
పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, బాపట్ల నియోజకవర్గ నాయకులు కోన రఘుపతి, సలగల రాజశేఖర్‌బాబు, మోదుగుల బసవపున్నారెడ్డి, కళ్ళం హరనాథ్‌రెడ్డి రైల్వేస్టేషన్‌కు చేరుకుని జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. జగన్ వస్తున్నారని తెలుసుకుని వేకువజామునే జనం పురవీధుల్లోకి వచ్చారు. రోడ్లుకిరువైపులా నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ నుంచి నేరుగా మహాత్మాగాంధీరోడ్డు మీదుగా జీబీసీ రోడ్డులో పొన్నూరు బయలుదేరారు. మార్గం మధ్యలో ఈతేరు గ్రామస్తులు జగన్ కాన్వాయ్‌ను ఆపారు. జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడాలని పట్టుబట్టారు. జగన్ కొద్దిసేపు వారితో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చిన బాపట్ల నాయకుల్లో గొర్రుమచ్చు ఆనందరావు, ఇనగలూరి మాల్యాద్రి, అక్కి సత్యనారాయణ, దగ్గుమల్లి సుభాషణరావు, కొర్నేలు, దొంతిరెడ్డి కోటిరెడ్డి, ధర్మారావు తదితరులు ఉన్నారు.