులాభారం', 'భక్త మార్కండేయ' , 'పాదుకా పట్టాభిషేకం', ' శ్రీకృష్ణ రాయబారం', 'చింతామణీ, 'నాగుల మార్కండేయ', 'పాదుకాపట్టాభిషకం', 'శ్రీకృష్ణ రాయబారం', 'చితామణీ, 'నాగుల చవితీ, 'శ్రీరామాంజనేయ యుద్దం', 'దేవాంతకుడూ , 'ఉషాపరిణయం', ' సత్య హరిశ్చంద్ర', 'దక్షయజ్ఞం' మొదలైనవి వీరు నటించిన సినిమాలలో కొన్ని.

అన్నవరపు రామనాధ శాస్ట్రి :
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినీ కళాఖండమైన 'మల్లీశ్వరీ సినిమా గురించి తెలియని తెలుగు వారుండరు. ఆ సినిమాలో మంత్రిగాను, 'తెనాలి రామకృష్ణా సినిమాలో అల్లసాని పెద్దనగానూ అభినందనీయమైన నటనతో అందరినీ అలరించినవారు శ్రీ రామనాధ శాస్త్రిగారు. రంగస్దల నటుడుగ విఖ్యాతులైన వీరు దాదాపు 70 సినిమాలలో నటించారు.
మాధవపెద్ది వెంకట్రామయ్య : 'చిత్రనళీయం' సినిమాలో నలుడుగానూ, 'ద్రౌపదీ మాన సమ్రక్షణం' సినిమాలో శిశుపాలుడుగానూ నటించారు.
బ్రహ్మం:
ప్రముఖ సంగీత విద్వాంసులైన వీరు అలనాటి సినీ కళాఖండం 'మల్లీశ్వరీ చిత్రానికి హార్మోనియం వాయించారు.
సింగరాజు నాగభూషణ రావు:
'నరనారాయణులు సినిమాలో భీముడుగా నటించి, మొప్పించారు.
అద్దంకి శ్రీరామమూర్తి:
1934లో హరిశ్చంద్ర పాత్ర పోషణతో వీరి సినీ ప్రస్దానం ప్రారంభమైంది. ఈ సినిమాలో చంద్రమతి పాత్ర ధరించిన వారు పాత్రధరించిన వారు ప్రముఖ నటి శ్రీమతి కన్నాంబ.'పాదుకా పట్టాభిషేకం' సినిమలో దశరధుడుగానూ, 'అభిజ్ఞాన శకుంతలం'లో కణ్వమహర్షిగానూ నటించారు. 1948 వరకు 25 సినిమాలలో వివిధ పాత్రలు పోషించారు.
పి.ఎల్.నారాయణ:
రంగస్దలం మీదేకాక సినిమా రంగంలో కూడా పి.యస్. తన ప్రత్యేకతను చాటుకున్నారు. 400కు పైగా సినిమాల్లో విలక్షమైన పాత్రలను పోషించి, తెలుగు చలన చిత్రసీమలో ఓ ధృవతారగా వెలిగారు. 'కలియుగ మహాభారతం', 'రేపటి పౌరులు, 'మయూరీ, 'రుద్రవీణ' , 'పుష్పక విమానం' వంటి సినిమాల్లో వారి నటన శిఖరాగ్రాన్ని చేరుకుంది.నిత్య జీవితంలో నలుగురి మధ్యన సంచరించే సగటు మానవులే ఆయన పాత్రలు. అందుకే ఆయన నటిస్తారడంకంటే నటనలో జీవిస్తారనటమే సమంజసం. చక్కని రచయితైన పి.ఎల్. 'అర్ధరాత్రి స్వతంత్రం', తదితర సినిమాలకు సంభాషణలను కూడా అందించారు. 'యజ్ఞం' సినిమాలో అత్యుత్తమమైన నటనను ప్రదర్శించడం ద్వారా'జాతీయ ఉత్తమ సహాయ నటుడు ఆవార్డును అందుకొని జాతీయస్దాయిలో సినీ అవార్డు అందుకొన్న మొట్టమొదటి తెలుగు కళాఖారుడుగా రికార్డు సృష్టించారు.
