వ్యవసాయరంగం

వ్యవసాయరంగం:
వ్యవసాయం శాస్త్రీయ కళ. 5000 ఏళ్ళకు పూర్వమే ఈ కళ భారతదేశంలో ఉంది. ఋగ్వేదంలో ఈ కళ గురించి వివరించబడింది.పంటలను సంరక్షించవలసిందిగా సూర్య, వరుణ దేవతలను గురించిన ప్రార్థనలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రార్థనల సారం వ్యవసాయం ప్రాచీనతను తెలియజేస్తుంది. వేదాలతోపాటు ఉపనిషత్త్తులు, పురాణాలలోను, అమరకోశము మొదలైన గ్రంథాలలోను ఎరువుల గురించి కూడా చెప్పబడింది. మానవ మనుగడపై పూర్తి ప్రభావాన్ని చూపిన వ్యవసాయం చేయని దేశం నేడు ఉండదు. ప్రారిశ్రామికంగా ప్రపంచం ఎంత ఎదిగినా మనస్సు అన్నమయం అన్న ఆర్యోక్తిని మాత్రం ప్రతి మనిషి గౌరవించవలసిందే. అనుసరించవలసిందే.

బాపట్ల పట్టణం 15 55' ఉత్తరాక్షాంశ 80 30' తూర్పు రేఖాంశాల మధ్య కృష్ణా పశ్చిమ డెల్టాలో దిగువ ప్రాంతంలో ఉంది. సగటున 1000 మి.లీ. వర్షపాతం నైరుతీ మరియు ఈశాన్య ఋతుపవనాల ద్వారా కురుస్తుంది. నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల కాలంలో సగటున 24 నుండి 27 సెల్షియస్ ఉష్ణోగ్రత మరియు ఈశాన్య ఋతుపవనాల కలంలో 18-22 సెల్షియన్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
బాపట్లలో ముఖ్యంగా ఇసుక నేలలు తీరప్రాంతపు చౌడు భూములు ఉన్నాయి. నల్లరేగడి భూములు కొమ్మమూరు కెనాల్, పి.టి.చానల్, బండ్లమ్మ చానల్, నిజాంపట్నం కాలువలు ప్రధాన సాగునీటి వనరులు. ప్రధానంగా పండించే పంటల్లో వరి, సేరుసెనగ, పప్పుధాన్యాలు, కూరగాయలు ముఖ్యమైనవి. ఇక్కడ ఇసుక నేలలు వరి మరియు మఖ్యమైనవి. ఇక్కడ ఇసుక నేలలు వరి మరియు పొగనారు పెంచేందుకు చాలా అనువుగా ఉంటాయి. నియోజకవర్గ పరిధిలో మొదటి పంటగా 67 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో శేరుసెనగ, 2వేల ఎకరాల్లో కాయగూరలు, పూలు సాగు చేస్తారు. ఎత్తిపోతల పధకాల ద్వారా మూడు వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయబడుతున్నాయి. 15 వేల ఎకరాల్లో పంటలు వర్షాధారంగా సాగవుతున్నాయి. రెండవ పంటగా దాళ్వా, సేరుసెనగ, మినుము మొక్కజొన్న, కూరగాయలు పండిస్తారు. ఇసుక మరియు గరప నేలల్లో పండే కూరగాయలు మరియు ఆకుకూరల్లో వంకాయ, దోసకాయ, గోగూర ఇక్కడ బాగా ప్రసిద్దిచెందినవి. చాలామంది చిన్న మరియు సన్నకారు రైతులు కూరగాయల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతారు. కూరగాయలతోపాటుగా మల్లె, కనకాంబరం, బంతి, జాజి, చామంతి, లిల్లీ వంటి అనేక రకాల పూలు మరియు మరువం కూడా దొరువు నీటి ద్వారా కుండపోతతో పండించి, తమ జీవనోపాధి గడుపుకుంటారు.

