స్వాతంత్ర్య సమరోద్యమం:
1857 మే 10న మీరట్ లో జరిగిన సిపాయిల తిరుగుబాటు మాతృదేశం గురించి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. మన తరపున ఎవరో ఒకరు పోరాడుతున్నారులే అనే అశ్రద్ధ భావనను ప్రజలనుండి దూరం చేసింది.ప్రధానంగా సిపాయిలే ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పటికీ, ప్రప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా చరిత్రలో నిలిచిపోయింది.ఈస్ట్ ఇండియ కంపెనీ పరిపాలన వల్ల విసిగివేసారిపోయిన ప్రజల అసహనం ఈ తిరుగుబాటు ద్వారా దేశంలో పలుచోట్ల ప్రజలను చైతన్యవంతులను చేసింది.ఆ చైతన్యం అంతటితో ఆగక పలు నిరసనల రూపంలో వెల్లువెత్తుతూ 1915లో గాంధి దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగివచ్చి,దీనికి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాక ఓ సంపూర్ణ స్వరూపాన్ని సంతరించుకుంది.అప్పటివరకు దిశానిర్దేశం లేకుండా సాగుతున్న ఉద్యమం గంధీజీ ప్రవేశపెట్టిన సత్యాగ్రహంతో ఓ పరిపూర్ణమైన రూపాన్ని సంతరించుకుంది. సత్యం, అహింసలే ప్రధాన ఆయుధాలైన సత్యాగ్రహం భారత జాతి యావత్తునూ అత్యంత వేగంగా ఆకర్షించింది. ఆ ఆకర్షణలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాపట్ల.
చారిత్రక సాక్షాలకు సజీవంగా నిలిచిన ప్రసిద్ధ దేవాలయాలతో అలరారుతున్న భావపురి, విద్యారంగంలో కేంబ్రిడ్జి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సాహిత్యరంగంలో భావ సౌందర్యాల విరిగా, రాజకీయ రంగంలో ఆణిముత్యాలను అందించిన గడ్డగా, బౌద్ధా రామాలకు నిలయంగా, వ్యవసాయరంగానికి పట్టుకొమ్మగా విరాజిల్లుతున్న బాపట్ల, రాష్ట్ర చిత్రపటంలోనే గాకుండా, దేశ చిత్రపటంలోనే ఒక ప్రత్యక స్ధానాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో, భుస్వామ్య వ్యతిరేక ప్రజా తంత్ర ఉద్యమానికి శుభారంభం చేసిన గడ్డ భావపురి . ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావలనే నినాదాన్ని మొట్ట మొదట బాపట్లలో 1913 లో జరిగిన ఆంధ్రమహాసభ లేవనెత్తింది. బాపట్లలో 1944 పొగాకు రైతు మార్కెట్ కమిటీ ఎన్నికల్లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కొల్లా వెంకయ్య గెలిచారు. 1946 శాసన సభ ఎన్నికల సందర్భంలో విశాలంధ్ర లో ప్రజారాజ్యం అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని కమ్యూనిస్టు పార్టీ తీసుకుంది. అలాగే కమ్యూనిస్టు నాయకులను బాపట్ల ప్రాంతాలలో ఉంచి వారి బాధ్యత తీసుకున్నరు. కామ్రెడ్ చండ్ర రాజేశ్వరరావు, దాసరి నాగభుషణ రావు తదితరులు ఈప్రాంతములో ఉండి వుద్యమాన్ని నడిపారు. 1977 లో నల్లమడ రైతు సంఘం స్ధాపించి దానినిర్వహణకు కౄషిచేసిన ఘనత కమ్యూనిస్టులదే. ఈప్రాంతంలో ఈరోజు కల్వలు వచ్చి సమయానికి సగునీరు అందుతుంది. చెయెత్తి జై కొట్టు తెలుగోడా అన్న వేములపల్లి శ్రీ క్రిష్ణను శాసన సభకు మొదితిసారిగా అందించిన ఘనత భావపురిదే. అపర భాసరగా ఖ్యాతిచెంది కళారంగంలో సారన్వత మాగాణిగా నిలిచింది. శ్రీ భావనారాయణ స్వామి స్వయంభువునిగా వెలయడంవల్ల భావపురిగా నామాన్ని సంతరించుకొని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విద్యాకేంద్రంగా నేడు బాపట్ల పట్టణం వెలసిల్లుతున్నది. స్వయంభువునిగా వెలసిన శ్రీ భావనరాయన స్వామి వారికి క్రిమి చొళ మహారాజు క్రీ. శ. 594 లో ఆలయం కట్టించారు. క్రీ.శ. 594 నుండి క్రీ.శ. 1574 వరకు హిందూరాజులు పాలించగా చైతన్య కేంద్రంగా విలసిల్లింది. క్రీ.శ. 1760 నుండి ఈస్ట్ ఇందియా కంపెనీ అధికారాన్ని బాపట్ల ప్రాంతం పై చెలాయించింది. కాగా క్రీ.శ. 1803 లో అమరావతికి చెందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ బాపట్ల ప్రాంతాన్ని బహిరంగ వేలం లో కొనుగొలు చేసాడు. స్వాతంత్ర సంగ్రామంలో బాపట్ల ప్రాంతం గణనీయ పాత్ర నిర్వహించింది. పూర్వపు తాలూకాలో ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య పన్నుల నిరాకరణోద్యమం నడిపిన సంగతి అందరికి విదితమే. 1920 లో సహాయ నిరాకరణోద్యమం జరుగగా బాపట్ల తాలూకాలోన్ 64 గ్రామాలలో సఘాలను ఏర్పరచి ఉద్యమాలను నడిపారు. కొందరు రెవెన్యూ ఇనిస్పెక్టర్లు, గుమస్తాలు తమ ఉద్యోగాల కు స్వస్థి చెప్పి న్యాయవాదులతోపాటు ఉద్యమంలో చేరారు. మహాత్మా గాంధీజి బాపట్ల ప్రాంత పర్యటనకు రాగా తిలక్ స్వరాజ్య నిధికి నగదుతో పాటు బంగారు ఆభరణాలను దేశభక్తులు సమర్పించారు. శహయనిరాకరణోజ్యమంలో పాల్గొన్నందున ఆంధ్ర రత్న దుగ్గిరాలతో పాటు మంతెన క్రిష్ణం రాజు, బూదరాజు లక్ష్మీనారాయణ, బూదరాజు లక్ష్మీనరసిం హా రావు, పిల్లుట్ట్ల హనుమంత రావు, అడుసుమల్లి శ్రీనివాస రావు పంతులు వంటివారు జైలు పాలయినారు. ఉద్యమంలో భాగంగా 1921 డిసెంబర్ 31 న 48 మంది గ్రామోద్యొగులు రాజీనామాలు సమర్పించారు. పన్నుల నిరాకరణోద్యమంలో భాగంగా నాటి బాపట్ల తాలూకాలోని పెదనందిపాడు ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి జిల్లా కలెక్టర్ రూదర్ ఫర్డ్ మిలిటరీ క్యాంపును ఏర్పాటుచేశారు. సంకా సీతారామయ్య, దాసరి స్రీరాములులను పెదనందిపాడు నుంచి చిలకలూరిపెట వరకు 8 మైళ్ళు గుర్రం వెంట శిక్షగా పరుగెత్తించారు. 1930 లో సాగిన ఉద్యమంలో పాల్గొన్నందుకు బాపట్ల తాలూకాలోని 124 మందిని నాటి ప్రభుత్వం జైలుకు పంపింది. విదేశీ వస్తు బహిస్కరణలలో పాలుగొన్నందుకు 44 మందిని 6 నెలలనుండి 2 సొంవత్సరాలవరకు శిక్ష విధిస్తూ జైలుకు పంపింది. స్ధానం పార్ధసారధి, నాళం శ్రీరామచంద్ర రావు, రావూరి శ్రీసైలపతి వంటి వారు స్వాతంత్ర ఉద్యమంలో పాలుగొన్నారు.
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ప్రధమ ఆంధ్ర మహాసభ 1913 లో బాపట్ల టౌన్ హాలులో జరిగింది. రెండుసార్లు గాంధీజి బాపట్ల ప్రాంతాన్ని సందర్శించారు. 1934 లో భారత తొలి రాష్ట్రపతిగా పేరుగడించిన బాబూ రజేంద్ర ప్రసాద్ సందర్సించ్హరు, 1936 లో పెను తుఫాను సంభవించగా బాధితుల సహాయార్ధం విరాళాల సేకరణకు గాంధీజి తమ రెండవ పర్యటనకు వచ్చారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, జయప్రకాష్ నారాయణ, రాజాజీ, వంటి ప్రముఖులు కూడా బాపట్ల ప్రాంతాన్ని సందర్శించినవారిలో వున్నరు.
1913 లో బయ్యా నరసిం హశర్మ అధ్యక్షతన ప్రధమ ఆంధ్ర మహాసభను నిర్వహించడం ద్వారా ఒక చారిత్రక ఉద్యమానికి శ్రీ కారం చుట్టిన బాపట్ల స్వాతంత్ర్య సమరంలో అనేక ఉద్యమాలను కేంద్రస్ధానమయ్యింది. 1929 లో జాతీయ కాంగ్రెస్ సమావేశం బాపట్లలో దేశభక్త కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగింది. శ్రీ యుతులు రావూరి శ్రీశైలపతి, గౌస్ బేగ్, నబీ సాహెబ్, మంతెన వెంకటరాజు, ఆచార్య రంగా, భట్టిప్రోలు సూర్యప్రకాశరావు, స్ధానం పార్ధసారధి, బొడ్డుపల్లి వెంకటప్పయ్య, వి.ఎల్. సుందర రావు, మహమ్మద్ హనీఫ్, మద్దులూరి రామకృష్నా రావు లాంటి నాయకులు వెదేశీ వస్త్ర బహిస్కరణలో ప్రముఖ పాత్ర వహించారు. 1934 లో జవహర్ లాల్ నెహృ బాపట్లలో బహిరంగసభలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 1942 ఆగస్టు 12 న నాళం రామచంద్ర రావు గారి నాయకత్వంలో రైల్వే స్టేషంపై దాడి చేసి, టెలిగ్రాఫ్ స్తంభాలను పగులగొట్టి, టెలిఫొన్ సౌకర్యాలకు ఆటంకం కల్గించారు. తిలక్ స్వరాజ్య నిధికి బాపట్లలో రూ. 7,272/- లు సేకరించ బడ్డాయి. ఆ ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు చేసిన ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గ్రంధి నాగేశ్వరరావు, పాతురి అప్పయ్య శాస్త్రి, మంతెన కృష్ణం రాజు, భట్టిప్రోలు సూర్యప్రకాశరావు, పిల్లుట్ల హనుమంతరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, డా. ఎం. మల్లికార్జునుడు, డా. మెండ్లూరి సాంబశివరావు, కోటం రాజు సత్యనారాయణ శర్మ తదితరులకు ప్రభుత్వం జైలు శిక్ష విధించింది.
బోడ్డపాటి కృష్ణమూర్తి( బాపట్ల) : శాసనోల్లంఘనలో పాల్గొని 25-6-1932 నుంచి 24-12-1932 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో 6 నెలలపాటు శిక్ష అనుభవించారు. ఆధారపు కృష్ణారావు : (పొన్నూరు) 1930 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడంతో అరెస్ట్ కాబడ్డారు. శాసనోల్లంఘన ఉద్యమంలో లాఠీ చార్జికి గురుయ్యారు. 1942లో క్విట్ ఇందియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ కాబడ్డారు. కంభంపాటి కుమారస్వామి (మర్రిపూడి) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 14-8-1930 నుంచి ఏడాదిపాటు కారాగారశిక్ష విధించబడింది. ఐతే వీరు శిక్ష అనుభవిస్తూనే రాజమండ్రి సెంట్రల్ జైలో 11-11-1930న మరణించారు. తూము లక్ష్మీకాంతరావు (కట్టెంపూడి) : వీరు శాసనోల్లఘనోద్యమంలో పాల్గొనడం వలన 9-5-1930 నుండి 9 నెలలపాటు కారాగార శిక్ష విధించబడింది. వీరి శిక్షను రాజమండ్రి మరియు వీరు శిక్షను రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో అనుభవించారు. మాధవపెద్ది లక్ష్మీనారాయణ (బ్రాహ్మణకోడూరు) : వీరు కూడా శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన 17-7-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి, వెల్లూరు జైళ్ళలో కారాగార శిక్ష అనుభవించారు. గ్రామ కరణంగా పనిచేస్తున్న వీరు 1921లో సహయ నిరాకరన ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అన్నమ్రాజు లక్ష్మీనరసిం హరావు (బోడిపాలెం): గ్రామ కరణంగా పనిచేస్తున్న వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నండూరి లక్ష్మీనరసిం హరావు (బాపట్ల) కరణంగా పనిచేస్తున్న వీరు 1921లో సహాయ నిరాకరన ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చుతుగా పాల్గొన్నారు. లక్ష్మీనారాయన(పూడ్ల) : గ్రామ సహాయ కరణంగా పనిచేస్తున్న వీరు కూడా 1921లో సహయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చురుగా పాల్గొన్నారు. గోగినేని లక్ష్మీనారాయణ (నిడుబ్రోలు) : 1932లో కిసాన్ ఉద్యమంలో పాల్గొన్నారు. ద్వితీయ ప్రపంచం సంగ్రామ వ్యతిరేకోద్యమంలో పాల్గొనడం వలన 5-3-1940 నుంచి ఏడాది పాటు దారరాగార శిక్షకు గురయ్యారు. పి. లోకనాధం (పొన్నూరు) : సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడం వలన 15-1-1940 నుంచి ఏడాది పాటు రాజమండ్రి, వెల్లూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. మంచాల మల్లయ్య (బాపట్ల): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన వీరు 7-5-1930 నుండి 6 నెలల పాటు రాజమండ్రి, మరియు మద్రాస్ సెంట్రల్ జైళ్ళలో శిక్షను అనుభవించారు. ముప్పలనేని మాణిక్యరావు(బాపట్ల) : సత్యాగ్రహోద్యమంలో పాల్గొనటం వలన వీరికి 6 నెలల కారాగార శిక్షమరియు 200 రు.జరిమానా విధించబడినది. కొత్తగుండు ముత్తయ్య (అల్లూరు): 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనటం వలన విజయవాడ సబ్ జైలులో కారాగార శిక్ష అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటం వలన వీరికి 24-5-1930 నుండి ఏడాదిపాటు కారాగార శిక్ష విధించబడింది. వీరి శిక్షను రాజమండ్రి, కోయంబత్తూరు మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. గాంధి-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా వీరు 13-3-1931 న జైలునుండి విడుదల కాబడ్డారు. గోరంట్ల నాగభూషణం (నరసాయపాలెం) : సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 50రు. జరిమానా మరియు 28-1-1941 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో 3 నెలలపాటు శిక్ష విధించబడింది. గోకరాజు నాగరాజు (పిట్టలవానిపాలెం) : శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన 1930-32ల మధ్య 2సార్లు అరెస్ట్ అయ్యారు. పత్తిపాటి నాగరాజు (ఖాజీపాలెం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటం వలన 20-5-1930 నుంచి 9 నెలలపాటు రాజమండ్రి మరియు కోరాపుట్ జిల్లాల్లో కారాగార శిక్షను అనుభవించారు. తెలగ నాగరత్నమ్మ (బాపట్ల) : వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనటం వలన 1932లో వీరు అరెస్ట్ కాబడ్డారు. నాగయ్య (కర్లపాలెం) : గ్రామ మునసబైన వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితుడై తన పదవికి రాజనామా చేశారు. గంధం నాగేశ్వరరావు (పసులూరు) : సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వీరు తన కరణం పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. 11-3-1922 నుండి 28-2-1923 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. మంతెన నరసరాజు (బుద్దాం) : శాసనోల్లంఘనోదమంలో పాల్గొనడం వలన వీరికి 200రు. జరిమానా మరియు 23-5-1930 నుంచి 30-9-1930 వరకు జైలు శిక్ష విధించబడింది. వీరి శిక్షను రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. పెనుమత్స నరసరాజు (మంతెనవారిపాలెం) : శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనటం వలన బ్రిటిష్ ప్రభుత్వం వీరికి జైలు శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 2-7-1930 నుంది 14-3-1931 వరకు ఏడాదిపాటు రాజమండ్రి తిరుచునాపల్లి మరియు ఆలీపురం జైళ్ళలో అనుభవించారు. చెరుకూరి నరసిం హరాజు (ఖాజపాలెం) : విద్యార్ధి దశలో ఉండగా వీరు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 27-5-1932 నుంచి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. ముదునూరి నరసిం హరాజు (బుద్దాం) : శాసనోల్లంఘనలో పాల్గొని 12-5-1932 నుంచి 6నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. కోటం రాజు నరసిం హరావు (బాపట్ల) : 1932లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడంతో వీరు అరెస్ట్ కాబడ్డారు. పాటి బండ్ల పాపయ్యా (కాట్రపాడు) : కాట్రపాడు గ్రామ మనసబైన వీరు సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితుడై 15-1-1922న తన పదవికి రజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. దొంతినేని పరదేశి (గోపాలపురం) : గోపాలపురం గ్రామ మునసబైన వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితుడై తన పదవికి రజీనామా చేశారు. పుష్కరాంబ ముప్పలనేని (నిడుబ్రోలు): శాసనోల్లంఘనలో పాల్గొన వీరు 11-7-1932 నుంచి 6 నెలలపాటు కారాగార శిక్షకు గురయ్యారు. వీరు ఈ శిక్షను వెల్లూరు, కన్ననూరు జైళ్ళలో అనుభవించారు. టి.వి. రాఘువాచారి (వడ్డెములకల) : శాసనోల్లంఘనలో పాల్గొనటం వలన ప్రభుత్వ వీరికి 8-7-1930 నుండి రెండేళ్ళపాటు కథిన కారాగార శిక్ష విధంచింది.రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో శిక్షను అనుభవించిన వీరు గాంధీ-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా 12-3-1931లో విడుదలయ్యారు. వత్సవాయి రాఘువరాజు (బుద్దాం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి బ్రిటిష్ ప్రభుత్వం 100రు. జరిమానాతోపాటు ఏడాదిపాటు జైలు శిక్ష కూడా విధించింది. 24-5-1930 నుండి 14-3-1931 వరకు వీరు ఈ శిక్షను రాజమండ్రి మరియు తిరుచిరాపల్లి జైళ్ళలో అనుభవించి, గాంధి-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా విడుదలయ్యారు. దీవి రామచంద్రరావు (పొన్నూరు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం వీరికి 24-9-1942నుండి 3 సం|| లపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. నాళం రామచంద్రరావు (బాపట్ల): అచంచల దేశ భక్తి, నిబద్దత ఉన్న వారిలో నాళం రామచంద్రరావుగారు ముందు వరసలో ఉంటారు. జతీయోద్యమంలో వీరు నిర్వహించిన పాత్ర ఏనాటికీ మరువలేనిది. ప్రముఖ న్యయవాదైన వీరు బాపూజీ ఇచ్చిన వ్యక్తి సత్యగ్రహం పిలుపుకి స్పందించారు. బాపట్ల సబ్ కోర్టులోనికి ప్రవేశించి జార్జి చిత్రపటాన్ని ద్వంసం చేశారు. ఆవెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో చొరబడి అక్కడి రికార్డులన్నీ తగులబెట్టి అజ్ఞాతంలోని కి వెళ్ళిపోయారు. పోలీసులు ఆయనకోసం ఊరంతా గాలించారు. ఊరి ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం బాపట్లలో మార్షల్ లా ప్రకటించింది. అనుమానమొచ్చిన అనేకమంది సానుభూతిపరుల ఇళ్ళను గాలించింది. అందులో ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారి ఇల్లు కూడా ఒకటి. అలా పారిపోయిన నాళం రామచంద్రరావు గారికి రాజమండ్రిలో ప్రముఖ కవి నాళం కృష్ణారావు గారు ఆశ్రయమిచ్చారు. కొన్నాళ్ళకు ఆయన అరెస్ట్ కాబడి ఒంగోలు జైలుకు తరలించబడ్డారు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యయానికి నాయకత్వం వహించినందుకు వీరికి బ్రిటిష్ ప్రభుత్వం 500 రు. జరిమానాతోపాటు 2 సం||లపాటు కారాగార శిక్ష విధించింది. 25-11-1943 నుండి వీరు ఈ శిక్షను బళ్ళారి, మద్రాసు మరియు ఆలీపురం జైళ్ళలో అనుభవించారు. అంతేకాకుండా జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు వీరు న్యాయవాద వృత్తి చేపట్టకుండా ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. వీరగంధం రామచంద్రయ్య (కంకటపాలెం) : శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం వీరికి 5-4-1932 నుండి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. బండి రామదాసు (బాపట్ల) : గ్రామాధికారిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వీరు స్వాతంత్ర్యోద్యమంపట్ల ఆకర్షితులై సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తన ఉద్యోగానికి 1921లో రాజీనామా చేశారు. అన్నం రాజు రామకోటయ్య (జిల్లెళ్ళమూడి) : కరణంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు సహయ నిరాకరణోద్యమంలో భాగంగా తన పదవికి 1921లో రాజీనామా చేసి ఉద్యమంలో విశేషంగా పాల్గొన్నారు. మంతెన రామకృష్ణం రాజు (బుద్దాం): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం 20-5-1930 నుంచి నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. మద్దులూరి రామకృష్ణారావు (బాపట్ల) : వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడం వలన 28-1-1941 నుండి 4 నెలలఫాటు రాజమండ్రిసెంట్రల్ జైలులో కఠిన కారాగారవాసాన్ని అనుభవించారు. కాట్రపాడు కరణంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తన పదవికి 1921లో రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం ఏడాదిపాటు కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను వీరు రాజమండ్రి, తిరుచురాపల్లి మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. గాంధి-ఇర్విన్ ఒప్పందం ప్రకారం వీరు 14-3-1931న విడుదల కాబడ్డారు1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడంతో వీరిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది.శాసనోల్లంఘనలో పాల్గొనడంతో బ్రిటిష్ ప్రభుత్వం వీరికి అరెస్ట్ చేసింది. 6-6-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి, మధుర జైళ్ళలో వీరు కారాగార శిక్ష అనుభవించారు. కూసంపూడి రామరాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి ప్రభుతం కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 20-5-1930 నుండి 9 నెలలపాటు అనుభవించారు. మంతెన రామరాజు (పిట్టలవానిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కథిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 25-1-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. పెనుమత్స రామరాజు (పిట్టలవానిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి కూడా ప్రభుత్వం కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 16-6-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. మునివల్లి రామారావు (మునిపళ్ళె): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కటిన కారాగార విధించింది. వీరు ఈ శిక్షను 17-6-1937 నుండి 1-8-1937 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. గొల్లమూడి రామస్వామి (బాపట్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి రాజనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు. మదమంచి రామస్వామి (వల్లభరావుపాలెం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921 లో తను చేస్తున్న గ్రామ మునసబు ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. మన్నవ రామేశ్వరరావు (మన్నవ): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 5-3-1943 6 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులోఅనుభవించారు. విశాఖపట్నంలో ఎం.బి.బి.యస్. విద్యనభ్యసిస్తుండగా వీరు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడంతో బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా వీరు 23-1-1941 నుండి 25-7-1941 వరకు వెల్లూరు మరియు రాజమండ్రి సెంట్రల్ జైళ్ళలో శిక్ష అనుభవించారు. గొట్టుముక్కల రంగనాయకులు (కాట్రపాడు):సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 15-1-1922లో తను చేస్తున్న గ్రామ మనసబు ఉద్యోగానికి రాజీనామ చేసి స్వాతంత్ర్ల్యోద్యమంలోని దూకారు. కంకిపాటి రంగరాజు (పిట్టలవానిపాలెం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 18-5-1930 నుండి 9 నెలలపాటు రాజమండ్రి, వెల్లూరు మరియు అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. మన్నవ రంగారావు (మన్నవ): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కఠిన కారాగార శిక్షవిధింధింది. వీరు ఈ శిక్షను 5-3-1943 నుండి 6 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. కోనా రంగయ్య (వల్లభరావుపాలెం):సహాయ నిరాకరణోద్ల్యమంలో భాగంగా 1921లో తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి రాజీనామా చెసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. మేడా రంగయ్య (పెదనందిపాడు): విశాఖపట్నంలో ఎం.బి.బి.