అచ్యుతుని కృష్ణ మూర్తి:
'ద్రోహీ' సినిమాలో నటించారు.
పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి:
'తల్లితండ్రులు , 'రామరాజ్యం', 'ప్రేమాయణం' మొదలగు సినిమాలకు కధలు రచించారు. 1971లో 'తలిదండ్రులు సినిమాకు ఉత్తమ సినీ కధా రచయితగా రాష్ట్ర ప్రభుత్వ 'నందీ అవార్డును అందుకొన్నారు.


మాధవపెద్ది రాంగోపాల్ (1936-1992):
హై స్కూల్ విద్యార్ధి దశలోనే తన14వయేట చలన చిత్రంలో హీరోగా నటించి అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరించిన వారు రాంగొపాల్ గారు. సుప్రసిద్ద బెంగలీ రచయిత శరత్చంద్ర నవల 'రాముని బుద్ది మతనం' కధ ఆధారంగా తెలుగులో నిర్మించబడ్డ 'దీక్షా చిత్రంలో వీరు హీరోగా నటించారు. ప్రముఖ దర్శకుడు కె.యస్. ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిచబడ్డ ఈ చిత్రం 1951లోవిడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణకు నోచుకోని అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. రాంగోపాల్ నటనా వైదుష్యానికి ఆంధ్ర ప్రజలు జేజేలు కొట్టడంతో అనేక మంది నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యు కట్టారు.ఐతే వారి తల్లిగారైన పుణ్యవతిగారు కనీసం కాలేజీ విద్యైనా పూర్తి కాకుండా సినిమాల్లో నటించడానికి వీల్లేదని ఆంక్ష విధంచడంతో సినీ రంగానికి స్వస్తి చెప్పీఅయన చదువును పునఃప్రారంభించారు.కాలేజీ విద్య పూర్తిచేసుకుని 1961లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఎన్నికై ఢిల్లిలో శిక్షణ పొంది ప్రముఖ దర్శకుడైన కమలాకర కామేస్వరరావుగారు వద్ద అసోసియేట్ డెరెక్టర్ గా పలు చిత్రాలకు పని చేశారు. 'మహామంత్రి తిమ్మరుసు, 'నర్తనశాల', పాండవ వనవాసం' వంటి కళాఖండాలకు సోసియేట్ దర్శకుడిగా పనిచేసి, చత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులతో రాజీపడలేక బాపట్లకు వచ్చి పలు నాటకాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. 'వారసత్వం' నాటికలో బోడిగుళ్ళ గున్నయ్య, 'ఎవరు దొంగ' లో ప్రొక్యూర్ మెంట్ అఫీసర్ పాత్రలు ధరించారు. సినిమా రంగాన్ని వీడినప్పటికీ నాటక రంగాన్ని మాత్రం విడనాడకుండా చివరివరకు రంగస్దల నటుడుగా నాటకాభిమానులను అలరించారు.

ఏకాంబరేశ్వరరావు:
వీరు సినీ నిర్మాత. 'సుఖదుఖాలూ, జగత్ కిలాడీలు, చిత్రాలు నిర్మించారు. వీరు రంగస్దల నటులు కూడా. వాణిశ్రీని హీరోయిన్ గా చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన తొలి నిర్మాత వీరు.
ముప్పలనేని శేషగిరిరావు:
బాపట్ల విద్యారంగాభివృద్ధికై విశేషంగా కృషి చేసిన వీరు 'బలిపీఠం', 'ప్రేమాయణం', 'రజా రమేష్' చిత్రలను నిర్మించారు. 'రాజారమేష్' చిత్రంలో అనేకమంది స్దానిక నటులకు అవకాశం కల్పించారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ సినిమా కొంత భాగం బాపట్లలో షూటింగ్ జరుపుకోవడం విశేషం.
కె.ఎస్.టి శాయి:
విఖ్యాత రంగస్దల నటులైన శాయిగారు చలన చిత్ర నటుడుగా కూడా విశేషంగా రాణించారు. 'అంగడి బొమ్మా', 'సుబ్బారవుకు కోపం వచ్చిదీ', 'ప్రతిబింబాలూ, 'పార్ధుడూ , 'సూత్రధారులూ, 'నవయుగం, 'ఎర్రమందారం', 'స్వర్ణకమంలం' మొదలైన చలనచిత్రాల్లో నటించారు.
కొంపల్లి శ్యాం:
'రాజారమేష్' చిత్రంలో నటించారు.
డా|| కె.వి.యస్. ఆచార్య:
ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వందలాది లలిత గీతాలు రచించిన మధుర కవి డా|| కె.వి.యస్. ఆచార్యప్రముఖ రాజకీయ నాయకులైన ముప్పలనేని శేషగిరిరావు నిర్మించిన 'ప్రేమాయణం' చిత్రంలో పాటలు వ్రాశారు.
కోన గోవిందరావు:
'మొండి మొగుడు-పెంకిపెళ్ళాం' చిత్రంలో నటించారు.
కోన నిత్యానందరావు:
'మంగళసూత్రం' సినిమాలో నటించారు.
కొర్రపాటి గంగాధరరావు:
డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'ఇద్దరు మిత్రులు చిత్రానికి సంభాషణలు సమకూర్చారు. 'మాయని మమత', 'లంబాడోళ్ళ రాందాసు, చిత్రాలకు రచన చేశారు.
నూతలపాటి సుబ్బారావు: 'ఎర్ర మందారం' 'గ్యాంగ్లీడరు మొదలగు సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు.


బెజ్జం రత్నకుమార్ :
రంగస్దలంలో హరిశ్చంద్రుడి పాత్రలో పేరెన్నికలగన్న వీరు కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకర్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'జననీ జన్మభూమీ సినిమాలో నటించారు. ఆ సినిమాలో కూడా వీరు సత్యహరిశ్చంద్రుడి పాత్రను పోషించడం విశేషం.
సాయి శ్రీ హర్ష:
తన సాహిత్య సౌరభాలతో సినీ రంగానికే వన్నెతెచ్చిన బాపట్ల మణిహారం శ్రీహర్ష, జిల్లెళ్ళమూడి అమ్మపై 'నిత్యాన్నదానేశ్వరీ' అను గేయ శతకాన్ని రచ్చించిన వీరు పలు సినిమాలకు పాటల రచనలు చేసారు. వీరు పాటలు రచించిన మొట్టమొదటి చిత్రం 'సిరిపురపు చిన్నోడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడూ, 'యమపాశం', 'నీకోసం', 'పెళ్ళి చేసుకుందాం', 'సోగాడి పెళ్ళాం', 'మహర్షీ, 'సూర్యుడు 'కబడి-కబడీ, 'రాయుడు , 'ఆయుధం', 'మనసున్న మారాజూ, 'పుట్టింటికిరాచెల్లీ', 'కీలుగుర్రం', 'ఔను వాళ్ళిద్దరూ ఇషపడ్డారు , 'చందమామ' , 'నువ్వంటే నాకిష్టం', 'దొంగరాముడు అండ్ పార్టీ', 'కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను 'సిద్దు ఫ్రం శ్రీకాకుళం', వంటి సినిమాలు వీరు పాటలు అందించిన వాటిలో కొన్ని. వీరు రచించిన సినీ గీతాలలో 'పెదరాయుడు సినిమాలోని 'కదిలే కాలమ' ' అను గీతం వీరికి విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చి పెట్టింది. ఇప్పటివరకు వీరు 1000 పాటలకు పైగా రచించారు. గీత రచయితగానే కక 'దొంగోడి పెళ్ళీ, 'ప్రేమలో పావని కళ్యాణ్' వంటి పలు సినిమాలకు చక్కని సంభాషణలను కూడా సమకూర్చారు. వీరు బాపట్ల సాహితీ వైభవానికి మరింత శోభ చేకూరుస్తున్న చక్కని రచయిత.