ఇక్కడ పెంచిన పొగనారు మొక్కలు బాగా బలిష్ఠంగాను, ఏపుగాను పెరిగి అధిక దిగుబడి ఇస్తాయని కోస్తా ప్రాంతంలో మంచి పేరు, చాలా దూర ప్రంతాల నుండి రైతులు వచ్చి పొగనారు తీసుకొని పోవడం సర్వసాధారణం.కృష్ణానది కాలువల ద్వారా పంట పొలాలకు నీరు అందుతుండి.వరి మరియు పొగనారు పెంచేందుకు రైతులు దొరువుల నుండి కుండపోత ద్వారా మొక్కలను పెంచుతారు. కాగా కోళ్ళ పరిశ్రమ, చేపలు మరియు రొయ్యల పెంపకం కూడా వ్యవసాయేతర రంగాల్లో ప్రసిద్దిగాంచినవి.
వ్యవసాయ జీవనోపాధిపై ఆధారపడే రైతు సంక్షేమం దృష్ట్యా వ్యవసాయ కళాశాల బోధన, పరిశోధన మరియు విస్తరణ రంగాల ద్వారా రైతులకు గణనీయమైన సేవలు అందిస్తొంది.పలు ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించడంలోని మెలకువలను తెలియజేస్తుంటాయి.రాష్ట్రంలో పండించే అన్ని ప్రధాన పంటలు మేలు రకాల రూపొందించడం, విత్తనోత్పత్తిని అధికంగావించడం, ఆచరణీయమైన సాగు పద్దతులు రూపిందించడం, కిసాన్ మేళాల నిర్వహణ, ఎరువుల వాడకం, చీడపీడల నివారణ మొదలైన అనేక అంశాలపై రైతులకు సమాచారం అందిస్తుంటాయి.దీనికి తోడుగా వ్యవసాయ రంగంలో కూలీల కొరత నివారించేందుకు రైతులకు కావలసిన యంత్ర పరికరాల మీద బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల గత రెండు దశాబ్దాలుగా రైతులకు సేవలు అందిస్తొంది.
ఇక్కడ 80 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తారు. తీర ప్రాంతం కావడంతో వర్షాకాలం రైతాంగం పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొంగా 1937,1956,1963,1969,1977,1979సంవత్సరాల్లో సంభవించిన పలు భీకర పెనుతుపానులుల వల్ల ఈ తీరప్రాంతానికి అపార జన నష్టం, ఆస్తి నష్టం సంభవించడమేకాక పలు ఆటుపోట్లకు గురయింది. అప్పుడప్ప్డు సంక్షోభాలకు గురవుతున్నా సారవంతమైన భూమి కావడంతో వ్యవసాయమే ఇక్కడి ప్రధాన జీవనాధారమయ్యింది. లెవీ బియ్యం సేకరణలో జిల్లాలోనే బాపట్ల ప్రధమ స్దానంలో ఉంది.
ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బి.పి.టి. 5204 వరి వంగడం బాపట్లలో ఆవిర్భవించడం వ్యవసాయ రంగంలో పెనువిప్లవానికి నాంది పలికింది. ఈ వంగడం బాపట్లను అంతర్జాతీయ వ్యవసాయ రంగంలో ఆగ్రభాగాన నిలిపింది.

వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ మీద జీవించే కుటుంబాలు కూడా ఇక్కడ ఎక్కువే. దాదాపు 60 శాతానికి పైగా ప్రజలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తూన్నారు. రోజుకు 1,20,000 లీటర్లు పాల ఉత్పత్తి జరుగుతుండగా ఏటా సుమారు 100 కోట్ల రూపాయల ఆదాయం దీని ద్వారా వస్తుంది. కోళ్ళ పరిశ్రమ, గొర్రెలు, చేపల వ్యాపారం గ్రామీణార్ధిక వ్యవస్దను ప్రభావితం చేసే ఇతర ప్రధాన అంశాలు. ఇవి లాభసాటి వ్యాపారాలు కావడంతో అనేకమంది ఈ పరిశ్రమల్లో నిలదొక్కుకున్నారు.వీటికితోడు రొయ్యలసాగు 4వేల ఎకరాల్లో సాగుబడి అవుతూఏటా 50కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతుంది.బాపట్ల పట్టణ ప్రాంతం పొరుగు నియోజకవర్గాలవలె నాణిజ్య కేంద్రం కానప్పటికీ గ్రామీణ ఆర్ధిక అవసరాలు తీరడానికి,తద్వారా గ్రామీణాభివృద్ధికి ఈ గ్రమీణ పరిశ్రమలే కీలకంగా నిలుస్తున్నాయి. సరివి నారు, యూకలిప్టస్ తదితర పంటలు తరువాతి స్దానాలను ఆక్రమించినా వీటి ఉత్పదన కూడా గణనీయంగానే ఉంటుంది.
మసూరి బియ్యం: ప్రసిదిగాంచిన ఈ వరి వంగడాన్ని జపాంకు చెందిన శాస్త్రవేత్తల బృందం సైంటిస్ట్ నాసు నేతృత్వంలో 1965-68లో బాపట్లలో తయారుచేసింది.
వరి పంటను ఏపుగా పండించడంలో కోళ్ళపూడి సుబ్బారావు గారు విశిష్ఠమైన స్దానాన్ని పొందారు.దాదాపు ముప్పది ఏళ్ళక్రితం వీరు తన వ్యవసాయ భూమిలో వరి పండించే వారు. వరి మొక్కలను సాధారణ వరి మొక్కలకంటే 3 రెట్లు అధికంగా పొడవు పెరిఏట్లు చేసి, సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.


బి.పి.టి.5204
ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణ అనే సార్ధక నామం ఏర్పడడానికి ఈ నేలపై పండే వివిధ రకాల వరి వంగడాలు కారణభూతమైతే, అన్ని వరి వంగడాలకు తలమానికంగా నిలిచి విశ్వవ్యాప్తంగా వైభవంగా విరాజిల్లుతున్న ఏకైక వరి వంగడం బి.పి.టి.5204.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో అహార విప్లవానికి నాంది పలికిన వరి రకం బి.పి.టి.5204.బి.పి.టి.అంటే బాపట్ల. బాపట్ల పేరుతోనే బి.పి.టి.గా వ్యవహరింపబడుతున్న ఈ ధాన్యం రకం ఆవిష్కరణ ఆధునిక సాస్త్ర పరిశోధనలో ఓ మైలురాయి. ఎందరో శాస్త్రవేత్తలు ఏళ్ళ తరబడి చేస్తున్న పరిశోధనలు రైతులకు ఉపయుక్తమైనవిగా ఉంటున్నా అటు రైతులకు ఇటు సామాన్య జనావళికి అత్యంత ఉపయుక్తమైనరకంగా ప్రశంసలు అందుకొన్న బి.పి.టి.5204 సృష్టి ప్రపంచ వ్యవసాయ రంగంలోనే ఓ అద్భుతమైన ఆవిష్కరణ. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బాటనీ శాఖకు అధిపతిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ యం.వెంకట రమణారెడ్డి (యం.వి.రెడ్డి) గారి నేతృత్వంలో జెనిటిక్స్ మరియుప్లాట్ బ్రీడింగ్ విభాగం సహకారంతో ఈ వరి రకం సృష్టించబడింది. ఇది ట్రిపుల్ క్రాస్ (జి.ఇ.బి)24 ని టి (ఎన్) 1 యోక్క ఉత్పాదన. 1986లో ఇది 'సాంబ మసూరీ అను పేరుతో విడుదల కాబడింది. ఈ బియ్యం వెరైటీ ఆంధ్రప్రదేశ్ లోనే కాక అంతర్జాతీయ స్దాయిలో కూడా అద్భుతమ్మైన వెరైటీగా పేరుగాంచింది. భారతదేశంలో మొత్తం 40 లక్షల హెక్టార్లలో ఇది పండించబడుతుంది. వ్యవసాయదారుడికి అధిక దిగుబడినిచ్చే రకంగానూ, వినియోగదారుడికి రుచికరమైన ఆహారంగానూ ఉపయోగపడుతున్న బి.పి.టి.5204 ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్దాయిలో కీర్తిప్రతిష్ఠలు ఆర్జించిపెట్టింది. ఇది 'కర్నూలు సోనా', 'జీలకర్ర మసూరీ, 'శీరాగపొన్నీ, 'బాపట్లమసూరీ', మరియు 'ఆంధ్ర మసూరీ, అని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో వ్యవహరింబపడుతోంది. వాణిజ్య రీత్యా ఇది 'సోనా మసూరీగా వ్యవహరింపబడుతున్నది. ఊరి పేరుతో ఓ వరివంగడం విఖ్యాతి గడించడం అన్నపూర్ణగా కొనియాడబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణం.


గొంగూర:
'ఆంధ్ర మాతా గా పేరొందిన గొంగూరరుచిని ఆస్వాదించని తెలుగువాడు ఉండడు. పెళ్ళిళ్ళలోగాని, పబ్బాలలోగానీ గొంగూరతో చేయని వంటకం ఉంటే ఆ శుభకార్యనికే వన్నె రాదన్నంత ఖ్యాతి వహించింది గొంగూర.ముఖ్యంగా బాపట్ల గొంగూర రుచిలోనూ, సువాసనతోనూ ఇతర ప్రాంత ప్రజలను సైతం విశేషంగా ఆకర్షించి, ఆకుకూరల్లో రారాజుగా నిలిచింది.
తేలిక నేలలు మరియు బరువైన నేలలు రెండింటిలోనూ సాగు చేయదగ్గ ఏకైక ఆకుకూర బాపట్ల గొంగూర. కేవలం 15,20 రోజుల్లోనే ఆకు కోతకు వచ్చే ఈ పంట రైతులకు ఎంతో లాభదాయంకంగా ఉంటుంది.కారణం ఇది ఋతువులతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పండే ఆకు కూడర కావడమే. వీటిని మొక్కలుగా పీకి మార్కెట్ చేయవచ్చు, మొక్కలను ఉంచి ఆకులను త్రుంచి మార్కెట్ చేయవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. అరుదైన ఇటువంటి విలక్షణత ఉండి. కాబటే ఈ సాగు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ గోగు ఎత్తు తక్కువ. ఇందువల్ల గోగు సాగుకు పోషక పదార్ధాలను అతిగా అందించవలసిన అవసరం లేదు. ఇది పేద నేలలకు సరిపోతుంది. దీన్ని కొండ గొంగూర అంటారు. మొక్కలు పరిపూర్నంగా ఏర్పడ్డాక వీటి తలలను త్రుంచుతారు. ఆకులను మాత్రం అలాగే ఉంచుతారు. దీనివల్ల కాండం గట్టిపడిపోతుంది. ఈ కాండాన్ని నారగా ఉపయోగిస్తారు.ఈ గొంగూరకున్న ప్రత్యేకత... దీనికి సస్యరక్షణ అవసరం లేదు. ఆకు, కాండం మీద ఉండే గరుకు తనం వల్ల పురుగులు తెగుళ్ళు మొక్కను ఆశించడం తక్కువ. అందువల్ల ఈ ఆకుకూర సాగు చేసి నష్టపోవడమేనే సమస్యే ఉత్పనం కాదు.
ఈ ఆకులోని ప్రధానమైన విశిష్టత ఈ ఆకును ఎవరు వండినా, ఎలా వండినా రుచిగా ఉండడం. చాలా తేలిగ్గా ఉడికిపోయే స్వభావం కలదికావడంతో చిన్న పిల్లలు సైతం దీన్ని అతి సునాయాసంగా వండేయ్యగలరు.పప్పు,పులుసుకూరలతోపాటు మాంసాహార వంటకాల్లోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తారు.శాకాహార విందుల్లో విస్తరి నిండా ఎన్ని రకాల పిండివంటలను వడించినా ఎన్నెన్ని కూరలు వడ్డించినా గొంగూరలేని విస్తరి వెలితిగానే ఉంటుంది. అదేవిధంగా మాంసాహార ప్రియులు గొంగూరమటన్ ను అత్యంత అపురూపమైన వంటగ భావిస్తారు. ప్రత్యేక విందు భోజనాల్లో స్పెషల్ ఐటం గా గొంగూర మటన్ కర్రీ సహజంగానే ఉంటుంది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు వంటి ప్రధాన మతస్దులందర్నీ ఒకేరీతిగా అలరించే ఈ కూర లేని విందును ఊహించడమే సాధ్యం కాదు. అలాగే గొంగూరచికెన్, గొంగూరరొయ్యల కూర ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఎర్రగోగుల్లో రక్షక పత్రాలు ఎక్కువగా ఉండి, పులుసు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనితో రుచికరమైన జాం, జెల్లిలను తయారుచేస్తారు. వీటన్నింటికంటే ఖండాంతరాల్లోనూ పేరెన్నకగన్న వంటకం గొంగూర పచ్చడి. ముదిరిన ఆకుతో ఊరగాయ పచ్చడి చేస్తారు. ఈ పచ్చడి మిగతా పచ్చళ్ళకంటే మేలైనది. రుచి, సువాసనలతో పాటు ఆరోగ్యానికి కూడా ఇది దోహదకారి కావడంతో ఈ పచ్చడి లేని ఇల్లు సాధారణంగా ఉండదు. పిల్లలకీ, పెద్దలకీ ఏకరీతిగా నోరూరింపజేసే దీని మాధుర్యాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. పైగా పేద, ధనిక తారతమ్యంలేని ఏకైక ఆకు కూర ఇది.
పేదవారికి సంవత్సరమంతా అందూబాటులో ఉంటూ వారికి అతంత ప్రీతిపాత్రమైన ఆకుకూరగా విలసిల్లే ఈ ఆకు ధనికులకు కూడా అంతే రీతిగా దగ్గరవడం విశేషం. సంపన్న వర్గాల ప్రజలు కూడా ఎటువంటి భేషజాలకు పోకుండా ఈ ఆకుతో చెసిన వంటకాలను ఎంతో ఇష్టంగా భుజిస్తారు. ఈ ఆకుతో చేసిన వంటకం మరు రోజుకు కూడా తాజాగా ఉంటుంది. రుచిలో కూడా ఆ తాజాదనం కోల్పోకుండా ఉండడం ఈ ఆకు ప్రత్యేకత.

రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సమపాళ్ళల్లో అందించే ఈ గొంగూరలోని లవణములు, ఇనుము ధాతుపుష్టిని కలిగిస్తాయి. రక్తహీనతను అరికడతాయి. ఇందులో ఉండే సి విటమిన్ ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. దీనిలోని పీచు పదార్ధం మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు గల గొంగూరను తీసుకోవలసిందిగా వైద్యులు కూడా సూచిస్తున్నారు.పలు సినిమా పాటల్లో గొంగూరను ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతొంది. సామెతల్లోనూ చోటు చేసుకున్న ఈ ఆకు అలనాటి నుండే ఉందని పలు ప్రాచీన గ్రాంధాలు తెలుపుతున్నాయి.
కాగా 'గుంటూరు గోంగూర' జన సామాన్యంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఈ ఆకు గుంటూరుకు చెందినది కాకపోయినా గుంటూరు గొంగూరగా ప్రసిద్దివహించడం విశేషం. నిజానికి గుంటూరు గొంగూరంటే బాపట్ల గొంగూరే. బాపట్ల గొంగూరగా పిలూవబడాల్సిన ఈ ఆకుకూర గుంటూరు గొంగూరగా ప్రసిద్ది పొందడానికి కారణం కవుల కల్పనా చాతుర్యమే.బాపట్లకు దక్కవలసిన ఈ ఖ్యాతి గుంటూరు జిల్లా ప్రజలు ఎంతగా ఇష్టపడతారో ఈ ఆకుకూరకున్న ప్రాముఖ్యాన్ని బట్టి గ్రహించవచ్చు.ఈ ఆకు గుంటూరు జిల్లా అంతా విస్తరించడం కూడా గుంటూరు గొంగూరగా ప్రాచుర్యం పొందడానికి కారణంగా చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా తెలుగుదనానికి ప్రతీకగా నిలిచిన ఈ గొంగూర ప్రతి తెలుగువాడిది అనడం సమంజసం.