యస్. చదువుతుండగా జాతీయోద్యమంపట్ల ఆకర్షితులయ్యారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఫలితంగా 23-1-1941 నుండి 25-7-1941 వరకు వెల్లూరు, రాజమండ్రి సెంట్రల్ జైళ్ళలో కారాగారకి గురయ్యారు. నూతలపాటి రంగయ్య ఎలియాస్ దొంగయ్య (జమ్ములపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన 6-8-1932 వరకు జైలుశిక్ష అనుభవించారు. వీరు ఈ శిషను రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. మాధవరెడ్డి రత్నం (బాపట్ల) సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి రాజీనామా చెసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. పొట్టూరి రోశయ్య శాస్త్రి (పొన్నూరు): సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం వలన వీరు 23-3-1922లో అరెస్ట్ అయ్యారు. నూతక్కి సాంబశివరావు (బ్రాహ్మణకోడూరు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వలన 25-4-1944న వీరు జైలు శిక్షకు గురయ్యారు. వీరు ఈ శిక్షను అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. జాలాది సత్యనారాయణ (నిడుబ్రోలు): క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ ను తగలబెట్టడంతో ప్రభుత్వం వీరికి మూడున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. తూములూరి సత్యనారాయణ( పొన్నూరు): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి 6 నెలల కారాగార శిక్ష విధించబడింది. జైలు నుండి విడుదలయ్యాక శాసనోల్లంఘనలో పాల్గొనడంతో 23-1-1931 నుండి 6 నెలలపాటు జైలు శిక్ష విధించబడింది. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక వలన 12-3-1931 లో జైలు నుండి విడుదలయ్యారు. అల్లూరి సత్యనారాయణ రాజు (మంతెనవారిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన వీరికి 50 రు. జరిమానా మరియు 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 25-1-1932 నుండి రాజమండ్రి జైలులో అనుభవించారు. మంతెన సత్యనారాయణ రాజు (ఖాజీపాలెం) ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 18-5-1930 నుండి రాజమండ్రి మరియు కోరాపుట్ జైళ్ళలో అనుభవించారు. తన్నీరు సత్యవతమ్మ (బాపట్ల) శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 1932లో అరెస్ట్ కాబడ్డారు. మంతెన సత్యనారాయణ రాజు (అల్లూరు): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న మనసబు ఉద్యోగానికి రాజీనామా చెసి స్వాతంత్ర్ల్యోద్యమంలో పాల్గొన్నారు. ఆధారపురపు శేషగిరిరావు (పొన్నూరు): శాసనోల్లంఘనలో పాల్గొని వీరు 23-1-1931 నుండి 6 నెలలపాటు జైలుకెళ్ళారు. మరలా అదే ఉద్యమంలో పాల్గొని 22-6-1932న మరోమారు జైలుపాలై 6 నెలలు ఈ శిక్షను అనుభవించారు. ఇందుకూరి శేషం రాజు అలియాస్ సోమరాజు (బుద్దాం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన వీరికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 12-5-1932 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. మంతెన సత్యనారాయణ రాజు (అల్లూరు): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న మునసబు ఉద్యోగానికి రాజీనామా చచేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. చివుకుల శేషశాస్త్రి (బాపట్ల): విలక్షణ వ్యక్తిత్వం గల వీరు అది నుంచి స్వాతంత్ర్యోద్ల్యమంలో చురుకైన పాత్ర వహించారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 14-12-1940 నుండి వెల్లూరు మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. 50 రు.జరిమానా కూడా వీరికి విధించబడింది. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనడంతో 20రు. జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించబడింది. భూపోరాటాలు, ముఠా వర్కర్ల పోరాటాలు వంటి అనేక ప్రజ పోరాటాల్లో వీరు పాల్గొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కు వ్యతిరేకంగానూ వీరు పోరాడారు. వీరు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో విమాన దాడుల నుంచి తీసుకోవలసిన రక్షణ జాగ్రత్తల సాంకేతిక బోధకుడు (ఎయిర్ రెయిడ్ ప్రికాషన్స్) గా పని చేశారు. ఆనాటి నుంచి వీరిని ఎ.అర్.వి.శాస్త్రిగా పిలిచేవారు. ఆ సందర్భంగా వీరు ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు 'ఏ.అర్.వి.లో చేరరా, ఎంతో దేశ సేవ చేయరా' అనే పాటను రచించి, ప్రచారం చేశారు. అంధ్ర ప్రాంతంలోననే కాకుండా వీరు తెలంగాణాలోనూ నిజాంకు వ్యతిరేకంగా పేద రజలకోసం పోరాటాలు చేసారు. 1950 మే 12న వీరు ఎంకౌంటర్లో మరణించారు. వీరి స్మృతికి చిహ్నంగా బాపట్ల చీలు రోడ్డులో 'చివుకుల శేషశాస్త్రి స్మారక స్తూపం' నిర్మించబడింది. షేక్ ఫకీర్ అహ్మద్ (పెదనందిపాడు): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 15-1-1922 లో తను నిర్వహిస్తున్న గ్రమాధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. షేక్ మస్తాన్ (నిడుబ్రోలు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం వీరికి మూడున్నర సంవత్సరాలపాటు కారాగార శిక్ష విధించింది. 24-9-1942 నుండి వీరు ఈ శిక్షను అలీపురం క్యాప్ జైలులో అనుభవించారు. షేక్ మొహియుద్దీన్ (పెదనందిపాడు): సహాయ నిరాకరణోద్యమంలో బాగంగా 15-1-1922 లో తను నిర్వహిస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.శాసనోల్లంఘనలో పాల్గొని 16-1-1933 నుండి సంవత్సరంపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. వీరికి 2000 రు. జరినానా కూడా విధించబడింది. మంతెన సింగరాజు (బుద్దాం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 100రు. జరిమానా మరియు ఏడాదిపాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-5-1930 నుండి 11-3-1931 వరకు రాజమండ్రి మరియు బళ్ళారి సెంట్రల్ జైళ్ళాలో అనుభవీంచారు 1932 లో శాసనోల్లంఘనోద్యమంలో పికెటింగ్ చేస్తుండగా ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి, గ్రామ పోలిమేరల్లో పంటరిగా వదిలేసివచ్చింది. దాట్ల సీతారామరాజు (ఖాజీపాలెం): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 6 నెలలపాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 27-5-1942 నుండి 11-3-1931 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 6నెలలు పాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 3-10-1930 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించి గాంధి-ఇర్విన్ ఒప్పందం కారణంగా 11-3-1931న విడుదలయ్యారు. నేతి శివరామకృష్ణయ్య (నండూరు): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 6 నెలల పాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 4-3-1931 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించి గాంధి-ఇర్విన్ ఒప్పందం కారణంగా 11-3-1931 న విడుదలయ్యారు. మంతెన శివరామరాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 9 నెలలపాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 20-5-1930 నుండి రాజమండ్రి, కోయంబత్తూరు, ఆలీపురం సెంట్రల్ జైళ్ళలో అనుభవించారు. నండూరి శివరామయ్యా (బాపట్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. తూములూరి శివరామయ్య (పొన్నూరు):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన 4-6-1930 నుండి ఏడాదిపాటు శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన 24-2-1932 నుండి 21 నెలలపాటు, మరలా క్విట్ ఇండియాలో పాల్గొనడం వలన 1942లోనూ జైలు శిక్ష అనుభవించారు. రాజమండ్రి, కన్ననూరు మరియు నెల్లూరు జైళ్ళలో వీరు ఈ శిక్షను అనుభవించారు. యడ్ల పాటి శివరామయ్య అలియాస్ శివాజి (యాజలి): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన 26-2-1941 నుండి 9 నెలలపాటు వీరికి జైలు శిక్ష విధించబడింది.వీరు ఈ శిక్షను రాజమండ్రి మరియు అలీపురంజైళ్ళలో అనుభవించారు. ధూళిపూడి నాగేశ్వరరావు : స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.ఇండియన్ ఆర్మీలో చేసి పదవీ విరమణ పొందారు. కప్పగంతుల శ్రీరామమూర్తి (బాపట్ల):శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన వీరికి బ్రిటిష్ ప్రభుత్వం 9 నెలలపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 14-8-1930 నుండి 11-3-1931 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు.ఐనప్పటికీ ఇదే ఉద్యమంలో మరోమారు పాల్గొన్నారు. అంతేకాకుండా సత్యాగ్రహంలో పాల్గొని 22-4-1940 నుండి 9 నెలలపాటు మరోమారు కారాగార శిక్ష అనుభవించారు.క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 10-9-1942 నుండి 18 నెలలపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షలను రాజమండ్రి వెల్లూరు ఆలీపురం జైళ్ళలో అనుభవించారు.
అన్నం రాజు శ్రీరాములు (గోపాలపురం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నేతి శ్రీరాములు అలియాస్ శ్రీరామనాధం (నండూరు): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని 4-3-1931 నుండి 6 నెలలపాటు కఠిన కారాగార శిక్షకు గురైనాగాంధి-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా 11-3-1931లోనే విడుదలయ్యారు. పసుపులేటి శ్రీరాములు (పూండ్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ మునసబు పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. దంతులూరి సుబ్బమ్మ (మంతెనవారిపాలెం): శాసనోల్లంఘనోద్యమంలో పికెటింగ్ చేస్తుండగా వీరిని అరెస్ట్ చేసి బలవంతంగా గ్రామ పొలిమేరలకు తీసుకెళ్ళి బహిష్కరణ శిక్ష విధించారు. భేతాళం సుబ్బరాజు (ఖాజీపాలెం) ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 24-5-1930 నుండి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. రాజమండ్రి మరియు బళ్ళారి జైళ్ళలో వీరు శిక్షను అనుభవించారు. మంతెన సుబ్బరాజు (బుద్దాం):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు కూడా 11-5-1930 నుండి ఏడాదిపాటు కారాగార శిక్షకు గురియ్యారు. రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో వీరు ఈ శిక్షను అనుభవించారు. మంతెన సుబ్బరాజు (మంతెనవారిపాలెం)ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు కూడా 18-5-1930 నుండి 9 నెలలపాటు కారాగార శిక్షకు గురయ్యారు. రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో వీరు శిక్షను అనుభవించారు. అలపర్తి సుబ్బారావు (పొన్నూరు): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని వీరు కూడా 5-7-1930 నుండి 6 నెలలపాటు కారాగార శిక్షకు గురియ్యారు. రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో వీరు శిక్షను అనుభవించారు. 1932లో కూడా మరోమారు ఇదే ఉద్యమంలో పాల్గొని 6 నెలలపాటు శిక్షకు గురయ్యారు. పాకల సుబ్బారావు (పొన్నూరు):1930లో అతి చిన్న వయసులో వీరు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని వీరుబ్రిటిష్ పోలీసుల కొరడా దెబ్బలను శిక్షగా అనుభవించారు. అంతేకాకుండా 2 సం||ల కఠిన కారాగార శిక్షకు గురయ్యారు.చెంగల్ పట్ లోని బాల నేరస్తుల కారాగారంలో వీరు ఈ శిక్షను మార్చి 1931 దాకా అనుభవించారు.అనంతరం 1932లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరో 6 నెలలపాటు కఠిన కారాగార శిక్షకు గురయ్యారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని మరోమారు జైలు శిక్షకు గురై, బ్రిటిష్ వాడికి తన గుండె నిబ్బరాన్ని చాటారు. దొంతినేని సుబ్బయ్య (బోడిపాలెం): సహాయ నిరాకరభోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ మునసబు పదవికి 1921లో రాజనామా చేసి స్వారంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. కొల్లి సుబ్బయ్య (నిడుబ్రోలు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి బ్రిటిష్ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు కఠినకారాగారశిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. పూట్ల సుబ్బయ్య (పొన్నూరు): వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 10-12-1940 నుంది 6 నెలలపాటు కఠిన కారాగార శిషకు గురయ్యారు. నెళ్ళూరు మరియు తిరుచురాపల్లి జైళ్ళలో వీరు ఈ శిక్షను అనుభవించారు. సందెపూడి సుబ్బయ్య(మర్రిపూడి) : శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని రాజమండ్రి మరియు కన్ననూరు జైళ్ళలో 14-8-1930 నుండి 8 నెలలపాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. కూసంపూడి సుందర రామరాజు (ఖాజీపాలెం): సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి మరియు తిరుచురాపల్లి జైళ్ళలో 18-5-1930 నుండి 9 నెలలపాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. సుందరరాయుడు (కర్లపాలెం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. కూచిభొట్ల సూర్యనారాయణ (బాపట్ల): 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 2 వారాల కఠిన కారాగార శిష విధంచారు. భట్టి ప్రోలు సూర్యప్రకాశరావు (బాపట్ల): ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి బ్రిటిష్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఘనత వీరిది. సహాయ నిరాకరణోఅద్యమంలో పాల్గొని 18-11-1921 నుండి 2 సం|| ల 1 నెలపాటు కఠిన కారాగార శిక్షకు గురియ్యారు. వీరు ఈ శిక్షకు రాజమండ్రి, మద్రాసు, కడలూరు, మరియు కోయంబత్తూరులలో అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక చీరాల-పేరాల ఉద్యమంలో పాల్గొన్నారు. 1923లో నాగపూర్ జండా సత్యగ్రహంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 3-5-1930 నుండి 2 సం||లపాటు ఖఠిన కారాగార శిక్షకు గురయ్యారు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం వల్ల 12-3-1931న విడుదలయ్యారు. ఆగ్రహారంలోని వీరి స్వగృహంలో నీరు ఎన్నో రహస్య సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాలకు టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి వంటి ఎందరో ఉద్యమకారులు పాల్గొనేవారు. వీరు అజ్ఞాతంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వీరిగృహంపై పలుమార్లు దాడులు నిర్వహించింది. వీరి ఇంట్లోని వస్తువులను బయటకి విసిరిగొట్టి వీరీఅచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అజ్ఞాతంలో ఉండగా వీరు రాజాజీ సలహాతో కాశీకి వెళ్ళారు. అక్కడినుంచి వచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని ఆగ్రహారం శివాలయంలో ప్రతిష్ఠించారు. ప్రముఖ కవి గుర్రం జాషువా వీరిని స్వగృహంలో తరచు కలుస్తుండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం వీరికి తామ్ర పత్రాన్నిచ్చి గౌరవించింది. వేగేశిన తమ్మిరాజు (మంతెనవారిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన 22-6-1932 నుండి ఏడున్నర నెలలు కారాగార శిక్షకు గురయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో వీరు ఈ శిక్షను అనుభవించారు. మంతెన తాతం రాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 18-5-1930 నుండి 18 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. కొసరాజు తాతయ్య (నిడుబ్రోలు): శాసనోల్లంఘనలో పాల్గొని 8-2-1932 నుండి ఏడాదిపాటు రాజమండ్రి మరియు తిరుచురాపల్లి జైళ్ళలో శిక్ష అనుభవించారు. తాండవకృష్ణయ్య (పూండ్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. వేదాంతం వాసుదేవరావు (బాపట్ల): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 10-9-1942 నుండి 18 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులో కఠిన కారాగార శిఖ అనుభవించారు. వీరికి 200రు. జరిమానా కూడా విధించబడింది. కొత్త వెంకటాచలపతిరావు (ఇటికంపాడు) : న్యాయవాద విద్య చదువుతుండగా గాంధీజీ పిలుపు మేరకు విద్యకు స్వస్తిచెప్పి స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 27-4-1930 నుండి ఏడాదిపాటు రాజమండ్రి, మద్రాసు మరియు వెల్లూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. మాచిరాజు వెంకట అప్పారావు (చందోలు): సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం వలన 7-2-1922 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు.అనంతరం శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 12-8-1930 నుండి 6నెలలపాటు రాజమండ్రి మరియు అలీపురం జైళ్ళలో శిక్ష అనుభవించారు. కుమ్మమూరు వెంకటప్పయ్య (బాపట్ల): క్విట్ ఇందియా ఉద్యమంలో పాల్గొన్న వీరు 5-3-1943 నుండి 6 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మాచిరాజు వెంకటప్పయ్య (పిట్టలవానిపాలెం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గోగినేని వెంకటప్పయ్య చౌదరి (నిడుబ్రోలు): వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 22-4-1941 నుండి 2 నెలలపాటు బళ్ళారిలో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మంతెన వెంకట రాధాకృష్ణం రాజు (మర్రిపూడి): పదవ తరగతి చదువుతుండగానే వీరు జాతీయోద్యమంపట్ల ఆకర్షితులై చదువుకు స్వస్తిచెప్పి ఉద్యమంలోకి దూకారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అజ్ఞాతంలోకి వెళ్ళారు. రెందవ ప్రపంచ యుద్దం సమయంలో (1943-44) ఇండియన్ నేవీలో ఉద్యోగంలో చేరారు. 1947-48లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు.గొట్టుముక్కల వెంకటరాజు (బుద్దాం): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 12-5-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షకు గురయ్యారు. కనుమూరి వెంకటరాజు (మంతెనవారిపాలెం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 22-5-1930 నుండి 1 సం||పాటు రాజమండ్రి, వెల్లూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని25-1-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు బళ్ళారి జైళ్ళలో కఠిన కారాగార సిక్ష అనుభవించారు. కొత్తపల్లి వెంకటరాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 20-5-1930 నుండి 9 నెలలపాటు రాజమండ్రి, కోయంబత్తూరు మరియు అలీపూం జైళ్ళలో శిక్ష అనుభవించారు. కొత్తపల్లి వెంకటరాజు (కర్లపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు 22-5-1930 నుండి 9 నెలలపాటు రాజమండ్రి, సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. మంతెన వెంకటరాజు (ఖాజీపాలెం):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి, కోయంబత్తూరు మరియు అలీపూం జైళ్ళలో శిక్ష అనుభవించారు. మంతెన వెంకటరాజు మంతెనవారిపాలెం): 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని రెండు సార్లు అరెస్ట్ కాబడ్డారు. మంతెన వెంకటరాజు (మంతెనవారిపాలెం):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు 27-6-1930 నుండి 5 నెలలపాటు రాజమండ్రి, తురుచురాపల్లి మరియు అలీపురం జైళ్ళలో శిక్ష అనుభవించారు. మంతెన వెంకట రాధా కృష్ణం రాజు తదితర దేశభక్తులు 1945 జనవరి 25 రాత్రి మునిసిపల్ హై స్కూల్ భవనం (ప్రస్తుత వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ కార్యలయం) మీద బ్రిటీష్ జండాను తొలగించి, మువ్వన్నెల జండాను ఎగురవేసారు. మరుసటి రోజు ఉదయం ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎగురుతున్న ఆ జండాను ఎంతో ఉద్వేగంతో తిలకించారు. ఈ దేశభక్తులు నాడు మునిసిపల్ హై స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న 16 సం||లలోపు విద్యార్ధులు కావడం విశేషం. ఓగిరాల వెంకటరామదీక్షితులు (నండూరు) : సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 7-2-1922 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు.ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనిమరో 18 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. మంతెన వెంకటరామారాజు (మంతెనవారిపాలెం):.ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటం వలన 185-1930 నుండి 9 నెలలపాటు కోరాపుట్ మరియు రాజమండ్రి జైళ్ళలో శిక్ష అనుభవించారు. సెనగల వెంకటరామయ్య(నరసాయపలెం): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన 25-8-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. తోలు వెంకటరామయ్య (బాపట్ల): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 5-7-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. అన్నం రాజు వెంకటరావు(నండూరు):శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన 23-1-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. మంత్రవాది వెంకటరత్నం(గుడిపూడి):శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన 6-8-1930 నుండి 14-3-1931 వరకు రాజమండ్రి మరియు అలీపురం జైలులో శిక్ష అనుభవించారు. వెంకటరత్నం తూనుగుంట (బాపట్ల): సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు వీరు తన గ్రామ మునసబు పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. బెండూరి వెంకటసాంబశివరావు (పొన్నూరు):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 13-5-1930 నుండి 2 సం||అపాతు వెల్లూరు మరియు కన్ననూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. చెరుకూరి వెంకటశేషయ్య (బాపట్ల): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 7-5-1930నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. కనుమూరి వెంకటసుబ్బరాజు (పిట్టలవానిపాలెం): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన వీరికి ప్రభుత్వం 1930-32 లో రెండుసార్లు అరెస్ట్ చెసింది. గంగరాజు వెంకటసుబ్బరాజు (కొమ్మూరు): గ్రామ కరణంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తన పావికి 15-1-1922న రాజీనామా చేశారు. పొన్నూరు వెంకట సుబ్బారావు (పొన్నూరు): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 13-5-1930 నుండి వెల్లూరు, మద్రాసు మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. ఓగేటి వెంకట సుబ్బరాయ శాస్త్రి (యాజలి): సహాయ నిరాకరణ పాల్గొన్నందువల్ల ప్రభుత్వం 16-3-1922 నుండి 1 సంవత్సరం పాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. జాలాది వెంకటేశ్వర్లు (బాపట్ల): సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 29-1-1941 నుండి 4 నెలలపాటు వీరు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. కంకిపాటి వెంకటేశ్వర్లు (జమ్ములపాలెం):సత్యాగ్రహంలోను క్విట్ ఇండియా ఉద్యమంలోనూ వీరు 31-1-1941 నుండి 3 నెలలపాటు వీరు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు.
పావన వెంకటేశ్వర్లు (పొన్నూరు): క్విట్ ఇందియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. వక్కలగడ్డ వెంకటేశ్వర్లు (గునుపూడి): శాసనోల్లంఘనలో పాల్గొని 3-10-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు. వారణాసి వీరరాఘవస్వామి (పొన్నూరు): సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందువల్ల వీరు 23-3-1922న అరెస్ట్ చేయబడ్డారు. సంఘం వీరరాఘవయ్య (బ్రాహ్మణకోడూరు): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందువల్ల 23-9-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో శిక్షను అనుభవించారు. తోట వీరాస్వామి (బాపట్ల):శాసనోల్లంఘనలో పాల్గొని 3-2-1931నుండి 4 నెలలపాటు రాజమండ్రి జైలులో శిక్షను అనుభవించారు. అల్లం వీరయ్య (పొన్నూరు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో ప్రభుత్వం వీరికి మూడున్నర సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. వెలగతోట వీరయ్య (పెదనందిపాడు): 1921-22 సత్యాగ్రహానికి మద్దతుగా తాను చేస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి వీరు రాజీనామా చేశారు. మల్లాది యజ్ఞనారాయణ శర్మ (బాపట్ల): భారత రాష్ట్రపతిగా చేసిన వి.వి.గిరికి వీరు అత్యంత ప్రియ శిష్యులు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడంతో ప్రభుత్వం వీరికి 1 సంవత్సరంపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 18-5-1930 నుండి రాజమండ్రి,తిరుచురాపల్లి, కడలూరు, మద్రాసు. బళ్ళారి, జైళ్ళలో అనుభవించారు. జైలు నుంచి విడుదలైన వెంటనే శాసనోల్లంఘనలో పాల్గొని 6-1-1932 నుంచి మరో 6 నెలలపాటు శిక్షకు గురయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వీరు పాల్గొని 23-11-1942 నుండి 13-12-1944 వరకు వెల్లూరు మరియు తంజావూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. తుపాకుల యెల్లయ్య (పెదనందిపాడు) : సత్యాగ్రహంలో భాగంగా వీరు 1921-22లో తన గ్రామాధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కన్నేటి వెంకట్రావు : పలు ఉద్యమాల్లో పాల్గొని నాటి యువతకు స్పూర్తిదాయకులయ్యారు. మద్దులూరి రామకృష్ణ : పసితనుండే స్వతంత్ర భావాలు అలవరుచుకొన్నవీరు 8ఏళ్ళ లేత వయసులో స్వతంత్ర భావాలను తన తోటి బాలలతో పంచుకునేవారు.తన ఇంటి వరండాలోని మహాత్మాగాంధీ చిత్రపటాన్ని చూస్తూ రోజూ ఉత్తేజం పొందుతుండేవారు.ఐతే ఆ ఫోను చూసిన అనాటి తాసిల్దార్ దానిని తొలగించవలసిందిగా రామకృష్ణను అదేశించడంతో బాలుదైన రామకృష్ణ అందుకు తిరస్కరించారు.పలితంగా ఆ లేత హరిజన్ వెల్ఫేర్ పండ్ కోసం కొంత ధనాన్ని ఆయనకు ఇచ్చారు.చదువుకు మధ్యలో తాత్కాలికంగా స్వస్తి చెప్పి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా 4నేలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వీరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా అజ్ఞాతంలోకి వెళ్ళి, రహస్యంగా "స్వతంత్ర భారతి" అనే పత్రికను ప్రచురించి ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. గుడివాడ రామచంద్రరావు : తన సహచరులతో కలసి గాంధీగారి ఆశయాలను అక్షరాలా నెరవేర్చిన వ్యక్తి వీరు. పోరాడితేనే తప్ప స్వాతంత్ర్యాన్ని సముపార్జించలేమని చాటుతూ గాంధీ గారి పోరాట స్పూర్తిని పుణికిపుచ్చుకుని స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్నారు. కొమ్మినేని వెంకటేశ్వరరావు : వీరు ప్రాధమిక విద్యతోనే చదువుకు స్వస్తి చెప్పి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా టెలిఫోన్ తీగలు ధ్వంసం చేసి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. 1962లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బాపట్ల శాసనసభ్యునిగా గెలుపొందారు. మహత్మాగాంధి - వరలక్షమ్మ: ఆది 1921వ సంవత్సరం. స్వరాజ్య నిధికోసం బాపూజీ ఆంధ్ర దేశంలో పత్యటిస్తూ బందరులో బస చేశారు. ఆ సమయంలో అదే ఊరిలో బస చేశారు. ఆ సమయంలో అదే ఊరిలో ఉన్న ప్రముఖ రచయిత్రి, సంఘసంస్కర్త, శ్రీమతి కనుపర్తివరలక్షమ్మ తాను స్వయంగా వడికిన నూలును,ఒక ఉంగరాన్ని బాపూజీకి సమర్పించారు.అది స్వీకరించిన బాపూజీ ఆమెతో 'రోజూ నూలు వడుకుతున్నావా?'అనడిగారు. ఆమె ఆవునని చెప్పారు. 'ఐతే ఈ రోజునుంచి ఖద్దరు కట్టుకుంటావా' అని ఆమెను తిరిగి ప్రశ్నించారు. దానికి ఆమేకట్టుకుంటానూ అని సమాధానం చెప్పారు.ఆనాటినుంచి ఆమె అఖరి క్షణం వరకు బాపూజీకిచ్చిన మాటకు కట్టుబడి ఖద్దరు వస్తాలనే ధరించారు. పల్లపోతు శ్రీనివాసరావు (బాపట్ల): స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ప్రతి పోరాటంలోను వీరు పాల్గొన్నారు. అనేకమార్లు జైలు శిక్ష అనుభవించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత ప్రభుత్వం వీరికి తామ్ర పత్రాన్ని బహుకరించి సత్కరించింది.వీరేకాక అంకరాజు భుజంగరావు, అంకరాజు పద్మావతి, నాళం బాలకృష్ణ, ఊటుకూరి హయగ్రీవ గుప్త, వేముల వెంకట సుబ్బారావు, వెంకటరత్నం, సాక్షి సోమయాజులు, కళ్ళపూడి సుబ్బారావు అచంట రంగ నాయకులు, మాధవపెద్ది కాళిదాసు, కప్పగంతుల రామ్మూర్తి, అశ్వఖుల్లా ఖాన్, ఇంకా చరిత్రకందని అనేకమంది సమర వీరులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తమ ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేశారు. మహిళా మూర్తుల్లో పాటిబండ్ల కోటమ్మ, వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ, కనుమర్తి వరలక్ష్మమ్మ, సుబ్బమ్మ వంటి అనేక మంది వీర వనితలు కూడా ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఉద్యమంలో పాల్గొని బాపట్లకు స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో స్దానం కల్పించి చిరస్మరణీయులైనారు.స్వాతంత్ర్య సమరోద్యమం:
1857 మే 10న మీరట్ లో జరిగిన సిపాయిల తిరుగుబాటు మాతృదేశం గురించి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. మన తరపున ఎవరో ఒకరు పోరాడుతున్నారులే అనే అశ్రద్ధ భావనను ప్రజలనుండి దూరం చేసింది.ప్రధానంగా సిపాయిలే ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పటికీ, ప్రప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా చరిత్రలో నిలిచిపోయింది.ఈస్ట్ ఇండియ కంపెనీ పరిపాలన వల్ల విసిగివేసారిపోయిన ప్రజల అసహనం ఈ తిరుగుబాటు ద్వారా దేశంలో పలుచోట్ల ప్రజలను చైతన్యవంతులను చేసింది.ఆ చైతన్యం అంతటితో ఆగక పలు నిరసనల రూపంలో వెల్లువెత్తుతూ 1915లో గాంధి దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగివచ్చి,దీనికి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాక ఓ సంపూర్ణ స్వరూపాన్ని సంతరించుకుంది.అప్పటివరకు దిశానిర్దేశం లేకుండా సాగుతున్న ఉద్యమం గంధీజీ ప్రవేశపెట్టిన సత్యాగ్రహంతో ఓ పరిపూర్ణమైన రూపాన్ని సంతరించుకుంది. సత్యం, అహింసలే ప్రధాన ఆయుధాలైన సత్యాగ్రహం భారత జాతి యావత్తునూ అత్యంత వేగంగా ఆకర్షించింది. ఆ ఆకర్షణలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాపట్ల.