ముప్పలనేని శివ:
1980లో ఆర్ట్స్ కాలేజీలో బి.ఏ. (లిట్) పుస్ర్తి చేసిన వీరు అదే అఏడాది చెన్నై వెళ్ళి ప్రముఖ దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి వద్ద 22 చిత్రాలకు దర్శకత్వ శాఖలో చిరంజీవి, సోభన్ బాబు, కృష్ణమ్రాజు వంటి ప్రముఖ హీరోల సినిమాలకు సహాయ దర్శకుడుగా పనిచేశారు. 1882లో పరుచూరి బ్రదర్స్ వద్ద కో-డైరెక్టర్ గా పనిచేసిన 1994లో 'ఘరానా అల్లుడూ సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా దర్శకుడుగా అరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు దర్శకత్వం వహించిన ఘనతను సాధించిన శివకు 1995లో దర్శకత్వం వహించిన 'తాజ్ మహళ్ చిత్రం సినీ పరిశ్రమలో సుస్దిర స్దానాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్ర ఘన విజయం వీరికి తదుపరి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించే అపూర్వ అవకాశాలను ఇచ్చింది. 'ప్రియా ఓ ప్రియా', 'గిల్లికజ్జాలూ, అమ్మాయి కోసం', 'రాజా', 'సందడే సందడీ, 'సంక్రాంతీ, వంటి సూపర్ హిట్ సినిమాలను సినీ పరిశ్రమకు అందించి,సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సముపార్జించున్నారు. 2005లో 'నీ ప్రేమమై' చిత్రం ద్వారా ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ప్రభుత్వ 'నంది అవార్డూను పొందడం వీరి సినీ జీవితానికో మైలు రాయి. శ్రీకాత్, వడ్డే నవీన్ లారెన్స్, శ్రీహరి, సిమ్రాన్, మోనికాబేడి, సంఘవి, వంటి హిరో హీరోయిన్లతోపాటు చంద్రబోస్ వంటి గేయ రచయితలకు, శ్రీలేఖ వంటి సంగీత దర్శకులకు చేక్ నిచ్చిన ఘనత వహించారు. ఇప్పటివరకు మొత్తం 17 చిత్రాలకు దర్శకత్వం వహించి, 'లైఫ్ స్టేళ్ అను చిత్రం ద్వారా శ్రీజ అను నూతన సంగీత దర్శకురాలికి అవకాశం కల్పించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపుదిద్దడంతో పేరెన్నికగన్న వీరు దర్శకత్వం వహించిన చిత్రాలలో సిం హభాగం ఘన విజయం సంధిచినవే. 'లైఫ్ స్టేళ్ చిత్రాన్ని తన జన్మభూమైన బాపట్లలో రూపొందించడం తన జీవితంలో మరచిపోలేని మధురానుభూతని చెప్పే ఈ సంచలన దర్శకుడు చక్కని చిత్రకారుడు కూడా. సినిమా రంగానికి బాపట్ల అందించిన ఈ ఆణిముత్యం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకునేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. వీరి కృషి కొత్తగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనుకునేవారికి ఎంతో స్పూర్తిదాయకం.
కోన వెంకట్ :
నిర్మతగా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన వీరు నరేష్ హీరోగా 'తోకలేని పిట్టా అను చిత్రాన్ని నిర్మించారు. తరువాత రచయితగా మారి అనేక చిత్రాలకు కధ, సంభాషణలు సమకూర్చారు. 'వీడే', 'నిన్నే ఇష్టపడ్డాను , 'భగీరధా, 'చుక్కల్లో చంద్రుడూ, 'హ్యాపీ, 'షాక్', 'ఢీ', 'రెఢీ', 'నాస్టేలే వేరూ, 'అదుర్శ్, తదితర చిత్రాలకు సంభాషణలు రచించారు. తెలుగు చనలచిత్ర రంగంలోని అగ్ర హీరోలందరి సినిమాలకు రచన చేసిన ఘనత వీరికి దక్కింది. సునిసిత హాస్యంతో, తేలికైన తెలుగు పదాలతో చురుక్కుమనిపించే సంభాషణలను అందించడం వీరి శైలి. రచయితగా ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చెసుకున్న వీరు రాం గోపాల వర్మ దర్శకత్వం వహించే హిందీ సినిమాలకు కూడా రచన చేస్తున్నారు.
గంగోత్రి విశ్వనాధ్ :
వీరి పూర్తి పేరు గూడూరు విశ్వనాధ శాస్త్రి. 'గంగోత్రీ సినిమాకు సంభాషణలు వ్రాసినప్పటినుంచి గంగోత్రి విశ్వనాధ్ గా పేరుపొందారు. కళాశాల విద్యార్ధి దశలో 'బధిర బాగోతం', 'కళా బాధితుడూ, నాటికలు రచించి చిన్న వయసులోనే పెద్దల ప్రశంసలు చూరగొన్నారు. 'తీతు పక్షీ, 'సరదా సరదా సిగరెట్టూ అను రేడియో నాటికలతో పాటు 'వీలునామ', 'పానకంలో పుడక, అను రంగస్దల నాటికల ద్వారా ఆంధ్ర నాటక రంగంపై చెరగని ముద్రవేశారు. 'లేడీ డిటెక్టివ్', అను టివీ సీరియల్స్ కు కధ, మాటలతోపాటు టైటిల్ సాంగ్ ను కూడా వీరే రచించారు. 'శాంతి నివాసం' టివీ సీరియల్ కు సంభాషణలు అందించారు. 'ఆడదీ, 'పండంటి కాపురం', 'ఆ నలుగురు , మొదలైన టివీ సీరియల్స్ కు టైటిల్ సాంగ్స్ రచించారు. 'గోల్డ్ స్టార్ అను మేగజైన్ కు 'స్వర్గంలో సినిమా గోలా అను సీరియల్ ను రచించారు. కాగా వనిత పత్రికకు వీరు రచించిన 'ఎందరో మహానుబావులు సీరియల్ పలువురిని విషేషంగా ఆకట్టుకుంది. 40 వరకు సినిమా పాటలు రచించారు. వీరు పాటలు సమకూర్చిన సినిమాలలో 'మాయలోడు టైటిల్ సాంగ్' 'శుభలగ్నం', 'పెళ్ళామా మజాక', ఉండగా 'స్టూడెంట్ నెం.1', 'సిం హద్రీ, 'గంగోత్రీ, 'గోరింటాకూ, 'సత్యమేవ జయతే', తదితర 15 చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు. అంతేకాకుండా 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారూ, 'అప్పారావు డ్రైవింగ్ స్కూళ్ తదితర చిత్రాలకు కధను సమకూర్చి, ఆల్ ఇన్ వన్ గా ఖ్యాతి వహించారు. ప్రముఖ సినీ రచయిత దివాకర్ బాబు ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి, సినీ రంగంలో తనకంటూ ఓ సరికొత్త ఇమేజ్ఞు సొంతం చేసుకుని కొత్త రచయితలకు స్పూర్తిదాయకులై నిలిచారు.

జాహ్నవి:


జెమిని టీవిని టీవీ యాంకర్ గా రంగ ప్రవేశం చేసిన వీరు తరువాత అన్ని చానెల్స్ లోనూ రాణించారు. చెరగని చురునవ్వుతో ప్రక్షకులను కట్టిపడేసే ఈ కళాకారిణి 'ఒకరికి ఒకరు తదితర చలనచిత్రల్లోనూ తన నటనా సామార్ధ్యంతో రాణించారు. గోపిచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాలోని నటన ద్వారా 'నందీ అవార్డును తెగుచుకున్నారు.
మారుబోయిన వెంకటేశ్వరరెడ్డి:
'శ్రీ గణేష్' అను కలంపేరుతో పాటలు రచిస్తుంటారు. మా టీవీలో ప్రసారమైన 'శ్రీప్రసన్నాంజనేయం' అను టివీ సీరియల్ కు మాటల రచయితగా పనిచేశారు. పలు ప్రైవేట్ ఆల్బంస్ కు పాటలు రచించారు. ఇతటివల నిర్మించబడిన 'తాత-మనవడు చలన చిత్రానికి మొత్తం పాటలు రచించారు.