బాపట్ల వంకాయ:
వివాహ భోజనంబు అనగేనే మన మనోదృశ్యం ముందు వివిధ రకాల తినుబండారాలు ప్రత్యక్షమవడం సహజం. వాటిని ఊహిస్తేనే నోరూరడం సర్వసాధారణం.ఐతే ఆ పిండివంటల మాదిరిగానే ఊహించిన వెంటనే నోరూరింపజేయగల స్వభావం ఒక కాయగూరకు కూడా ఉందంటే సహజంగానే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. బాపట్ల సీమతో మమేకమై ఊరి పేరుతో ప్రసిద్దిపొందిన ఆ కాయకూరే వంకాయ. మానవ సమాజనికి ఇంటి పేర్లు సంప్రదాయమైనట్లు ఇక్కడి వంకాయకు బాపట్ల అనే ఇంటి పేరు ఉండడం ఒక సహజసిద్ద పరిణామం. 'బాపట్ల వంకాయాగా ప్రసిదిపొందిన ఈ కాయగూర చూసేందుకు ముచ్చటైన ఆకృతితో ముద్దులొలుకుతూ ఎంత మృదువుగా ఉంటుందో డైనింగ్ టేబుల్ మీద పెట్టినప్పుడు యాపిల్ పండులాగా వంటింటింకి అంత అలంకరణగా ఉంటుంది.
రైతుల అర్ధిక అవసరాలను కూడా తీర్చే ఈ వంకాయను బాపట్ల పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దాదాపు 300 గ్రాముల బరువు వరకు ఎదిగే స్వభావం గల ఈ కాయ ఎంత ఎదిగినా అంత ఒదిగినట్లు చిన్న పరిమాణంలో ఉన్నా,పెద్ద పరిమాణానికి ఎదిగినా అంతే రుచిని అందిస్తుంది. ఊరగాయ, పచ్చడి, పులుసు, ఇగురు, వేపుడు వంటి వంటకాల్లో పెద్ద కాయలదే పైచెయ్యి అయినప్పటికీ చిన్న వంకాయలకున్న డిమాండ్ సామాన్యమైంది కాదు. ముఖ్యంగా గుత్తి వంకాయగా ప్రసిద్దిపొందిన చిన్న సైజు వంకాయకు విపరీతమైన క్రేజ్. మార్కెట్లో ప్రత్యక్షమయ్యిందే తడవుగా మాయమయ్యే ఈ కాయలంటే వినియోగదారులకు చెప్పనలవిగాని ప్రీతి.

అతిధులకు గుత్తి వంకాయ కూర చేసి పెట్టడం ఇక్కడి వంటకాల్లో ఓ ఆచారం. ఇది ఈ కాయకున్న రుచి మహత్తును తెలుపుతుండి. తొడిమతో సహా ఉడికిపోవడమే ఈ కాయ ప్రత్యకత. పైగా వండినప్పుడు వెలువడే పరిమళం అతిధులకు ఆకలిని రెట్టింపు చేస్తుంది.
శాకాహర వంటకల్లోనే కాకుండా రొయ్యలు, ఉప్పుచేప వంటి మాంసాహార వంటకాల్లో కూడా ఈ వంకాయ అదే రుచిని అందిస్తూ మాంసాహార ప్రియులకు కూడా ఎంతో ప్రీతిపాత్రమయ్యింది. బజ్జీల రూపంలో కూడా నోరూరించడం ఈ వంకాయకే చెల్లించింది. ఈ ప్రాంత ప్రజానీకానికి ఒక సంప్రదాయ వంటకంగా పేరొందిన బాపట్ల వంకాయ రుచి ఇతర ప్రాంతాలకూ పాకడంతో ఈ కాయకు ఎనలేఅని డిమాండు. అందుకే అనేక ప్రాంతాలకు ఇది అధికంగా ఎగుమతి అవుతుంటుంది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై మార్కెట్లలో తమిళ వర్తకులు 'బాపట్ల వంకాయ' అంటూ పెద్దగా పిలుస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుండడం బాపట్ల వంకాయ ప్రశస్త్యాన్ని తెలియజేస్తుంది.
సాధారణంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న బంఫ్హువుల ఇళ్ళకు పండ్లో, పూలో స్వీట్లో, హాట్లో తీసుకెళ్ళడం ఒక గౌరవంగా భావిస్తుంటారు. సూర్యలంక సముద్ర తీరానికి విచ్చేసే పర్యాటకులు ఈ వంకాయలను కొని వారి ఊళ్ళకు తీసుకెళ్తుంటారు.పలువురు సినీ కవులు తమ సినీ గీతాల్లో'బాపట్ల వంకాయాను ప్రస్తావించిన సందర్భాలు అనేకం.ప్రముఖ రంగస్దల నటులు బందా కనకలింగేశ్వరరావు గారు ఎప్పుడు నాటక ప్రదర్శన నిర్వహించినా నాటకం మధ్యలో ప్రేక్షకులు వీరిచేత 'గుత్తి వంకాయ్ కూరోయ్ బావా' పాటను పాడించుకునేవారు.

