గుంటూరు జిల్లా బాపట్లలో ఇవాళ సీఎం రోశయ్య పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ డిజిటల్ లైబ్రరీని , సమగ్ర వసతి భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. పాతబస్టాండ్‌లో ఐదువందల కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ డ్రైనేజీ ఆధునీకరణ పనులకు సంబంధించిన పైలాన్‌ను సీఎం ప్రారంభిస్తారు. తర్వాత ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొంటారు. అనంతరం కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత రైతు సదస్సులో రోశయ్య ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.