చిల్లర రాం బాబు:
పలు సినిమాలకు మరియు టివీ సీరియల్స్ కు వీరు డబ్బింగ్ చెప్పారు. అనేక చిత్రాల్లో నటించారు. సినిమాలకు డబ్బింగ్ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
లేళ్ళ హరి:
భవానీ ఆర్ట్స్ పేరుతో తన చిత్రకళ ద్వారా విశేష ఖ్యాతిని ఆర్జించిన సినిమల్లో 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం', 'అన్నమయ్యా మొదలైనవి సెట్టింగ్స్ ఏర్పాటులో వీరి నైపుణ్యాన్ని చాటిచెబుతాయి.
చిల్లర వేణుగోపాలరావు:
ఆం.ప్ర.సినీ మరియు టీవీ కాస్ట్యూమర్స్ యూనియంకు వీరు జనరల్ సెక్రటరీగాను, ఆం.ప్ర.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయేస్ ఫెదరేషన్ కు ట్రెజరర్ గానూ వ్యవహరిస్తున్నారు.
బడుగు పృధ్వీరాజ్:
పలు సాంఘిక నాటకాలకు రచన, దర్శకత్వం వహించిన వీరు 'ప్రసన్నాంజనేయం' మరియు 'అనగనగా ఒక అమ్మాయీ మొదలగు సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. 12 సంవత్సరాల నుంచి వివిధ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2009లో 'తాత-మనవడు చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించారు.


కేధారి రాఘవ :
'తాళి కడితే 90 కోట్లు అను చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కధ, పాటలు కూడా వీరే రచించారు.
బాపట్ల విద్యనభ్యసించడం ద్వారా ఈ ఊరితో అనుబంధముండి ఇక్కడి సాంస్కృతిక వైభవానికి స్పూర్తినొంది,కళాకరులుగా రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు సినిమా రంగంలో విశేషంగా రాణించి, హీరో, హీరోయిన్లుగానే కాక సంగీత దర్శకులుగా కూడా రాణించారు.
చంద్రమోహన్:
అసలు పేరు కృష్ణమోహన్, బాపట్ల వ్యసాయ కళాశాలలో బి.యస్సీ డిగ్రీ చదువుతుండగా అనేక నాటకాలలో నటించి ఆ రంగం నుండి పొందిన అనుభవంతో సినిమా రంగానికెళ్ళి నటుడుగా తనను తాను నిరూపించుకున్నారు. ఈ నాటికీ విలక్షణమైన పాత్రలు ధరిస్తూ, కొన్ని తరహా పాత్రలకు తాను మాత్రమే సమర్ధుడనని రుజువు చేసుకున్నారు.
దేవీప్రసాద్:
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యనభ్యసించిన వీరు 'ఆడుతూ-పాడుతూ', 'లీలామహల్ సెంటర్, 'బ్లేడ్ బాబ్జీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఘటాడి కృష్ణ:
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్. విద్యనభ్యసించడం ద్వారా ఈ ఊరితో అనుబంధమున్న కళాకారుడు. పెక్కుసినిమాలకు సంగీతం అందించడం ద్వారా సంగీత దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన స్వరపరచిన సినిమాలల్లో ముఖ్యమైనది 'సిక్స్ టీన్శ్, వీరు మంచి గాయకులు కూడా.
వీరితోపాటు గడ్డం రామశేషు, పూల నాగేస్వరరావు, పి.ఎల్.దేవా, జోగారావు తదితరులు నాటక రంగంతోపాటు సినిమా రంగంలోనూ తమ ప్రతిభను ప్రదర్శించారు. సినిమా రంగంలో వివిధ విభాగాల్లో పతిభగల ఎందరో కళాకారులను అందించిన బాపట్ల నేటికీ ఆ రంగంలో తన విజయ బావుటాను ఎగురవస్తూనే ఉంది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

Share

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Designed by ssinfos | Proudly Powered by Revolutionary Media Group