అమోఘ రుచితో మమేకమైన ఈ వంకాయలు తాజాదనానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఇతర కాయగూరలకంటే ఎక్కువ రోజులు ఎక్కువ తాజాదనంతో నిగనిగలాడుతుండడం వీటి ప్రత్యేకత. కాబట్టే ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. అందుకే 'తింటే గారెలు తినాలీ అనే నానుడికన్నా 'తింటే బాపట్ల వంకాయే తినాలీ అనే నానుడికే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు.
వ్యవసాయమునగానే వరి పంట కళ్ళముందు కదలాడడం సహజమైనపటికీ బాపట్లలో వరితో పాటు గొంగూర, వంకాయ, దోసకాయ వంటి అనేక ఇతర పంటలు కూడా అంతే సమృద్ధిగా పండడం విశేషంగా పేర్కొనవచ్చు. అనాది నుండి ఇటువంటి పంటలకు ప్రసిద్ధి చెందిన ఇక్కడి నేలలు మరింత సారవంతమవుతూ ప్రజల పంటలుగా వారికి ప్రీతిపాత్రమవుతున్నాయి. ఇతర ప్రాంతాలకు కూడ తమ మాధుర్యాన్ని చవిచూపూతూ ఆయా ప్రాంత ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తున్నాయి.కాబట్టే ఇక్కడ విద్యా రంగంతోపాటు వ్యవసాయ రంగం కూడా విధ్యాతినొందింది. ప్రజావనిని పల్లె పాటల పులకరింతలతో ప్రతి ఋతువులనూ పరవశింపజేస్తుంది.
1977 వరకు ముత్తాయపాలెం నుండి సూర్యలంక వరకు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమ్రక్షణలో ఉండేది. 1977లో సంభవించిన తీవ్రమైన పెనుతుపానుకు ఈ అటవీ ప్రాంతం మొత్తం తీవ్రంగా నష్టపోయింది. వేలాది చెట్లు నేలకూలాయి. ఆ ప్రాంతమంతా దాదాపు మైదాన ప్రాంతంగా మారిపోయింది. అటవీ ప్రాంతంగా ఉండగా ఇక్కడ అమూల్యమైన వనమూలికలు లభించేవి. ఔషధ మొక్కలు ఎగుమతి అయ్యేవి. గురివింద, ముళ్ళవంకాయ, గచ్చకాయ, వాక్కాయ, తోడింత పడ్లు, పుల్లరేగు, పాలపండ్లు, పేము పండ్లు మొదలైన మూలిక సంబంధ తోటలు విరివిగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంత వన మూలికలకు అంతర్రాష్ట్రీయంగా ఎంతో డిమాండు ఉండేది. ఉత్తరేణీ, గోరింట నార, సుగంధ మొక్కలు కూడా ఇక్కడ సమృద్ధిగా లభించేవి. ఇవేకాక ఇక్కడున్నన్ని కుంకుడు చెట్లు మరెక్కడా ఉండేవి కావు. ప్రస్తుతం ఇక్కడ వాక్కాయలు మాత్రమే లభిస్తున్నాయి.

వెదుళ్ళపల్లి గ్రామం పూల వ్యాపారానికి అత్యంత ప్రసిద్ది చెందింది. రోజుకి దాదాపు 10 లక్షల రూపాయల విలువైన పూల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

Share

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Designed by ssinfos | Proudly Powered by Revolutionary Media Group