
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర గుంటూరు జిల్లా బాపట్లలో కొనసాగుతోంది. కంకటపాలెం నుంచి ప్రారంభమైన ఓదార్పు యాత్ర వెదుళ్ళపల్లి, స్టువర్ణుపురంల మీదుగా కొనసాగింది. పలుచోట్ల మహానేత విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. వైఎస్ హయాంలో పేదలు ఎంతో సంతోషంగా కాలం గడిపారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు.