గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసు వాహనం ఢీకొని ముగ్గురు మరణించడంతో ఆగ్రహించిన మృతుల బంధువులు రాస్తారాకోకు దిగారు. రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ ఆందోళన చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి గాదె వెంకట్ రెడ్డి , కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.