చారిత్రక సాక్షాలకు సజీవంగా నిలిచిన ప్రసిద్ధ దేవాలయాలతో అలరారుతున్న భావపురి, విద్యారంగంలో కేంబ్రిడ్జి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సాహిత్యరంగంలో భావ సౌందర్యాల విరిగా, రాజకీయ రంగంలో ఆణిముత్యాలను అందించిన గడ్డగా, బౌద్ధా రామాలకు నిలయంగా, వ్యవసాయరంగానికి పట్టుకొమ్మగా విరాజిల్లుతున్న బాపట్ల, రాష్ట్ర చిత్రపటంలోనే గాకుండా, దేశ చిత్రపటంలోనే ఒక ప్రత్యక స్ధానాన్ని సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో, భుస్వామ్య వ్యతిరేక ప్రజా తంత్ర ఉద్యమానికి శుభారంభం చేసిన గడ్డ భావపురి . ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావలనే నినాదాన్ని మొట్ట మొదట బాపట్లలో 1913 లో జరిగిన ఆంధ్రమహాసభ లేవనెత్తింది. బాపట్లలో 1944 పొగాకు రైతు మార్కెట్ కమిటీ ఎన్నికల్లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కొల్లా వెంకయ్య గెలిచారు. 1946 శాసన సభ ఎన్నికల సందర్భంలో విశాలంధ్ర లో ప్రజారాజ్యం అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని కమ్యూనిస్టు పార్టీ తీసుకుంది. అలాగే కమ్యూనిస్టు నాయకులను బాపట్ల ప్రాంతాలలో ఉంచి వారి బాధ్యత తీసుకున్నరు. కామ్రెడ్ చండ్ర రాజేశ్వరరావు, దాసరి నాగభుషణ రావు తదితరులు ఈప్రాంతములో ఉండి వుద్యమాన్ని నడిపారు. 1977 లో నల్లమడ రైతు సంఘం స్ధాపించి దానినిర్వహణకు కౄషిచేసిన ఘనత కమ్యూనిస్టులదే. ఈప్రాంతంలో ఈరోజు కల్వలు వచ్చి సమయానికి సగునీరు అందుతుంది. చెయెత్తి జై కొట్టు తెలుగోడా అన్న వేములపల్లి శ్రీ క్రిష్ణను శాసన సభకు మొదితిసారిగా అందించిన ఘనత భావపురిదే. అపర భాసరగా ఖ్యాతిచెంది కళారంగంలో సారన్వత మాగాణిగా నిలిచింది. శ్రీ భావనారాయణ స్వామి స్వయంభువునిగా వెలయడంవల్ల భావపురిగా నామాన్ని సంతరించుకొని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విద్యాకేంద్రంగా నేడు బాపట్ల పట్టణం వెలసిల్లుతున్నది. స్వయంభువునిగా వెలసిన శ్రీ భావనరాయన స్వామి వారికి క్రిమి చొళ మహారాజు క్రీ. శ. 594 లో ఆలయం కట్టించారు. క్రీ.శ. 594 నుండి క్రీ.శ. 1574 వరకు హిందూరాజులు పాలించగా చైతన్య కేంద్రంగా విలసిల్లింది. క్రీ.శ. 1760 నుండి ఈస్ట్ ఇందియా కంపెనీ అధికారాన్ని బాపట్ల ప్రాంతం పై చెలాయించింది. కాగా క్రీ.శ. 1803 లో అమరావతికి చెందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ బాపట్ల ప్రాంతాన్ని బహిరంగ వేలం లో కొనుగొలు చేసాడు. స్వాతంత్ర సంగ్రామంలో బాపట్ల ప్రాంతం గణనీయ పాత్ర నిర్వహించింది. పూర్వపు తాలూకాలో ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య పన్నుల నిరాకరణోద్యమం నడిపిన సంగతి అందరికి విదితమే. 1920 లో సహాయ నిరాకరణోద్యమం జరుగగా బాపట్ల తాలూకాలోన్ 64 గ్రామాలలో సఘాలను ఏర్పరచి ఉద్యమాలను నడిపారు. కొందరు రెవెన్యూ ఇనిస్పెక్టర్లు, గుమస్తాలు తమ ఉద్యోగాల కు స్వస్థి చెప్పి న్యాయవాదులతోపాటు ఉద్యమంలో చేరారు. మహాత్మా గాంధీజి బాపట్ల ప్రాంత పర్యటనకు రాగా తిలక్ స్వరాజ్య నిధికి నగదుతో పాటు బంగారు ఆభరణాలను దేశభక్తులు సమర్పించారు. శహయనిరాకరణోజ్యమంలో పాల్గొన్నందున ఆంధ్ర రత్న దుగ్గిరాలతో పాటు మంతెన క్రిష్ణం రాజు, బూదరాజు లక్ష్మీనారాయణ, బూదరాజు లక్ష్మీనరసిం హా రావు, పిల్లుట్ట్ల హనుమంత రావు, అడుసుమల్లి శ్రీనివాస రావు పంతులు వంటివారు జైలు పాలయినారు. ఉద్యమంలో భాగంగా 1921 డిసెంబర్ 31 న 48 మంది గ్రామోద్యొగులు రాజీనామాలు సమర్పించారు. పన్నుల నిరాకరణోద్యమంలో భాగంగా నాటి బాపట్ల తాలూకాలోని పెదనందిపాడు ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి జిల్లా కలెక్టర్ రూదర్ ఫర్డ్ మిలిటరీ క్యాంపును ఏర్పాటుచేశారు. సంకా సీతారామయ్య, దాసరి స్రీరాములులను పెదనందిపాడు నుంచి చిలకలూరిపెట వరకు 8 మైళ్ళు గుర్రం వెంట శిక్షగా పరుగెత్తించారు. 1930 లో సాగిన ఉద్యమంలో పాల్గొన్నందుకు బాపట్ల తాలూకాలోని 124 మందిని నాటి ప్రభుత్వం జైలుకు పంపింది. విదేశీ వస్తు బహిస్కరణలలో పాలుగొన్నందుకు 44 మందిని 6 నెలలనుండి 2 సొంవత్సరాలవరకు శిక్ష విధిస్తూ జైలుకు పంపింది. స్ధానం పార్ధసారధి, నాళం శ్రీరామచంద్ర రావు, రావూరి శ్రీసైలపతి వంటి వారు స్వాతంత్ర ఉద్యమంలో పాలుగొన్నారు.
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ప్రధమ ఆంధ్ర మహాసభ 1913 లో బాపట్ల టౌన్ హాలులో జరిగింది. రెండుసార్లు గాంధీజి బాపట్ల ప్రాంతాన్ని సందర్శించారు. 1934 లో భారత తొలి రాష్ట్రపతిగా పేరుగడించిన బాబూ రజేంద్ర ప్రసాద్ సందర్సించ్హరు, 1936 లో పెను తుఫాను సంభవించగా బాధితుల సహాయార్ధం విరాళాల సేకరణకు గాంధీజి తమ రెండవ పర్యటనకు వచ్చారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, జయప్రకాష్ నారాయణ, రాజాజీ, వంటి ప్రముఖులు కూడా బాపట్ల ప్రాంతాన్ని సందర్శించినవారిలో వున్నరు.
1913 లో బయ్యా నరసిం హశర్మ అధ్యక్షతన ప్రధమ ఆంధ్ర మహాసభను నిర్వహించడం ద్వారా ఒక చారిత్రక ఉద్యమానికి శ్రీ కారం చుట్టిన బాపట్ల స్వాతంత్ర్య సమరంలో అనేక ఉద్యమాలను కేంద్రస్ధానమయ్యింది. 1929 లో జాతీయ కాంగ్రెస్ సమావేశం బాపట్లలో దేశభక్త కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగింది. శ్రీ యుతులు రావూరి శ్రీశైలపతి, గౌస్ బేగ్, నబీ సాహెబ్, మంతెన వెంకటరాజు, ఆచార్య రంగా, భట్టిప్రోలు సూర్యప్రకాశరావు, స్ధానం పార్ధసారధి, బొడ్డుపల్లి వెంకటప్పయ్య, వి.ఎల్. సుందర రావు, మహమ్మద్ హనీఫ్, మద్దులూరి రామకృష్నా రావు లాంటి నాయకులు వెదేశీ వస్త్ర బహిస్కరణలో ప్రముఖ పాత్ర వహించారు. 1934 లో జవహర్ లాల్ నెహృ బాపట్లలో బహిరంగసభలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 1942 ఆగస్టు 12 న నాళం రామచంద్ర రావు గారి నాయకత్వంలో రైల్వే స్టేషంపై దాడి చేసి, టెలిగ్రాఫ్ స్తంభాలను పగులగొట్టి, టెలిఫొన్ సౌకర్యాలకు ఆటంకం కల్గించారు. తిలక్ స్వరాజ్య నిధికి బాపట్లలో రూ. 7,272/- లు సేకరించ బడ్డాయి. ఆ ఉద్యమంలో పాల్గొని ఉపన్యాసాలు చేసిన ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గ్రంధి నాగేశ్వరరావు, పాతురి అప్పయ్య శాస్త్రి, మంతెన కృష్ణం రాజు, భట్టిప్రోలు సూర్యప్రకాశరావు, పిల్లుట్ల హనుమంతరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, డా. ఎం. మల్లికార్జునుడు, డా. మెండ్లూరి సాంబశివరావు, కోటం రాజు సత్యనారాయణ శర్మ తదితరులకు ప్రభుత్వం జైలు శిక్ష విధించింది.
బోడ్డపాటి కృష్ణమూర్తి( బాపట్ల) : శాసనోల్లంఘనలో పాల్గొని 25-6-1932 నుంచి 24-12-1932 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో 6 నెలలపాటు శిక్ష అనుభవించారు. ఆధారపు కృష్ణారావు : (పొన్నూరు) 1930 లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడంతో అరెస్ట్ కాబడ్డారు. శాసనోల్లంఘన ఉద్యమంలో లాఠీ చార్జికి గురుయ్యారు. 1942లో క్విట్ ఇందియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ కాబడ్డారు. కంభంపాటి కుమారస్వామి (మర్రిపూడి) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 14-8-1930 నుంచి ఏడాదిపాటు కారాగారశిక్ష విధించబడింది. ఐతే వీరు శిక్ష అనుభవిస్తూనే రాజమండ్రి సెంట్రల్ జైలో 11-11-1930న మరణించారు. తూము లక్ష్మీకాంతరావు (కట్టెంపూడి) : వీరు శాసనోల్లఘనోద్యమంలో పాల్గొనడం వలన 9-5-1930 నుండి 9 నెలలపాటు కారాగార శిక్ష విధించబడింది. వీరి శిక్షను రాజమండ్రి మరియు వీరు శిక్షను రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో అనుభవించారు. మాధవపెద్ది లక్ష్మీనారాయణ (బ్రాహ్మణకోడూరు) : వీరు కూడా శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన 17-7-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి, వెల్లూరు జైళ్ళలో కారాగార శిక్ష అనుభవించారు. గ్రామ కరణంగా పనిచేస్తున్న వీరు 1921లో సహయ నిరాకరన ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అన్నమ్రాజు లక్ష్మీనరసిం హరావు (బోడిపాలెం): గ్రామ కరణంగా పనిచేస్తున్న వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నండూరి లక్ష్మీనరసిం హరావు (బాపట్ల) కరణంగా పనిచేస్తున్న వీరు 1921లో సహాయ నిరాకరన ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చుతుగా పాల్గొన్నారు. లక్ష్మీనారాయన(పూడ్ల) : గ్రామ సహాయ కరణంగా పనిచేస్తున్న వీరు కూడా 1921లో సహయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చురుగా పాల్గొన్నారు. గోగినేని లక్ష్మీనారాయణ (నిడుబ్రోలు) : 1932లో కిసాన్ ఉద్యమంలో పాల్గొన్నారు. ద్వితీయ ప్రపంచం సంగ్రామ వ్యతిరేకోద్యమంలో పాల్గొనడం వలన 5-3-1940 నుంచి ఏడాది పాటు దారరాగార శిక్షకు గురయ్యారు. పి. లోకనాధం (పొన్నూరు) : సత్యాగ్రహోద్యమంలో పాల్గొనడం వలన 15-1-1940 నుంచి ఏడాది పాటు రాజమండ్రి, వెల్లూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. మంచాల మల్లయ్య (బాపట్ల): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన వీరు 7-5-1930 నుండి 6 నెలల పాటు రాజమండ్రి, మరియు మద్రాస్ సెంట్రల్ జైళ్ళలో శిక్షను అనుభవించారు. ముప్పలనేని మాణిక్యరావు(బాపట్ల) : సత్యాగ్రహోద్యమంలో పాల్గొనటం వలన వీరికి 6 నెలల కారాగార శిక్షమరియు 200 రు.జరిమానా విధించబడినది. కొత్తగుండు ముత్తయ్య (అల్లూరు): 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనటం వలన విజయవాడ సబ్ జైలులో కారాగార శిక్ష అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటం వలన వీరికి 24-5-1930 నుండి ఏడాదిపాటు కారాగార శిక్ష విధించబడింది. వీరి శిక్షను రాజమండ్రి, కోయంబత్తూరు మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. గాంధి-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా వీరు 13-3-1931 న జైలునుండి విడుదల కాబడ్డారు. గోరంట్ల నాగభూషణం (నరసాయపాలెం) : సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 50రు. జరిమానా మరియు 28-1-1941 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో 3 నెలలపాటు శిక్ష విధించబడింది. గోకరాజు నాగరాజు (పిట్టలవానిపాలెం) : శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన 1930-32ల మధ్య 2సార్లు అరెస్ట్ అయ్యారు. పత్తిపాటి నాగరాజు (ఖాజీపాలెం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటం వలన 20-5-1930 నుంచి 9 నెలలపాటు రాజమండ్రి మరియు కోరాపుట్ జిల్లాల్లో కారాగార శిక్షను అనుభవించారు. తెలగ నాగరత్నమ్మ (బాపట్ల) : వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనటం వలన 1932లో వీరు అరెస్ట్ కాబడ్డారు. నాగయ్య (కర్లపాలెం) : గ్రామ మునసబైన వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితుడై తన పదవికి రాజనామా చేశారు. గంధం నాగేశ్వరరావు (పసులూరు) : సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వీరు తన కరణం పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. 11-3-1922 నుండి 28-2-1923 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. మంతెన నరసరాజు (బుద్దాం) : శాసనోల్లంఘనోదమంలో పాల్గొనడం వలన వీరికి 200రు. జరిమానా మరియు 23-5-1930 నుంచి 30-9-1930 వరకు జైలు శిక్ష విధించబడింది. వీరి శిక్షను రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. పెనుమత్స నరసరాజు (మంతెనవారిపాలెం) : శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనటం వలన బ్రిటిష్ ప్రభుత్వం వీరికి జైలు శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 2-7-1930 నుంది 14-3-1931 వరకు ఏడాదిపాటు రాజమండ్రి తిరుచునాపల్లి మరియు ఆలీపురం జైళ్ళలో అనుభవించారు. చెరుకూరి నరసిం హరాజు (ఖాజపాలెం) : విద్యార్ధి దశలో ఉండగా వీరు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 27-5-1932 నుంచి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. ముదునూరి నరసిం హరాజు (బుద్దాం) : శాసనోల్లంఘనలో పాల్గొని 12-5-1932 నుంచి 6నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. కోటం రాజు నరసిం హరావు (బాపట్ల) : 1932లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడంతో వీరు అరెస్ట్ కాబడ్డారు. పాటి బండ్ల పాపయ్యా (కాట్రపాడు) : కాట్రపాడు గ్రామ మనసబైన వీరు సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితుడై 15-1-1922న తన పదవికి రజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. దొంతినేని పరదేశి (గోపాలపురం) : గోపాలపురం గ్రామ మునసబైన వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉత్తేజితుడై తన పదవికి రజీనామా చేశారు. పుష్కరాంబ ముప్పలనేని (నిడుబ్రోలు): శాసనోల్లంఘనలో పాల్గొన వీరు 11-7-1932 నుంచి 6 నెలలపాటు కారాగార శిక్షకు గురయ్యారు. వీరు ఈ శిక్షను వెల్లూరు, కన్ననూరు జైళ్ళలో అనుభవించారు. టి.వి. రాఘువాచారి (వడ్డెములకల) : శాసనోల్లంఘనలో పాల్గొనటం వలన ప్రభుత్వ వీరికి 8-7-1930 నుండి రెండేళ్ళపాటు కథిన కారాగార శిక్ష విధంచింది.రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో శిక్షను అనుభవించిన వీరు గాంధీ-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా 12-3-1931లో విడుదలయ్యారు. వత్సవాయి రాఘువరాజు (బుద్దాం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి బ్రిటిష్ ప్రభుత్వం 100రు. జరిమానాతోపాటు ఏడాదిపాటు జైలు శిక్ష కూడా విధించింది. 24-5-1930 నుండి 14-3-1931 వరకు వీరు ఈ శిక్షను రాజమండ్రి మరియు తిరుచిరాపల్లి జైళ్ళలో అనుభవించి, గాంధి-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా విడుదలయ్యారు. దీవి రామచంద్రరావు (పొన్నూరు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం వీరికి 24-9-1942నుండి 3 సం|| లపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. నాళం రామచంద్రరావు (బాపట్ల): అచంచల దేశ భక్తి, నిబద్దత ఉన్న వారిలో నాళం రామచంద్రరావుగారు ముందు వరసలో ఉంటారు. జతీయోద్యమంలో వీరు నిర్వహించిన పాత్ర ఏనాటికీ మరువలేనిది. ప్రముఖ న్యయవాదైన వీరు బాపూజీ ఇచ్చిన వ్యక్తి సత్యగ్రహం పిలుపుకి స్పందించారు. బాపట్ల సబ్ కోర్టులోనికి ప్రవేశించి జార్జి చిత్రపటాన్ని ద్వంసం చేశారు. ఆవెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో చొరబడి అక్కడి రికార్డులన్నీ తగులబెట్టి అజ్ఞాతంలోని కి వెళ్ళిపోయారు. పోలీసులు ఆయనకోసం ఊరంతా గాలించారు. ఊరి ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం బాపట్లలో మార్షల్ లా ప్రకటించింది. అనుమానమొచ్చిన అనేకమంది సానుభూతిపరుల ఇళ్ళను గాలించింది. అందులో ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారి ఇల్లు కూడా ఒకటి. అలా పారిపోయిన నాళం రామచంద్రరావు గారికి రాజమండ్రిలో ప్రముఖ కవి నాళం కృష్ణారావు గారు ఆశ్రయమిచ్చారు. కొన్నాళ్ళకు ఆయన అరెస్ట్ కాబడి ఒంగోలు జైలుకు తరలించబడ్డారు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యయానికి నాయకత్వం వహించినందుకు వీరికి బ్రిటిష్ ప్రభుత్వం 500 రు. జరిమానాతోపాటు 2 సం||లపాటు కారాగార శిక్ష విధించింది. 25-11-1943 నుండి వీరు ఈ శిక్షను బళ్ళారి, మద్రాసు మరియు ఆలీపురం జైళ్ళలో అనుభవించారు. అంతేకాకుండా జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు వీరు న్యాయవాద వృత్తి చేపట్టకుండా ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. వీరగంధం రామచంద్రయ్య (కంకటపాలెం) : శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం వీరికి 5-4-1932 నుండి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. బండి రామదాసు (బాపట్ల) : గ్రామాధికారిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వీరు స్వాతంత్ర్యోద్యమంపట్ల ఆకర్షితులై సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తన ఉద్యోగానికి 1921లో రాజీనామా చేశారు. అన్నం రాజు రామకోటయ్య (జిల్లెళ్ళమూడి) : కరణంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు సహయ నిరాకరణోద్యమంలో భాగంగా తన పదవికి 1921లో రాజీనామా చేసి ఉద్యమంలో విశేషంగా పాల్గొన్నారు. మంతెన రామకృష్ణం రాజు (బుద్దాం): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం 20-5-1930 నుంచి నెల రోజులపాటు జైలు శిక్ష విధించింది. మద్దులూరి రామకృష్ణారావు (బాపట్ల) : వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడం వలన 28-1-1941 నుండి 4 నెలలఫాటు రాజమండ్రిసెంట్రల్ జైలులో కఠిన కారాగారవాసాన్ని అనుభవించారు. కాట్రపాడు కరణంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తన పదవికి 1921లో రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం ఏడాదిపాటు కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను వీరు రాజమండ్రి, తిరుచురాపల్లి మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. గాంధి-ఇర్విన్ ఒప్పందం ప్రకారం వీరు 14-3-1931న విడుదల కాబడ్డారు1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడంతో వీరిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది.శాసనోల్లంఘనలో పాల్గొనడంతో బ్రిటిష్ ప్రభుత్వం వీరికి అరెస్ట్ చేసింది. 6-6-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి, మధుర జైళ్ళలో వీరు కారాగార శిక్ష అనుభవించారు. కూసంపూడి రామరాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి ప్రభుతం కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 20-5-1930 నుండి 9 నెలలపాటు అనుభవించారు. మంతెన రామరాజు (పిట్టలవానిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కథిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 25-1-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. పెనుమత్స రామరాజు (పిట్టలవానిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి కూడా ప్రభుత్వం కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 16-6-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. మునివల్లి రామారావు (మునిపళ్ళె): శాసనోల్లంఘనలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కటిన కారాగార విధించింది. వీరు ఈ శిక్షను 17-6-1937 నుండి 1-8-1937 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. గొల్లమూడి రామస్వామి (బాపట్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి రాజనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు. మదమంచి రామస్వామి (వల్లభరావుపాలెం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921 లో తను చేస్తున్న గ్రామ మునసబు ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. మన్నవ రామేశ్వరరావు (మన్నవ): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 5-3-1943 6 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులోఅనుభవించారు. విశాఖపట్నంలో ఎం.బి.బి.యస్. విద్యనభ్యసిస్తుండగా వీరు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడంతో బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా వీరు 23-1-1941 నుండి 25-7-1941 వరకు వెల్లూరు మరియు రాజమండ్రి సెంట్రల్ జైళ్ళలో శిక్ష అనుభవించారు. గొట్టుముక్కల రంగనాయకులు (కాట్రపాడు):సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 15-1-1922లో తను చేస్తున్న గ్రామ మనసబు ఉద్యోగానికి రాజీనామ చేసి స్వాతంత్ర్ల్యోద్యమంలోని దూకారు. కంకిపాటి రంగరాజు (పిట్టలవానిపాలెం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 18-5-1930 నుండి 9 నెలలపాటు రాజమండ్రి, వెల్లూరు మరియు అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. మన్నవ రంగారావు (మన్నవ): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం కఠిన కారాగార శిక్షవిధింధింది. వీరు ఈ శిక్షను 5-3-1943 నుండి 6 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. కోనా రంగయ్య (వల్లభరావుపాలెం):సహాయ నిరాకరణోద్ల్యమంలో భాగంగా 1921లో తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి రాజీనామా చెసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. మేడా రంగయ్య (పెదనందిపాడు): విశాఖపట్నంలో ఎం.బి.బి.యస్. చదువుతుండగా జాతీయోద్యమంపట్ల ఆకర్షితులయ్యారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఫలితంగా 23-1-1941 నుండి 25-7-1941 వరకు వెల్లూరు, రాజమండ్రి సెంట్రల్ జైళ్ళలో కారాగారకి గురయ్యారు. నూతలపాటి రంగయ్య ఎలియాస్ దొంగయ్య (జమ్ములపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన 6-8-1932 వరకు జైలుశిక్ష అనుభవించారు. వీరు ఈ శిషను రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. మాధవరెడ్డి రత్నం (బాపట్ల) సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి రాజీనామా చెసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. పొట్టూరి రోశయ్య శాస్త్రి (పొన్నూరు): సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం వలన వీరు 23-3-1922లో అరెస్ట్ అయ్యారు. నూతక్కి సాంబశివరావు (బ్రాహ్మణకోడూరు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వలన 25-4-1944న వీరు జైలు శిక్షకు గురయ్యారు. వీరు ఈ శిక్షను అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. జాలాది సత్యనారాయణ (నిడుబ్రోలు): క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ ను తగలబెట్టడంతో ప్రభుత్వం వీరికి మూడున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. తూములూరి సత్యనారాయణ( పొన్నూరు): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరికి 6 నెలల కారాగార శిక్ష విధించబడింది. జైలు నుండి విడుదలయ్యాక శాసనోల్లంఘనలో పాల్గొనడంతో 23-1-1931 నుండి 6 నెలలపాటు జైలు శిక్ష విధించబడింది. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక వలన 12-3-1931 లో జైలు నుండి విడుదలయ్యారు. అల్లూరి సత్యనారాయణ రాజు (మంతెనవారిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన వీరికి 50 రు. జరిమానా మరియు 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 25-1-1932 నుండి రాజమండ్రి జైలులో అనుభవించారు. మంతెన సత్యనారాయణ రాజు (ఖాజీపాలెం) ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 18-5-1930 నుండి రాజమండ్రి మరియు కోరాపుట్ జైళ్ళలో అనుభవించారు. తన్నీరు సత్యవతమ్మ (బాపట్ల) శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 1932లో అరెస్ట్ కాబడ్డారు. మంతెన సత్యనారాయణ రాజు (అల్లూరు): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న మనసబు ఉద్యోగానికి రాజీనామా చెసి స్వాతంత్ర్ల్యోద్యమంలో పాల్గొన్నారు. ఆధారపురపు శేషగిరిరావు (పొన్నూరు): శాసనోల్లంఘనలో పాల్గొని వీరు 23-1-1931 నుండి 6 నెలలపాటు జైలుకెళ్ళారు. మరలా అదే ఉద్యమంలో పాల్గొని 22-6-1932న మరోమారు జైలుపాలై 6 నెలలు ఈ శిక్షను అనుభవించారు. ఇందుకూరి శేషం రాజు అలియాస్ సోమరాజు (బుద్దాం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన వీరికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 12-5-1932 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. మంతెన సత్యనారాయణ రాజు (అల్లూరు): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1921లో తను చేస్తున్న మునసబు ఉద్యోగానికి రాజీనామా చచేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. చివుకుల శేషశాస్త్రి (బాపట్ల): విలక్షణ వ్యక్తిత్వం గల వీరు అది నుంచి స్వాతంత్ర్యోద్ల్యమంలో చురుకైన పాత్ర వహించారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడం వలన వీరికి 9 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఈ శిక్షను వీరు 14-12-1940 నుండి వెల్లూరు మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. 50 రు.జరిమానా కూడా వీరికి విధించబడింది. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనడంతో 20రు. జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించబడింది. భూపోరాటాలు, ముఠా వర్కర్ల పోరాటాలు వంటి అనేక ప్రజ పోరాటాల్లో వీరు పాల్గొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కు వ్యతిరేకంగానూ వీరు పోరాడారు. వీరు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో విమాన దాడుల నుంచి తీసుకోవలసిన రక్షణ జాగ్రత్తల సాంకేతిక బోధకుడు (ఎయిర్ రెయిడ్ ప్రికాషన్స్) గా పని చేశారు. ఆనాటి నుంచి వీరిని ఎ.అర్.వి.శాస్త్రిగా పిలిచేవారు. ఆ సందర్భంగా వీరు ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు 'ఏ.అర్.వి.లో చేరరా, ఎంతో దేశ సేవ చేయరా' అనే పాటను రచించి, ప్రచారం చేశారు. అంధ్ర ప్రాంతంలోననే కాకుండా వీరు తెలంగాణాలోనూ నిజాంకు వ్యతిరేకంగా పేద రజలకోసం పోరాటాలు చేసారు. 1950 మే 12న వీరు ఎంకౌంటర్లో మరణించారు. వీరి స్మృతికి చిహ్నంగా బాపట్ల చీలు రోడ్డులో 'చివుకుల శేషశాస్త్రి స్మారక స్తూపం' నిర్మించబడింది. షేక్ ఫకీర్ అహ్మద్ (పెదనందిపాడు): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 15-1-1922 లో తను నిర్వహిస్తున్న గ్రమాధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. షేక్ మస్తాన్ (నిడుబ్రోలు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం వీరికి మూడున్నర సంవత్సరాలపాటు కారాగార శిక్ష విధించింది. 24-9-1942 నుండి వీరు ఈ శిక్షను అలీపురం క్యాప్ జైలులో అనుభవించారు. షేక్ మొహియుద్దీన్ (పెదనందిపాడు): సహాయ నిరాకరణోద్యమంలో బాగంగా 15-1-1922 లో తను నిర్వహిస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.శాసనోల్లంఘనలో పాల్గొని 16-1-1933 నుండి సంవత్సరంపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. వీరికి 2000 రు. జరినానా కూడా విధించబడింది. మంతెన సింగరాజు (బుద్దాం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 100రు. జరిమానా మరియు ఏడాదిపాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-5-1930 నుండి 11-3-1931 వరకు రాజమండ్రి మరియు బళ్ళారి సెంట్రల్ జైళ్ళాలో అనుభవీంచారు 1932 లో శాసనోల్లంఘనోద్యమంలో పికెటింగ్ చేస్తుండగా ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి, గ్రామ పోలిమేరల్లో పంటరిగా వదిలేసివచ్చింది. దాట్ల సీతారామరాజు (ఖాజీపాలెం): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 6 నెలలపాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 27-5-1942 నుండి 11-3-1931 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 6నెలలు పాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 3-10-1930 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించి గాంధి-ఇర్విన్ ఒప్పందం కారణంగా 11-3-1931న విడుదలయ్యారు. నేతి శివరామకృష్ణయ్య (నండూరు): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 6 నెలల పాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 4-3-1931 నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించి గాంధి-ఇర్విన్ ఒప్పందం కారణంగా 11-3-1931 న విడుదలయ్యారు. మంతెన శివరామరాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 9 నెలలపాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 20-5-1930 నుండి రాజమండ్రి, కోయంబత్తూరు, ఆలీపురం సెంట్రల్ జైళ్ళలో అనుభవించారు. నండూరి శివరామయ్యా (బాపట్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. తూములూరి శివరామయ్య (పొన్నూరు):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన 4-6-1930 నుండి ఏడాదిపాటు శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన 24-2-1932 నుండి 21 నెలలపాటు, మరలా క్విట్ ఇండియాలో పాల్గొనడం వలన 1942లోనూ జైలు శిక్ష అనుభవించారు. రాజమండ్రి, కన్ననూరు మరియు నెల్లూరు జైళ్ళలో వీరు ఈ శిక్షను అనుభవించారు. యడ్ల పాటి శివరామయ్య అలియాస్ శివాజి (యాజలి): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వలన 26-2-1941 నుండి 9 నెలలపాటు వీరికి జైలు శిక్ష విధించబడింది.వీరు ఈ శిక్షను రాజమండ్రి మరియు అలీపురంజైళ్ళలో అనుభవించారు. ధూళిపూడి నాగేశ్వరరావు : స్వాతంత్ర్య సంగ్రామంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.ఇండియన్ ఆర్మీలో చేసి పదవీ విరమణ పొందారు. కప్పగంతుల శ్రీరామమూర్తి (బాపట్ల):శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనడం వలన వీరికి బ్రిటిష్ ప్రభుత్వం 9 నెలలపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 14-8-1930 నుండి 11-3-1931 వరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు.ఐనప్పటికీ ఇదే ఉద్యమంలో మరోమారు పాల్గొన్నారు. అంతేకాకుండా సత్యాగ్రహంలో పాల్గొని 22-4-1940 నుండి 9 నెలలపాటు మరోమారు కారాగార శిక్ష అనుభవించారు.క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 10-9-1942 నుండి 18 నెలలపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షలను రాజమండ్రి వెల్లూరు ఆలీపురం జైళ్ళలో అనుభవించారు.
అన్నం రాజు శ్రీరాములు (గోపాలపురం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నేతి శ్రీరాములు అలియాస్ శ్రీరామనాధం (నండూరు): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని 4-3-1931 నుండి 6 నెలలపాటు కఠిన కారాగార శిక్షకు గురైనాగాంధి-ఇర్విన్ ఒప్పందం ఫలితంగా 11-3-1931లోనే విడుదలయ్యారు. పసుపులేటి శ్రీరాములు (పూండ్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ మునసబు పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. దంతులూరి సుబ్బమ్మ (మంతెనవారిపాలెం): శాసనోల్లంఘనోద్యమంలో పికెటింగ్ చేస్తుండగా వీరిని అరెస్ట్ చేసి బలవంతంగా గ్రామ పొలిమేరలకు తీసుకెళ్ళి బహిష్కరణ శిక్ష విధించారు. భేతాళం సుబ్బరాజు (ఖాజీపాలెం) ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 24-5-1930 నుండి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. రాజమండ్రి మరియు బళ్ళారి జైళ్ళలో వీరు శిక్షను అనుభవించారు. మంతెన సుబ్బరాజు (బుద్దాం):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు కూడా 11-5-1930 నుండి ఏడాదిపాటు కారాగార శిక్షకు గురియ్యారు. రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో వీరు ఈ శిక్షను అనుభవించారు. మంతెన సుబ్బరాజు (మంతెనవారిపాలెం)ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు కూడా 18-5-1930 నుండి 9 నెలలపాటు కారాగార శిక్షకు గురయ్యారు. రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో వీరు శిక్షను అనుభవించారు. అలపర్తి సుబ్బారావు (పొన్నూరు): శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని వీరు కూడా 5-7-1930 నుండి 6 నెలలపాటు కారాగార శిక్షకు గురియ్యారు. రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో వీరు శిక్షను అనుభవించారు. 1932లో కూడా మరోమారు ఇదే ఉద్యమంలో పాల్గొని 6 నెలలపాటు శిక్షకు గురయ్యారు. పాకల సుబ్బారావు (పొన్నూరు):1930లో అతి చిన్న వయసులో వీరు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని వీరుబ్రిటిష్ పోలీసుల కొరడా దెబ్బలను శిక్షగా అనుభవించారు. అంతేకాకుండా 2 సం||ల కఠిన కారాగార శిక్షకు గురయ్యారు.చెంగల్ పట్ లోని బాల నేరస్తుల కారాగారంలో వీరు ఈ శిక్షను మార్చి 1931 దాకా అనుభవించారు.అనంతరం 1932లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరో 6 నెలలపాటు కఠిన కారాగార శిక్షకు గురయ్యారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని మరోమారు జైలు శిక్షకు గురై, బ్రిటిష్ వాడికి తన గుండె నిబ్బరాన్ని చాటారు. దొంతినేని సుబ్బయ్య (బోడిపాలెం): సహాయ నిరాకరభోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ మునసబు పదవికి 1921లో రాజనామా చేసి స్వారంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. కొల్లి సుబ్బయ్య (నిడుబ్రోలు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి బ్రిటిష్ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు కఠినకారాగారశిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. పూట్ల సుబ్బయ్య (పొన్నూరు): వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 10-12-1940 నుంది 6 నెలలపాటు కఠిన కారాగార శిషకు గురయ్యారు. నెళ్ళూరు మరియు తిరుచురాపల్లి జైళ్ళలో వీరు ఈ శిక్షను అనుభవించారు. సందెపూడి సుబ్బయ్య(మర్రిపూడి) : శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని రాజమండ్రి మరియు కన్ననూరు జైళ్ళలో 14-8-1930 నుండి 8 నెలలపాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. కూసంపూడి సుందర రామరాజు (ఖాజీపాలెం): సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి మరియు తిరుచురాపల్లి జైళ్ళలో 18-5-1930 నుండి 9 నెలలపాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. సుందరరాయుడు (కర్లపాలెం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. కూచిభొట్ల సూర్యనారాయణ (బాపట్ల): 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం వలన ప్రభుత్వం వీరికి 2 వారాల కఠిన కారాగార శిష విధంచారు. భట్టి ప్రోలు సూర్యప్రకాశరావు (బాపట్ల): ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి బ్రిటిష్ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఘనత వీరిది. సహాయ నిరాకరణోఅద్యమంలో పాల్గొని 18-11-1921 నుండి 2 సం|| ల 1 నెలపాటు కఠిన కారాగార శిక్షకు గురియ్యారు. వీరు ఈ శిక్షకు రాజమండ్రి, మద్రాసు, కడలూరు, మరియు కోయంబత్తూరులలో అనుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక చీరాల-పేరాల ఉద్యమంలో పాల్గొన్నారు. 1923లో నాగపూర్ జండా సత్యగ్రహంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 3-5-1930 నుండి 2 సం||లపాటు ఖఠిన కారాగార శిక్షకు గురయ్యారు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం వల్ల 12-3-1931న విడుదలయ్యారు. ఆగ్రహారంలోని వీరి స్వగృహంలో నీరు ఎన్నో రహస్య సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాలకు టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి వంటి ఎందరో ఉద్యమకారులు పాల్గొనేవారు. వీరు అజ్ఞాతంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వీరిగృహంపై పలుమార్లు దాడులు నిర్వహించింది. వీరి ఇంట్లోని వస్తువులను బయటకి విసిరిగొట్టి వీరీఅచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అజ్ఞాతంలో ఉండగా వీరు రాజాజీ సలహాతో కాశీకి వెళ్ళారు. అక్కడినుంచి వచ్చేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని ఆగ్రహారం శివాలయంలో ప్రతిష్ఠించారు. ప్రముఖ కవి గుర్రం జాషువా వీరిని స్వగృహంలో తరచు కలుస్తుండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం వీరికి తామ్ర పత్రాన్నిచ్చి గౌరవించింది. వేగేశిన తమ్మిరాజు (మంతెనవారిపాలెం): శాసనోల్లంఘనలో పాల్గొనడం వలన 22-6-1932 నుండి ఏడున్నర నెలలు కారాగార శిక్షకు గురయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో వీరు ఈ శిక్షను అనుభవించారు. మంతెన తాతం రాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 18-5-1930 నుండి 18 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. కొసరాజు తాతయ్య (నిడుబ్రోలు): శాసనోల్లంఘనలో పాల్గొని 8-2-1932 నుండి ఏడాదిపాటు రాజమండ్రి మరియు తిరుచురాపల్లి జైళ్ళలో శిక్ష అనుభవించారు. తాండవకృష్ణయ్య (పూండ్ల): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. వేదాంతం వాసుదేవరావు (బాపట్ల): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 10-9-1942 నుండి 18 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులో కఠిన కారాగార శిఖ అనుభవించారు. వీరికి 200రు. జరిమానా కూడా విధించబడింది. కొత్త వెంకటాచలపతిరావు (ఇటికంపాడు) : న్యాయవాద విద్య చదువుతుండగా గాంధీజీ పిలుపు మేరకు విద్యకు స్వస్తిచెప్పి స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 27-4-1930 నుండి ఏడాదిపాటు రాజమండ్రి, మద్రాసు మరియు వెల్లూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. మాచిరాజు వెంకట అప్పారావు (చందోలు): సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం వలన 7-2-1922 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు.అనంతరం శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 12-8-1930 నుండి 6నెలలపాటు రాజమండ్రి మరియు అలీపురం జైళ్ళలో శిక్ష అనుభవించారు. కుమ్మమూరు వెంకటప్పయ్య (బాపట్ల): క్విట్ ఇందియా ఉద్యమంలో పాల్గొన్న వీరు 5-3-1943 నుండి 6 నెలలపాటు అలీపురం క్యాంప్ జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మాచిరాజు వెంకటప్పయ్య (పిట్టలవానిపాలెం): సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా తను నిర్వహిస్తున్న గ్రామ కరణం పదవికి 1921లో రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గోగినేని వెంకటప్పయ్య చౌదరి (నిడుబ్రోలు): వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 22-4-1941 నుండి 2 నెలలపాటు బళ్ళారిలో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మంతెన వెంకట రాధాకృష్ణం రాజు (మర్రిపూడి): పదవ తరగతి చదువుతుండగానే వీరు జాతీయోద్యమంపట్ల ఆకర్షితులై చదువుకు స్వస్తిచెప్పి ఉద్యమంలోకి దూకారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అజ్ఞాతంలోకి వెళ్ళారు. రెందవ ప్రపంచ యుద్దం సమయంలో (1943-44) ఇండియన్ నేవీలో ఉద్యోగంలో చేరారు. 1947-48లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు.గొట్టుముక్కల వెంకటరాజు (బుద్దాం): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 12-5-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షకు గురయ్యారు. కనుమూరి వెంకటరాజు (మంతెనవారిపాలెం) : ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 22-5-1930 నుండి 1 సం||పాటు రాజమండ్రి, వెల్లూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని25-1-1932 నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు బళ్ళారి జైళ్ళలో కఠిన కారాగార సిక్ష అనుభవించారు. కొత్తపల్లి వెంకటరాజు (ఖాజీపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 20-5-1930 నుండి 9 నెలలపాటు రాజమండ్రి, కోయంబత్తూరు మరియు అలీపూం జైళ్ళలో శిక్ష అనుభవించారు. కొత్తపల్లి వెంకటరాజు (కర్లపాలెం): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు 22-5-1930 నుండి 9 నెలలపాటు రాజమండ్రి, సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. మంతెన వెంకటరాజు (ఖాజీపాలెం):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాజమండ్రి, కోయంబత్తూరు మరియు అలీపూం జైళ్ళలో శిక్ష అనుభవించారు. మంతెన వెంకటరాజు మంతెనవారిపాలెం): 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని రెండు సార్లు అరెస్ట్ కాబడ్డారు. మంతెన వెంకటరాజు (మంతెనవారిపాలెం):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు 27-6-1930 నుండి 5 నెలలపాటు రాజమండ్రి, తురుచురాపల్లి మరియు అలీపురం జైళ్ళలో శిక్ష అనుభవించారు. మంతెన వెంకట రాధా కృష్ణం రాజు తదితర దేశభక్తులు 1945 జనవరి 25 రాత్రి మునిసిపల్ హై స్కూల్ భవనం (ప్రస్తుత వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ కార్యలయం) మీద బ్రిటీష్ జండాను తొలగించి, మువ్వన్నెల జండాను ఎగురవేసారు. మరుసటి రోజు ఉదయం ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఎగురుతున్న ఆ జండాను ఎంతో ఉద్వేగంతో తిలకించారు. ఈ దేశభక్తులు నాడు మునిసిపల్ హై స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న 16 సం||లలోపు విద్యార్ధులు కావడం విశేషం. ఓగిరాల వెంకటరామదీక్షితులు (నండూరు) : సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 7-2-1922 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు.ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనిమరో 18 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. మంతెన వెంకటరామారాజు (మంతెనవారిపాలెం):.ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటం వలన 185-1930 నుండి 9 నెలలపాటు కోరాపుట్ మరియు రాజమండ్రి జైళ్ళలో శిక్ష అనుభవించారు. సెనగల వెంకటరామయ్య(నరసాయపలెం): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన 25-8-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. తోలు వెంకటరామయ్య (బాపట్ల): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 5-7-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. అన్నం రాజు వెంకటరావు(నండూరు):శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన 23-1-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. మంత్రవాది వెంకటరత్నం(గుడిపూడి):శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన 6-8-1930 నుండి 14-3-1931 వరకు రాజమండ్రి మరియు అలీపురం జైలులో శిక్ష అనుభవించారు. వెంకటరత్నం తూనుగుంట (బాపట్ల): సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు వీరు తన గ్రామ మునసబు పదవికి రాజీనామా చేసి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. బెండూరి వెంకటసాంబశివరావు (పొన్నూరు):ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 13-5-1930 నుండి 2 సం||అపాతు వెల్లూరు మరియు కన్ననూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. చెరుకూరి వెంకటశేషయ్య (బాపట్ల): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 7-5-1930నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించారు. కనుమూరి వెంకటసుబ్బరాజు (పిట్టలవానిపాలెం): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడం వలన వీరికి ప్రభుత్వం 1930-32 లో రెండుసార్లు అరెస్ట్ చెసింది. గంగరాజు వెంకటసుబ్బరాజు (కొమ్మూరు): గ్రామ కరణంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తన పావికి 15-1-1922న రాజీనామా చేశారు. పొన్నూరు వెంకట సుబ్బారావు (పొన్నూరు): ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల ప్రభుత్వం 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 13-5-1930 నుండి వెల్లూరు, మద్రాసు మరియు అలీపురం జైళ్ళలో అనుభవించారు. ఓగేటి వెంకట సుబ్బరాయ శాస్త్రి (యాజలి): సహాయ నిరాకరణ పాల్గొన్నందువల్ల ప్రభుత్వం 16-3-1922 నుండి 1 సంవత్సరం పాటు కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను రాజమండ్రి సెంట్రల్ జైలులో అనుభవించారు. జాలాది వెంకటేశ్వర్లు (బాపట్ల): సత్యాగ్రహంలో పాల్గొన్నందువల్ల 29-1-1941 నుండి 4 నెలలపాటు వీరు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. కంకిపాటి వెంకటేశ్వర్లు (జమ్ములపాలెం):సత్యాగ్రహంలోను క్విట్ ఇండియా ఉద్యమంలోనూ వీరు 31-1-1941 నుండి 3 నెలలపాటు వీరు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు.
పావన వెంకటేశ్వర్లు (పొన్నూరు): క్విట్ ఇందియా ఉద్యమంలో పాల్గొన్న వీరికి ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. వక్కలగడ్డ వెంకటేశ్వర్లు (గునుపూడి): శాసనోల్లంఘనలో పాల్గొని 3-10-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు. వారణాసి వీరరాఘవస్వామి (పొన్నూరు): సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందువల్ల వీరు 23-3-1922న అరెస్ట్ చేయబడ్డారు. సంఘం వీరరాఘవయ్య (బ్రాహ్మణకోడూరు): శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందువల్ల 23-9-1930 నుండి 6 నెలలపాటు రాజమండ్రి మరియు వెల్లూరు జైళ్ళలో శిక్షను అనుభవించారు. తోట వీరాస్వామి (బాపట్ల):శాసనోల్లంఘనలో పాల్గొని 3-2-1931నుండి 4 నెలలపాటు రాజమండ్రి జైలులో శిక్షను అనుభవించారు. అల్లం వీరయ్య (పొన్నూరు): క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో ప్రభుత్వం వీరికి మూడున్నర సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 24-9-1942 నుండి అలీపురం క్యాంప్ జైలులో అనుభవించారు. వెలగతోట వీరయ్య (పెదనందిపాడు): 1921-22 సత్యాగ్రహానికి మద్దతుగా తాను చేస్తున్న గ్రామాధికారి ఉద్యోగానికి వీరు రాజీనామా చేశారు. మల్లాది యజ్ఞనారాయణ శర్మ (బాపట్ల): భారత రాష్ట్రపతిగా చేసిన వి.వి.గిరికి వీరు అత్యంత ప్రియ శిష్యులు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడంతో ప్రభుత్వం వీరికి 1 సంవత్సరంపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. వీరు ఈ శిక్షను 18-5-1930 నుండి రాజమండ్రి,తిరుచురాపల్లి, కడలూరు, మద్రాసు. బళ్ళారి, జైళ్ళలో అనుభవించారు. జైలు నుంచి విడుదలైన వెంటనే శాసనోల్లంఘనలో పాల్గొని 6-1-1932 నుంచి మరో 6 నెలలపాటు శిక్షకు గురయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా వీరు పాల్గొని 23-11-1942 నుండి 13-12-1944 వరకు వెల్లూరు మరియు తంజావూరు జైళ్ళలో శిక్ష అనుభవించారు. తుపాకుల యెల్లయ్య (పెదనందిపాడు) : సత్యాగ్రహంలో భాగంగా వీరు 1921-22లో తన గ్రామాధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కన్నేటి వెంకట్రావు : పలు ఉద్యమాల్లో పాల్గొని నాటి యువతకు స్పూర్తిదాయకులయ్యారు. మద్దులూరి రామకృష్ణ : పసితనుండే స్వతంత్ర భావాలు అలవరుచుకొన్నవీరు 8ఏళ్ళ లేత వయసులో స్వతంత్ర భావాలను తన తోటి బాలలతో పంచుకునేవారు.తన ఇంటి వరండాలోని మహాత్మాగాంధీ చిత్రపటాన్ని చూస్తూ రోజూ ఉత్తేజం పొందుతుండేవారు.ఐతే ఆ ఫోను చూసిన అనాటి తాసిల్దార్ దానిని తొలగించవలసిందిగా రామకృష్ణను అదేశించడంతో బాలుదైన రామకృష్ణ అందుకు తిరస్కరించారు.పలితంగా ఆ లేత హరిజన్ వెల్ఫేర్ పండ్ కోసం కొంత ధనాన్ని ఆయనకు ఇచ్చారు.చదువుకు మధ్యలో తాత్కాలికంగా స్వస్తి చెప్పి స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా 4నేలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించారు.1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వీరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా అజ్ఞాతంలోకి వెళ్ళి, రహస్యంగా "స్వతంత్ర భారతి" అనే పత్రికను ప్రచురించి ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. గుడివాడ రామచంద్రరావు : తన సహచరులతో కలసి గాంధీగారి ఆశయాలను అక్షరాలా నెరవేర్చిన వ్యక్తి వీరు. పోరాడితేనే తప్ప స్వాతంత్ర్యాన్ని సముపార్జించలేమని చాటుతూ గాంధీ గారి పోరాట స్పూర్తిని పుణికిపుచ్చుకుని స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్నారు. కొమ్మినేని వెంకటేశ్వరరావు : వీరు ప్రాధమిక విద్యతోనే చదువుకు స్వస్తి చెప్పి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా టెలిఫోన్ తీగలు ధ్వంసం చేసి కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. 1962లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బాపట్ల శాసనసభ్యునిగా గెలుపొందారు. మహత్మాగాంధి - వరలక్షమ్మ: ఆది 1921వ సంవత్సరం. స్వరాజ్య నిధికోసం బాపూజీ ఆంధ్ర దేశంలో పత్యటిస్తూ బందరులో బస చేశారు. ఆ సమయంలో అదే ఊరిలో బస చేశారు. ఆ సమయంలో అదే ఊరిలో ఉన్న ప్రముఖ రచయిత్రి, సంఘసంస్కర్త, శ్రీమతి కనుపర్తివరలక్షమ్మ తాను స్వయంగా వడికిన నూలును,ఒక ఉంగరాన్ని బాపూజీకి సమర్పించారు.అది స్వీకరించిన బాపూజీ ఆమెతో 'రోజూ నూలు వడుకుతున్నావా?'అనడిగారు. ఆమె ఆవునని చెప్పారు. 'ఐతే ఈ రోజునుంచి ఖద్దరు కట్టుకుంటావా' అని ఆమెను తిరిగి ప్రశ్నించారు. దానికి ఆమేకట్టుకుంటానూ అని సమాధానం చెప్పారు.ఆనాటినుంచి ఆమె అఖరి క్షణం వరకు బాపూజీకిచ్చిన మాటకు కట్టుబడి ఖద్దరు వస్తాలనే ధరించారు. పల్లపోతు శ్రీనివాసరావు (బాపట్ల): స్వాతంత్రోద్యమానికి సంబంధించిన ప్రతి పోరాటంలోను వీరు పాల్గొన్నారు. అనేకమార్లు జైలు శిక్ష అనుభవించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత ప్రభుత్వం వీరికి తామ్ర పత్రాన్ని బహుకరించి సత్కరించింది.వీరేకాక అంకరాజు భుజంగరావు, అంకరాజు పద్మావతి, నాళం బాలకృష్ణ, ఊటుకూరి హయగ్రీవ గుప్త, వేముల వెంకట సుబ్బారావు, వెంకటరత్నం, సాక్షి సోమయాజులు, కళ్ళపూడి సుబ్బారావు అచంట రంగ నాయకులు, మాధవపెద్ది కాళిదాసు, కప్పగంతుల రామ్మూర్తి, అశ్వఖుల్లా ఖాన్, ఇంకా చరిత్రకందని అనేకమంది సమర వీరులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని తమ ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేశారు. మహిళా మూర్తుల్లో పాటిబండ్ల కోటమ్మ, వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ, కనుమర్తి వరలక్ష్మమ్మ, సుబ్బమ్మ వంటి అనేక మంది వీర వనితలు కూడా ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఉద్యమంలో పాల్గొని బాపట్లకు స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో స్దానం కల్పించి చిరస్మరణీయులైనారు.